For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా మోటార్స్ ఉద్యోగుల్లో 1500 మంది తొల‌గింపు

సంస్థ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా 1500 ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు టాటా మోటార్స్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తన మొత్తం ఉద్యోగుల్లో కొంత మంది టాప్‌ ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది.

|

సంస్థ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా 1500 ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు టాటా మోటార్స్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తన మొత్తం ఉద్యోగుల్లో కొంత మంది టాప్‌ ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. మేనేజర్‌ స్థాయిలో దాదాపు 1500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు బుధవారం ప్రకటించింది. టాటా మోటార్స్ ఫ‌లితాల సంద‌ర్భంగా సీఈవో ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు.

10 శాతం మంది తొల‌గింపు

10 శాతం మంది తొల‌గింపు

వైట్‌ కాలర్‌ ఉద్యోగులకు సంబంధించి 10-12 శాతం (సుమారు1500)మందిని తొలగిస్తున్నట్టు టాటా మోటార్స్‌ ఎండీ, సీఈవో గుంటెర్‌ బుచ్చక్ ప్రకటించారు. టాటా మోటార్స్‌ వార్షిక ఫలితాల సందర్భంగా ఆయన వివరాలను తెలిపారు. అలాగే బ్లూకాలర్‌ ఉద్యోగుల్లోఎలాంటి తొలగింపులు లేవని స్పష్టం చేశారు. అయితే పనితీరు మరియు నాయకత్వ లక్షణాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని కంపెనీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సి రామకృష్ణన్ తెలిపారు. ఇది నిర్వహణ ఖర్చుల తగ్గింపులో భాగ కాదని వివరణ ఇచ్చారు.

జేఎల్ఆర్ త్రైమాసిక ఫ‌లితాలు

జేఎల్ఆర్ త్రైమాసిక ఫ‌లితాలు

కాగా 2016-17 క్యూ4లో టాటా మోటార్స్ బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో జేఎల్‌ఆర్‌ నికర లాభం 18 శాతం ఎగసి 55.7 కోట్ల పౌండ్లను తాకగా.. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 726.8 కోట్ల పౌండ్లకు చేరింది. టాటా మోటార్స్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 17 శాతం క్షీణించి రూ. 4296 కోట్లను, మొత్తం ఆదాయం 3 శాతం తగ్గి రూ. 78,747 కోట్లను తాకింది.

చ‌రిత్రాత్మ‌క స‌మీక్ష‌

చ‌రిత్రాత్మ‌క స‌మీక్ష‌

సంస్థ భ‌విష్య‌త్ గురించి కొన్ని అంశాల‌ను వివ‌రించారు. టాటా మోటార్స్ సంస్థ మొత్తం చ‌రిత్ర‌లోనే ఒక ప్రాథ‌మిక‌మైన స‌మీక్ష జ‌రుగుతోంది. ఒక కొత్త నిర్మాణంతో సంస్థ మళ్లీ పున‌రుజ్జీవం పొంద‌బోతున్న‌ది. జ‌వాబుదారీత‌నం, బాధ్య‌త‌ను పెంచేందుకు ఈ క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న‌ద‌ని ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న కొంత మంది అధికారులు తెలిపారు. అయితే అంద‌రూ అనుకున్న‌ట్లు ఖ‌ర్చులు త‌గ్గించేందుకు ఇది చేయ‌డం లేద‌న్నారు. 1500 మందిలో కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ఎంచుకున్నారనీ, మరికొంతమందిని ఇతర విభాగాలను బదిలీ చేసినట్టు చెప్పారు.

టాటా మోటార్స్‌ గురించి

టాటా మోటార్స్‌ గురించి

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్‌. టాటా గ్రూప్‌లో ప్ర‌ధాన సంస్థ అయిన టాటా మోటార్స్ ముఖ్యంగా కార్లు, వ్యాన్లు,ట్ర‌క్కులు, బ‌స్సులు, స్పోర్ట్ కార్లు, నిర్మాణ రంగ సామాగ్రి, మిలిట‌రీ వాహ‌నాల‌ను త‌యారు చేస్తుంది. టాటా మోటార్స్ చైర్మ‌న్‌గా ఎన్‌.చంద్ర‌శేఖ‌ర‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2016 నాటికి ఈ సంస్థ‌లో 60 వేల మంది ప‌నిచేస్తున్నారు.

Read more about: tata motors lay offs
English summary

టాటా మోటార్స్ ఉద్యోగుల్లో 1500 మంది తొల‌గింపు | Lay Off: Tata Motors Cuts Up To 1,500 Managerial Jobs

Tata Motors said it has reduced its managerial workforce by up to 1,500 people domestically as part of an organizational restructuring exercise. "The reference (total managers) on which we started (the exercise) was in the vicinity of 13,000...we do see as far as the white collar population is concerned, an overall reduction in the vicinity of 10-12 per cent (up to 1,500)," managing director and chief executive Guenter Butschek told reporters here. He was speaking after announcing the company's earnings for fiscal 2016-17.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X