For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐడీబీఐ రేటింగ్‌ను త‌గ్గించిన మూడీస్‌

మూల‌ధ‌న ఆధారాల‌ను తిరిగి ప్ర‌గ‌తి బాట పట్టించి, అలాగే తిరిగి రికవరీ బాటలో బ్యాంక్‌ను నడిపించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామ‌ని బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమితుడయిన మహేశ్ కుమా

|

* లాభాల బాట‌కు స‌రికొత్త వ్యూహం రూపొందించుకున్న బ్యాంకు

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ రేటింగ్ ఏజన్సీ మూడీస్ ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌ను గురువారం 'బిఏ2'నుంచి 'బిఏఏ3'కి తగ్గించింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందనేదానికి దాని రేటింగ్ తగ్గింపు నిదర్శనమని మూడీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఏడాదికేడాది నష్టాలు పెరిగిపోతుండడం, తన ఆస్తుల‌ నాణ్యత సైతం దిగజారిపోతుండడంతో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఐడీబీఐ తన మూలధనాన్ని పెంచుకోవడంతో పాటుగా మొండి బకాయిల రికవరీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తిరిగి లాభాల బాటలో పయనించడం కోసం ఒక వ్యూహాన్ని రూపొందించుకుంది2016 ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ నికర నష్టాలు రూ.3,665 కోట్లు ఉండగా, 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి అవి రూ. 5,158 కోట్లకు చేరుకున్నాయి. కాగా, క్రితం సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దాని నిరర్థక ఆస్తులు సైతం దాదాపు రెండింత‌లై 21.25 శాతానికి చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో దాని నికర ఎన్‌పీఏలు 6.78 శాతంనుంచి 13.21 శాతానికి పెరిగి పోయాయి.

 బ‌ల‌హీన‌మైన ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన ఐడీబీఐ

మూల‌ధ‌న ఆధారాల‌ను తిరిగి ప్ర‌గ‌తి బాట పట్టించి, అలాగే తిరిగి రికవరీ బాటలో బ్యాంక్‌ను నడిపించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామ‌ని బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమితుడయిన మహేశ్ కుమార్ జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
రాబోయే రోజుల్లో నిర్వహణ ఖర్చులను తగ్గంచుకోవడంతో పాటు అప్రధాన ఆస్తులను విక్రయించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని బ్యాంక్ యోచిస్తోందని జైన్ చెప్పారు. అంతేకాదు భారీ ఎత్తున బకాయిల వసూలుతో పాటుగా ఖర్చులను తగ్గించుకోవాలని, అలాగే కార్పొరేట్ రుణాల వాటాలను రిస్క్ ఎక్కువగా ఉండే ఆస్తులను తగ్గించుకోవాలని కూడా యోచిస్తున్నామని, దీనివల్ల మూలధనంపై ఒత్తిడి తగ్గుతుందని కూడా ఆయన చెప్పారు.

Read more about: idbi moodys banking
English summary

ఐడీబీఐ రేటింగ్‌ను త‌గ్గించిన మూడీస్‌ | IDBI Bank crafts turnaround plan

Hit by weak profitability and deteriorating asset quality, state-run IDBI Bank on Thursday said it had formulated a turnaround strategy focusing on augmenting capital base and recovery from bad loans.“We are looking at all avenues to improve our capital position and bring the bank on the recovery track,” the bank’s newly-appointed managing director and chief executive officer, Mahesh Kumar, Jain stated.
Story first published: Friday, May 26, 2017, 14:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X