For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన 2వేల కంపెనీల్లో భార‌త్ నుంచి 58

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)..ఫోర్బ్స్ మ్యాగజైన్ గ్లోబల్ 2000 జాబితాలో భారత్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. 4,180 కోట్ల డాలర్ల విక్రయాలు, 430 కోట్ల డాలర్ల లాభం, 97

|

* మన దేశం నుంచి రిలయన్స్ టాప్
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)..ఫోర్బ్స్ మ్యాగజైన్ గ్లోబల్ 2000 జాబితాలో భారత్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. 4,180 కోట్ల డాలర్ల విక్రయాలు, 430 కోట్ల డాలర్ల లాభం, 9790 కోట్ల డాలర్ల ఆస్తులు, 7,120 కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ లిస్టులో 106వ స్థానం దక్కింది. గతేడాది టెలికం రంగంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి పెట్టుబడిదారుల్లో సంస్థపై నమ్మకం మెరుగుపడటంతో ఆర్‌ఐఎల్ షేరు ధర భారీగా పుంజుకుందని ఫోర్బ్స్ ఇండియా ఎడిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో టాప్ బ్రాండ్లు

భార‌త్ నుంచి రిలయన్స్ టాప్(106వ స్థానం)

ఈ జాబితాలో గ‌తేడాది 56 దేశీయ సంస్థలకు చోటు దక్కగా, ఈసారి 58 సంస్థలకు చోటు లభించింది.అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ర్యాంకులు ప్ర‌క‌టించిన‌ట్లు ఫోర్బ్స్ వెబ్‌సైట్ గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది. గతేడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న దేశీయ కంపెనీల్లో బ్యాంకులు, ఐటీ రంగానికి చెందినవే అధికం. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 244వ స్థానం దక్కింది. గతేడాది బ్యాంక్ 146వ స్థానంలో ఉంది. అలాగే ప్రభుత్వరంగ ఇంధన సంస్థ ఓఎన్‌జీసీకి 246వ స్థానం(గతేడాది 220) లభించింది. ప్ర‌పంచ స్థాయి ఆర్థిక సేవ‌ల కంపెనీల విభాగంలో భార‌త మూలాలు క‌లిగిన‌ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌కు అంత‌ర్జాతీయంగా టాప్‌-10లో స్థానం ద‌క్క‌డం విశేషం.

Read more about: forbes ril
English summary

ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన 2వేల కంపెనీల్లో భార‌త్ నుంచి 58 | RIL placed at 106 in Forbes Global 2000 latest list

Mukesh Ambani-led Reliance Industries (RIL) is the highest ranked Indian firm in Forbes magazine's 'Global 2000' list this year which sees the number of Indian companies in 2017 rising to 58 from last year's 56."Reliance Industries has witnessed a surge in investor confidence at the stock markets after the launch of its telecom arm Reliance Jio Infocomm late last year," Forbes' India edition said in a statement here on Thursday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X