For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం బాధాక‌ర‌మ‌న్న నారాయ‌ణ‌మూర్తి

ఐటీ కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం బాధాక‌ర‌మైన విష‌యమ‌ని ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి అన్నారు. ఈ మ‌ధ్య ఉద్యోగుల‌ను తొల‌గించ‌డంపై మీ అభిప్రాయ‌మేమిటి అని పీటీఐ అడిగిన ప్ర‌శ్న‌కు ఇది బాధ క‌లిగించే విష‌య‌మ‌

|

ఐటీ కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం బాధాక‌ర‌మైన విష‌యమ‌ని ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి అన్నారు. ఈ మ‌ధ్య ఉద్యోగుల‌ను తొల‌గించ‌డంపై మీ అభిప్రాయ‌మేమిటి అని పీటీఐ అడిగిన ప్ర‌శ్న‌కు ఇది బాధ క‌లిగించే విష‌య‌మ‌ని ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. ఇటీవ‌లే మ‌ధ్య‌, సీనియ‌ర్ స్థాయి ఉద్యోగుల్లో వంద‌లాది మందిని తొల‌గించ‌నున్న‌ట్లు ఐటీ దిగ్గ‌జ సంస్థ ఇన్ఫీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పోటీ సంస్థ‌లు విప్రో, కాగ్నిజెంట్ ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు ఇటువంటి నిర్ణ‌యం తీసుకుంటుండ‌టంతో బెంగుళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ఇన్ఫోసిస్ సైతం ఇదే బాట ప‌ట్టింది.

 ఐటీ ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం బాధాక‌ర‌మ‌న్న నారాయ‌ణ‌మూర్తి

కాగ్నిజెంట్ మాత్రం కేవ‌లం డైరెక్ట‌ర్లు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్లు వంటి రూ.40 ల‌క్ష‌ల పైబ‌డి జీతం తీసుకునే వారిని తొల‌గించేందుకు రంగం సిద్దం చేసింది. వారంద‌రికీ దాదాపు 6 నుంచి 9 నెల‌ల పాటు వేత‌న ప్యాకేజీని ఇచ్చి సాగ‌నంపుతారు. వారు వేరే చోట ఉపాధిని ఎంచుకోవ‌చ్చు లేదా ఉద్యోగ విర‌మ‌ణ చేయాల‌ని సంస్థ త‌ల‌పోస్తున్న‌ట్లు స‌మాచారం. విప్రో ఇది వ‌ర‌కే ప‌నితీరు ఆధారంగా 600 మందిని తొల‌గించ‌గా మొత్తం మీద 2000 మందిని ప‌క్క‌న పెట్టనున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికాలో వీసాల క‌ట్ట‌డికి ట్రంప్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పాటు, ప్రాజెక్టుల‌కు సైతం ష‌ర‌తులు విధిస్తుండ‌టం, మ‌రోవైపు ఆటోమేష‌న్‌, కృత్రిమ మేధ వంటి కార‌ణాల‌తో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల‌ను ప‌నితీరు ఆధారంగా తొల‌గించ‌క తప్ప‌నిస‌రి ప‌రిస్థితి నెల‌కొంది.

Read more about: infosys software
English summary

ఐటీ ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం బాధాక‌ర‌మ‌న్న నారాయ‌ణ‌మూర్తి | After IT Companies Lays Off Thousands, Narayana Murthy Expresses Sadness

IT companies have been one of the largest recruiters in the country. However, they have warned that increasing automation of processes would lead to reduction in hiring in coming years.While the outsourcing model has placed India on the global map, increasing scrutiny and rising protectionist sentiment are also posing challenges for the $140 billion Indian IT industry.
Story first published: Friday, May 26, 2017, 15:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X