For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ బ్యాంకు ఖాతాపై 4% వ‌డ్డీ, డెబిట్ కార్డు

ఎన్నో రోజులుగా పేటీఎమ్ వాలెట్ యూజ‌ర్లు ఎదురుచూస్తున్న పేటీఎమ్ బ్యాంకు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని వార్తా ప‌త్రిక‌ల ప్ర‌క‌ట‌న‌లు, పేటీఎమ్ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్ల‌డించారు. నోట్ల రద్దు త

|

ఎన్నో రోజులుగా పేటీఎమ్ వాలెట్ యూజ‌ర్లు ఎదురుచూస్తున్న పేటీఎమ్ బ్యాంకు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని వార్తా ప‌త్రిక‌ల ప్ర‌క‌ట‌న‌లు, పేటీఎమ్ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్ల‌డించారు. నోట్ల రద్దు త‌ర్వాత పేటీఎమ్ ఎంత వేగంగా ఎదిగిందో అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం పేటీఎమ్ బ్యాంకు ఖాతా ద్వారా జ‌ర‌గనున్న 10 గొప్ప మార్పుల‌ను తెలుసుకుందాం.

1. వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు

1. వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు

అన్ని పేటీఎమ్ వాలెట్ ఖాతాలు ఆటోమేటిక్‌గా పేటీఎమ్ పేమెంట్ బ్యాంకుకు మార‌తాయి. పేటీఎమ్ వాలెట్ క‌లిగిన వారు బ్యాంకు ఖాతాకు బ‌ద‌లాయించ‌బ‌డ‌ద‌నుకుంటే [email protected] మెయిల్ ఐడీకి అభ్య‌ర్థ‌న పంపాలి. లేదా paytm.com/care పేటీఎమ్ వెబ్‌సైట్లో ఇక్క‌డ‌కు వెళ్లి పేటీఎమ్ బ్యాంకు ఖాతాకు వెళ్లొద్దు అనే ఆప్ష‌న్ ఎంచుకోవాలి. త‌ర్వాత మీ బ్యాంకు ఖాతాకు పేటీఎమ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యేలా చూసుకోవ‌చ్చు.

2. ఖాతా 6 నెల‌ల పాటు వాడ‌ని వార‌యితే

2. ఖాతా 6 నెల‌ల పాటు వాడ‌ని వార‌యితే

అయితే వాలెట్ నుంచి మారిన త‌ర్వాత సైతం మీది పేటీఎమ్ బ్యాంకులో వాలెట్ ఖాతాలానే కొన‌సాగుతుంది. ఆరు నెల‌ల పాటు నిష్క్రియాప‌రంగా ఉన్నా లేదా అస‌లు బ్యాలెన్స్ లేక‌పోయినా అలాంటి వాటిని పేటీఎమ్ బ్యాంకుకు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌రు. పేటీఎమ్ బ్యాంకు ఖాతాదారులుగా కావాల‌నుకుంటే మీరు పేటీఎమ్ పొదుపు లేదా క‌రెంటు ఖాతాను తెర‌వొచ్చు. రెండింటికీ సేమ్ లాగిన్ వివ‌రాలు ఉన్న‌ప్ప‌టికీ మీరు ప్ర‌త్యేకంగా పేటీఎమ్‌లో బ్యాంకు ఖాతా తెర‌వాల్సిందే.

3. మొద‌ట బీటా వెర్ష‌న్‌

3. మొద‌ట బీటా వెర్ష‌న్‌

పేటీఎమ్ పేమెంట్ బ్యాంకులో ఖాతాల‌ను మొద‌ట ఉద్యోగుల‌కు. అనుబంధ సంస్థ‌ల‌కు బీటా వెర్ష‌న్‌లో తెరుస్తున్నారు. మిగిలిన వారు కావాల‌నుకుంటే ఇన్వైట్ రిక్వెస్ట్ ద్వారా అకౌంట్‌ను ఓపెన్ చేయ‌వ‌చ్చు. ఈ ఖాతాల‌న్నింటికీ రూ.1 ల‌క్ష అనేది గ‌రిష్ట ప‌రిమితి. ఇది వాలెట్ కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఖాతాల్లో నిల్వ‌కు వ‌డ్డీ రావ‌డంతో పాటు మీరు డెబిట్ కార్డు పొందే వీలుంది.

 ఖాతా తెరిచేందుకు

ఖాతా తెరిచేందుకు

మీరు పేటీఎమ్ బ్యాంకు ఖాతా తెర‌వాలి అనుకుంటే పేమీఎమ్ బ్యాంకు పేజీ చూడాలి. అక్క‌డ రిక్వెస్ట్ యాన్ ఇన్వైట్ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. త‌ర్వాత పేటీఎమ్ ఖాతాలో సైన్ ఇన్ అవ్వాల్సిందిగా అడుగుతుంది. ఒక‌సారి అది పూర్త‌యిన త‌ర్వాత పేటీఎమ్ బ్యాంకు ఖాతాదారుగా మారిపోయిన‌ట్లే.

www.paytmpaymentsbank.com

పేటీఎమ్ బ్యాంకు ఖాతా- క్యాష్ బ్యాక్

పేటీఎమ్ బ్యాంకు ఖాతా- క్యాష్ బ్యాక్

5. ఖాతాదారులు పేటీఎమ్ బ్యాంకు ఖాతాలోకి రూ.25 వేల కంటే ఎక్కువ బ‌దిలీ చేస్తే మీరు రూ.250(1%) క్యాష్ బ్యాక్ రూపంలో పొందుతారు. ఇలా గ‌రిష్టంగా నాలుగు సార్లు పొంద‌వ‌చ్చు. కేవైసీ క‌లిగిన పేటీఎమ్ ఖాతాదారులు మాత్ర‌మే పేటీఎమ్ బ్యాంకు ఖాతా తెరిచేందుకు అర్హ‌త క‌లిగి ఉంటారు.

జీరో బ్యాలెన్స్ అకౌంట్‌

జీరో బ్యాలెన్స్ అకౌంట్‌

పేటీఎమ్ బ్యాంకు ఖాతా తెరిచేందుకు క‌నీస నిల్వ అంటూ ఏ నిబంధ‌న లేదు. అంతే కాకుండా ఆన్‌లైన్ లావాదేవీల‌(నెఫ్ట్, ఐఎమ్‌పీఎస్‌, ఆర్టీజీఎస్)కు ప్ర‌త్యేకంగా ఎటువంటి రుసుముల్లేవు. పేటీఎమ్‌కు క్రెడిట్ కార్డు జారీ చేసే అవ‌కాశం లేక‌పోయినా డెబిట్ కార్డులు మాత్రం ఇచ్చే వీలుంది.

7. 4% వార్షిక వ‌డ్డీ

7. 4% వార్షిక వ‌డ్డీ

పేటీఎమ్ వాలెట్‌కు బ్యాంకు ఖాతాకు ప్ర‌ధాన వ్య‌త్యాసం ఏమిటంటే ఖాతాలో నిల్వ‌పై వ‌డ్డీ. పేటీఎమ్ బ్యాంకు ఖాతాదారుల‌కు 4% వార్షిక వ‌డ్డీని ఇస్తుంది. మామూలుగా యాక్సిస్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఇచ్చే వ‌డ్డీ కూడా ఇంతే. అయితే ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు మాత్రం ఖాతాదారుల‌కు 7.5% వ‌డ్డీ ఇస్తోంది.

 ఖాతా స‌దుపాయాలు

ఖాతా స‌దుపాయాలు

అంతే కాకుండా వాలెట్‌కు దీనికి మ‌రో ప్ర‌ధాన తేడా ఇక్క‌డ కార్డులు తీసుకోవచ్చు. పేటీఎమ్ త‌న ఖాతాదారుల‌కు డెబిట్ కార్డుల‌ను జారీ చేసే అధికారం క‌లిగి ఉంది. పేటీఎమ్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం చెక్కు పుస్త‌కం, డీడీ, డెబిట్ కార్డు వంటి స‌దుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇందు కోసం నామ మాత్ర‌పు రుసుములు తీసుకోవ‌చ్చు. దీనికి భిన్నంగా ఎయిర్‌టెల్ చెల్లింపుల బ్యాంకు కేవ‌లం వ‌ర్చువల్ కార్డు మాత్ర‌మే ఇస్తోంది.

9. డెబిట్ కార్డు వార్షిక రుసుము

9. డెబిట్ కార్డు వార్షిక రుసుము

పేటీఎమ్ బ్యాంకు రూపే డెబిట్ కార్డును జారీ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వార్షిక రుసుముగా రూ.100 తో పాటు డెలివ‌రీ చార్జీల‌ను ఇందుకోసం వ‌సూలు చేస్తుంది. ఒక‌వేళ కార్డు పోగొట్టుకుంటే కొత్త‌ది కావాలంటే అందుకోసం రూ.100, డెలివ‌రీ చార్జీల‌ను చెల్లించాల్సి వ‌స్తుంది. 10 లీఫ్లు క‌లిగిన చెక్కుపుస్త‌కం రూ.100 ఖ‌రీదు అవుతుంది. డెలివరీ చార్జీలు అద‌నం.

10. డెబిట్ కార్డు చార్జీలు

10. డెబిట్ కార్డు చార్జీలు

పేటీఎమ్ బ్యాంకు స‌రికొత్త‌గా దానికై ప్ర‌త్యేకమైన ఏటీఎమ్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ది. నాన్ మెట్రో ఏటీఎమ్‌ల్లో 5 సార్లు, మెట్రో ఏటీఎమ్‌ల్లో 3 సార్లు ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్ యంత్రాల్లో సైతం పేటీఎమ్ డెబిట్ కార్డ‌ను ఎటువంటి చార్జీలు లేకుండా వాడుకోవ‌చ్చు. దాని త‌ర్వాత విత్‌డ్రాయ‌ల్ చార్జీగా రూ.20 క‌ట్టాల్సిందే. అలా కాకుండా మిగిలిన లావాదేవీలు(ఉదా.. బ్యాలెన్స్ చెక్) చేసుకునేందుకు రూ.5 చార్జీ భ‌రించాలి.

Read more about: paytm
English summary

పేటీఎమ్ బ్యాంకు ఖాతాపై 4% వ‌డ్డీ, డెబిట్ కార్డు | What paytm bank Means for Paytm Users

Paytm Payments Bank is officially launching in India today ( 23rd May 2017). As we have mentioned earlier, Paytm Payments Bank is not a traditional bank, it is more of a transactions bank rather than a depository bank. Paytm revealed quite a few details of this bank before the launch, and we sum up everything here for the benefit of our readers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X