For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పి-నోట్ల నియంత్ర‌ణ‌కు సెబీ క‌స‌ర‌త్తు

పార్టిసిపేటరీ నోట్స్ అనగా ఆఫ్‌షోర్ ఇన్వెస్ట్‌మెంట్‌. దీని అర్దం ఏమిటంటే వీటి సహాయంతో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం భారతదేశం వెలుపల(విదేశాల నుంచి) ఉపయోగిస్తారు. భార‌త‌దేశం కాకుండా విదేశ

|

పి-నోట్ల రూపంలో నల్లధనం మార్కెట్‌లో ప్రవేశించడాన్ని నిరోధించేందుకు విదేశీ సంస్థలు జారీ చేసే ఒక్కో పి-నోట్‌పై వెయ్యి అమెరికన్‌ డాలర్ల (రూ.65000) రెగ్యులేటరీ ఫీజును సెబి ప్రతిపాదించింది. అలాగే స్పెక్యులేటివ్‌ ధోరణిలో పి-నోట్ల జారీని నిలువరించడం కూడా తన లక్ష్యమని తెలిపింది. పి-నోట్లు లేదా ఆఫ్‌షోర్‌ డెరివేటివ్‌ ఉత్పత్తుల (ఒడిఐ) రూపంలో వస్తున్న విదేశీ పెట్టుబడులు ఇప్పటికే నాలుగు నెలల కనిష్ఠ స్థాయి రూ. 1.68 లక్షల కోట్లకు దిగజారిన నేపథ్యంలో మార్కెట్ నియంత్ర‌ణ సంస్థ‌ తాజా చర్యలను ప్రతిపాదించింది. ఒక దశలో స్టాక్‌మార్కెట్‌లోకి పి-నోట్లు, ఒడిఐల రూపంలో వచ్చిన విదేశీ నిధుల పరిమాణం 50 శాతం వరకు ఉండగా ఇప్పుడది కేవలం ఆరు శాతానికి దిగజారింది. ఒడిఐ రూట్‌ను దుర్వినియోగం చేయడాన్ని నివారించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్టు సెబీ సోమవారం జారీ చేసిన సంప్ర‌దింపుల‌(కన్సల్టేషన్‌) పత్రంలో తెలిపింది. ఈ పత్రాలు ఎవరు తీసుకున్నది, ఇతర ఒడిఐ సబ్‌స్క్రయిబర్ల వివరాలు నమోదు చేసేందుకు అవసరమైన ప్రత్యేక ఐటి పరికరాలను సెబి సమకూర్చుకుందని, ఇప్పుడు అలా గుర్తించిన ఎఫ్‌పిఐలపై రెగ్యులేటరీ ఫీజు కూడా విధించాలనుకుంటున్నామని సెబి తెలియచేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే అమలు చేయాలనుకుంటున్న ఈ విధానం కింద ఒక్కో పి-నోట్‌ పై మూడు సంవత్సరాల కాలానికి వెయ్యి డాలర్ల రెగ్యులేటరీ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.

 పార్టిసిపేట‌రీ నోట్ దుర్వినియోగానికి అడ్డుక‌ట్ట వేసేందుకు సెబీ య‌త్నాలు

పార్టిసిపేట‌రీ నోట్ అంటే
పార్టిసిపేటరీ నోట్స్ అనగా ఆఫ్‌షోర్ ఇన్వెస్ట్‌మెంట్‌. దీని అర్దం ఏమిటంటే వీటి సహాయంతో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం భారతదేశం వెలుపల(విదేశాల నుంచి) ఉపయోగిస్తారు. భార‌త‌దేశం కాకుండా విదేశాల్లో ఏర్ప‌డిన సంస్థ‌లు విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదార్లు(ఎఫ్ఐఐ), విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబ‌డిదారుల నుంచి డ‌బ్బును సేక‌రించి మ‌న దేశంలో విప‌రీతంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ఈ మార్గం ప‌నికొస్తుంది.

Read more about: investors fpi fii
English summary

పి-నోట్ల నియంత్ర‌ణ‌కు సెబీ క‌స‌ర‌త్తు | Sebi looks to tighten the screws on P-Notes

The Securities and Exchange Board of India (Sebi) proposes to levy a $1,000 fee on foreign portfolio investors (FPIs) for each participatory note (P-Note) issuance in an effort to cut down on speculative investments.In a consultation paper released on Monday, the markets regulator also proposed banning P-Notes that are based on derivatives used purely for speculative purposes.
Story first published: Tuesday, May 30, 2017, 9:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X