For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగుళూరు బెల్లందూర్ లేక్ చుట్టూ ఉన్న ప‌రిశ్ర‌మ‌లు మూయాలి

బెంగుళూరు మ‌హాన‌గ‌రంలోని బెల్లందూర్ లేక్ చుట్టూ ఉన్న 76 ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేసేలా చూడాల‌ని జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ ఆదేశించింది. ఆయా ప‌రిశ్ర‌మ‌ల‌కు త‌క్ష‌ణ‌మే నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ను నిలిపి వేయాల

|

బెంగుళూరు మ‌హాన‌గ‌రంలోని బెల్లందూర్ లేక్ చుట్టూ ఉన్న 76 ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేసేలా చూడాల‌ని జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ ఆదేశించింది. ఆయా ప‌రిశ్ర‌మ‌ల‌కు త‌క్ష‌ణ‌మే నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ను నిలిపి వేయాల్సిందిగా న‌గ‌ర డెప్యూటీ క‌మీష‌న‌ర్‌ను ఆదేశిస్తూ జ‌స్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. అంతే కాకుండా లేక్‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న హౌసింగ్ సొసైటీలు, నివాస గృహ స‌ముదాయాల్లో ఉండే వారు అక్క‌డే సీవ‌రేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉండేలా చూసుకోవాల‌ని సూచించింది. ఈ విధంగా ఏర్పాటు లేక‌పోతే వాటికి కూడా విద్యుత్‌, నీటి స‌ర‌ఫ‌రాను నిలిపివేయాల్సి వ‌స్తుంద‌ని చెప్పింది.

 76 ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేయాల్సిందిగా ఎన్‌జీటీ ఆదేశం

లేక్‌కు స‌మీపంలో ఉన్న హౌసింగ్ సొసైటీలు, నివాస స‌ముదాయాలు ఏర్పాటు చేసిన సీవ‌రేజీ ప్లాంట్ల‌ను బెంగుళూరు జ‌ల మండ‌లి, సీవ‌రేజీ బోర్డు, రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి నుంచి అధికారుల‌తో కూడిన ఉమ్మ‌డి అధికారుల బృందం త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని ఎన్‌జీటీ ఆదేశాలిచ్చింది. ప్ర‌భుత్వం సూచించిన పరామితుల‌తో కూడిన సీవరేజీ ప్లాంట్లే ప‌నిచేసేలా చూడాల‌ని లేనియెడ‌ల అక్క‌డ ఉండే ఇళ్ల‌కు నీటి స‌రఫ‌రా, విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ను నిలిపివేయాల్సిందేన‌ని ఎన్‌జీటీ పేర్కొంది. ఇందుకు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని తెలిపింది.

Read more about: bangalore industries pollution
English summary

బెంగుళూరు బెల్లందూర్ లేక్ చుట్టూ ఉన్న ప‌రిశ్ర‌మ‌లు మూయాలి | NGT directs closure of polluting industries around Bellandur lake in Bengaluru

The green panel directed the joint inspection team comprising of officials from Bangalore Water Supply and Sewerage Board and the state pollution control board to jointly inspect all STPs that have been installed by housing societies and residential complexes near the lake.“The STPs in buildings which are not operating, shall be given a time bound programme to bring the parameters within the prescribed limit, failing which the electricity and water supply will be disconnected to such complexes. However, reasonable time shall be granted to them to comply to the prescribed parameters,” the bench said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X