For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ చెల్లింపుల బ్యాంకు కార్య‌క‌లాపాలు ప్రారంభం

పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. రూ.1 ల‌క్ష లోపు డిపాజిట్‌తో పేటీఎమ్ బ్యాంకులో ఖాతాను తెరిచే వీలుంది. బ్యాంకు ప్రారంభించిన‌ సంద‌ర్భంగా వినియోగదారులకు చెల్లించనున్న వార్షిక వడ్డీరేటు

|

పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. రూ.1 ల‌క్ష లోపు డిపాజిట్‌తో పేటీఎమ్ బ్యాంకులో ఖాతాను తెరిచే వీలుంది. బ్యాంకు ప్రారంభించిన‌ సంద‌ర్భంగా వినియోగదారులకు చెల్లించనున్న వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. దాదాపు ఒక సంవత్సరం ఆలస్యంగా కొత్త కార్య నిర్వ‌హణ అధికారి ఆధ్వర్యంలో పేటీఎమ్‌ తన చెల్లింపుల బ్యాంకు కార్య‌క‌లాపాల‌ను మొద‌లుపెట్టింది. ఢిల్లీలో మొదట శాఖను ప్రారంభించనున్నామని, ఇతర మెట్రో నగరాల్లో రెండో విడత ప్రారంభిస్తామని పేటీఎమ్ యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. మూడు నెలలు తర్వాత రెండో విడతను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.

పేటీఎమ్ పేమెంట్ బ్యాంకు కార్య‌క‌లాపాలు ప్రారంభం

దేశంలోని మొత్తం మూడు చెల్లింపులు (ఎయిర్టెల్, ఇండియా పోస్ట్) బ్యాంకులలో అత్యల్పంగా వడ్డీరేటును ఆఫర్‌ చేస్తోంది. ఏడాదికి ఎయిర్టెల్ 7.25 శాతం, ఇండియా పోస్ట్ 5.5 శాతం వడ్డీని అందిస్తూ ఉంటే పేటీఎమ్‌ మాత్రం వినియోగదారులకు 4శాతం వార్షిక వడ్డీ రేటును అందించనున్నట్టు తెలిపింది. చివ‌ర‌కు ఎస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ సైతం 5.5-7.1% వ‌డ్డీ రేటును అందిస్తున్నాయి. అయితే పేటీఎమ్‌ డిపాజిట్లపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను వెల్లడించింది. పేటీఎమ్ బ్యాంకు డిపాజిట్ తెరిచేందుకు ఎటువంటి క‌నీస నిల్వ అవ‌స‌రం లేదు.
పేటీఎమ్ పేమెంట్ బ్యాంకు కార్య‌క‌లాపాలు ప్రారంభం

2020 నాటికి కంపెనీ 50 కోట్ల ఖాతాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రణూ సత్తీ చెప్పారు. ఈ సంవత్సరంలో 31 శాఖలు, 3,000 కస్టమర్ సర్వీస్ పాయింట్లు తెరవాలని యోచిస్తోంది. చెల్లింపుల బ్యాంకులో ఖాతా తెరిచిన మొట్టమొదటి మిలియన్ కస్టమర్లకు రు .25,000 డిపాజిట్లపై రూ.250ల స్పాట్‌ క్యాష్‌ బ్యాక్‌ అందిస్తామని, అన్ని ఆన్లైన్ లావాదేవీలు ఉచితమని కంపెనీ తెలిపింది. పేటీఎమ్ పేమెంట్ బ్యాంక్ క్యాష్ విత్ డ్రాయ‌ల్ రుసుములు ఇత‌ర బ్యాంకుల్లానే ఉండ‌నున్నాయి.

Read more about: paytm పేటీఎమ్
English summary

పేటీఎమ్ చెల్లింపుల బ్యాంకు కార్య‌క‌లాపాలు ప్రారంభం | paytm is offering only 4 percent interest on savings account

Paytm Payments Bank’s interest rate is in line with all the large commercial banks, including State Bank of India, Bank of Baroda and ICICI Bank Ltd, which continue to offer 4% interest rate on savings account deposits. Some of the smaller banks, including Yes Bank Ltd and RBL Bank Ltd, offer 5.5-7.1% interest rate on savings accounts, depending on the deposit amount.
Story first published: Tuesday, May 23, 2017, 17:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X