For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60 వ‌సంతాల ఎల్ఐసీ

ఎల్ఐసీ 2017 నాటికి 60 వ‌సంతాలు పూర్తిచేసుకుంది. ఈ వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా ఆ సంస్థ త‌న‌ను తాను దేశానికి అంకితం చేసుకుంటోంది. దేశ బీమా రంగంలో సామాన్యుడి కోసం ఎల్ఐసీ కీల‌క పాత్ర పోషించింది. ఈ సంద‌ర్భంగా

|

ఎల్ఐసీ 2017 నాటికి 60 వ‌సంతాలు పూర్తిచేసుకుంది. ఈ వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా ఆ సంస్థ త‌న‌ను తాను దేశానికి అంకితం చేసుకుంటోంది. దేశ బీమా రంగంలో సామాన్యుడి కోసం ఎల్ఐసీ కీల‌క పాత్ర పోషించింది. ఈ సంద‌ర్భంగా ఎల్ఐసీ ప్ర‌స్థానంలో కొన్ని మైలు రాళ్ల‌ను గురించి తెలుసుకుందాం.

1. పెట్టుబడులు

1. పెట్టుబడులు

ఎల్ఐసీ త‌న ఈక్విటీ పెట్టుబ‌డుల ద్వారా 2017లో 72% లాభాన్ని ఆర్జించింది. ఇది దాదాపు రూ.19 వేల కోట్ల‌కు స‌మానం. 2016 నాటికి ఎల్ఐసీ మొత్తం ఆస్తులు 20 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ఉన్నాయి. 1956లో ఇది రూ.5 కోట్లతో మొద‌లైంది.

2. ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియో

2. ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియో

ఎల్ఐసీ త‌న నిధుల‌ను వివిధ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎన్నో స్టాక్ మార్కెట్ దిగ్గ‌జాలు ఈ జాబితాలో ఉన్నాయి. బీఎస్ఈలో ఐటీసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కోల్ ఇండియా, సెయిల్‌, ఎన్ఎమ్‌డీసీ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల్లో త‌న పోర్ట్‌ఫోలియోను ఎల్ఐసీ వైవీధ్యీక‌రించింది.

3. బీమాదార్ల ప‌రంగా చూస్తే

3. బీమాదార్ల ప‌రంగా చూస్తే

మొద‌టి ఏడాది ప్రీమియం ప‌రంగా కొత్త పాల‌సీల్లో మార్కెట్ మొత్తంలో ఎల్ఐసీ వాటా 76.83% కావ‌డం గ‌మ‌నార్హం. 2015-16 సంవ‌త్స‌రంలో ఎల్ఐసీ 20 కోట్ల క్లెయింల్లో రూ.85,519 కోట్ల‌ను బీమా హామీ సొమ్ముగా చెల్లించింది. 2016-17లో 40% అధికంగా బోన‌స్‌ను, డివిడెండ్‌ను ప్ర‌భుత్వానికి చెల్లించింది.

4. ఎల్ఐసీ ప్రారంభమైందిలా...

4. ఎల్ఐసీ ప్రారంభమైందిలా...

పార్ల‌మెంటు చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ యాక్ట్(19జూన్‌,1956) ద్వారా జీవిత బీమా సంస్థ ప్రారంభ‌మైంది. దేశ‌వ్యాప్తంగా 1956 సెప్టెంబ‌రు 1న ఎల్ఐసీ త‌న కార్య‌క‌లాపాల‌ను మొద‌లుపెట్టింది. దేశంలో ఎక్కువ మందికి బీమా విస్త‌రించాల‌నే కార‌ణంతో , జీవిత బీమా వల్ల ఎక్కువ మంది ప్ర‌యోజనం పొందాల‌ని దీని ఉద్దేశం. చాలా త‌క్కువ ప్రీమియంతో అంద‌రికీ జీవిత బీమాను చేయించాల‌ని ఎల్ఐసీ సంస్థ ల‌క్ష్యంగా ఉంది.

5. ఎల్ఐసీ కార్యాల‌యాలు

5. ఎల్ఐసీ కార్యాల‌యాలు

మొద‌ట్లో దేశ వ్యాప్తంగా ఎల్ఐసీకి 5 జోన‌ల్ కార్యాల‌యాలు ఉన్నాయి. 33 డివిజ‌న‌ల్ కార్యాలయాలు, 212 బ్రాంచీ కార్యాల‌యాలు ఉన్నాయి. ఇవి కాకుండా 1956 లో మొద‌లైన కార్పొరేట్ కార్యాల‌యం ముంబ‌యిలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎల్ఐసీకి ఏజెంట్లు ఉన్నారు.

6. ఎల్ఐసీ విస్త‌ర‌ణ‌

6. ఎల్ఐసీ విస్త‌ర‌ణ‌

చాలా త‌క్కువ కాలంలోనే ఎల్ఐసీ దేశ‌వ్యాప్తంగా విస్త‌రించింది. 1957లో రూ.200 కోట్లుగా ఉన్న వ్యాపారం 1969-70 నాటికే 1000 కోట్ల మైలు రాయిని చేరుకుంది. 20వ శ‌తాబ్దం ముగిసే నాటికి 35 కోట్ల పాల‌సీల‌తో 8ల‌క్ష‌ల కోట్ల నిధుల‌ను ఎల్ఐసీ క‌లిగి ఉంది.

7. ఎల్ఐసీ నెట్‌వ‌ర్క్‌

7. ఎల్ఐసీ నెట్‌వ‌ర్క్‌

ప్ర‌స్తుతం ఎల్ఐసీకి 2048 కంప్యూట‌రైజ్‌డ్ బ్రాంచీ కార్యాల‌యాలు ఉన్నాయి. 8 జోన‌ల్ కార్యాల‌యాలు, 113 డివిజ‌న‌ల్ కార్యాల‌యాలు, 2048 బ్రాంచీలు, 1381 శాటిలైట్ కార్యాల‌యాలు, కార్పొరేట్ కార్యాల‌యాలు ఉన్నాయి. ఇంతే కాకుండా 54 క‌స్ట‌మ‌ర్ జోన్లు, 25 మెట్రో ప్రాంత సేవా హ‌బ్‌లు అద‌నం. 13,37,064 మంది ఏజెంట్లు, 242 కార్పొరేట్ ఏజెంట్లు, 89 రెఫ‌ర‌ల్ ఏజెంట్లు, 98 బ్రోక‌ర్లు, 42 బ్యాంకులు ఎల్ఐసీ బీమా వ్యాపారం కోసం ప‌నిచేస్తున్నాయి.

8. ఎల్ఐసీ ఉద్యోగులు

8. ఎల్ఐసీ ఉద్యోగులు

2016 మార్చి 31 నాటికి ఎల్ఐసీలో 1.14 ల‌క్ష‌ల మందికి పైగా ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. ఫోన్ చేయ‌డం ద్వారా కానీ, నేరుగా సంద‌ర్శించ‌డం ద్వారా కానీ త‌మ ప‌నిని నెర‌వేర్చుకునేందుకు ఎల్ఐసీ క‌స్ట‌మ‌ర్ జోన్ల‌ను ఏర్పాట చేసింది. 2016 నాటికి దేశ‌వ్యాప్తంగా ఇలాంటివి 73 ప‌నిచేస్తున్నాయి. ఉద‌యం 8 గం.ల నుంచి రాత్రి 8 గం.ల వ‌ర‌కూ ప‌నిచేస్తాయి(సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కూ)

9. మార్చి 31,2016 నాటికి కొన్ని గ‌ణాంకాలు

9. మార్చి 31,2016 నాటికి కొన్ని గ‌ణాంకాలు

ఎల్ఐసీ మునుప‌టి ఆర్థిక సంవ‌త్స‌రంలో 20,28,967 పాల‌సీల‌ను అమ్మింది. వృద్ది రేటు 8.54%. కొత్త పాల‌సీల ప‌రంగా చూస్తే 9.89% వృద్దిని సాధించింది. మొద‌టి ప్రీమియం చెల్లింపుల ద్వారా సంక్రమించిన ఆదాయం రూ. 2627.97 కోట్లు కాగా వృద్ది రేటు 10.21%. మొత్తం బీమా రంగంలో ఎల్ఐసీ వృద్ది రేటు 16.67%(2015-16).

ఎల్ఐసీ ఘ‌న‌త‌లు

ఎల్ఐసీ ఘ‌న‌త‌లు

ఎక‌న‌మిక్ టైమ్స్ బ్రాండ్స్ ఈక్విటీ స‌ర్వే 2012లో ఎల్ఐసీ విశ్వసించ‌దగిన బ్రాండ్ల‌లో ఎల్ఐసీ 6 వ స్థానంలో నిలిచింది. 2006 నుంచి ప్ర‌తి యేటా రీడ‌ర్స్ డైజెస్ట్ ట్ర‌స్ట్‌డ్ బ్రాండ్ అవార్డు గెలుస్తోంది. బ్రాండ్ ట్ర‌స్ట్ నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో 2011-14 మ‌ధ్య ప్ర‌తిసారి బీఎఫ్ఎస్ఐ కేట‌గిరీలో మొద‌టిస్థానాన్ని ద‌క్కించుకుంది. ఈ ఏడాది మొత్తం బ్రాండ్ల‌లో 18వ స్థానాన్ని ఎల్ఐసీ సాధించింది.

Read more about: lic ఎల్ఐసీ
English summary

60 వ‌సంతాల ఎల్ఐసీ | LIC COMPLETES 60 YEARS OF ITS FOUNDATION

Life Insurance Corporation of India (LIC) has completed its 60 years of its foundation on September 1, 2016. LIC has dedicated the diamond jubilee year to nation. LIC has played a vital role in providing life insurance to common people and in dedicating people’s money in public welfare.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X