For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

106 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

ప్రపంచవ్యాప్తంగా నెల‌కొన్న సానుకూల సంకేతాల‌ నేపథ్యంలో దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్లు పెరిగి 30,571 వద్ద ముగియ‌గా, నిఫ్టీ సైతం 10 పాయింట్లు బలపడి 9,438 వద్ద స్థిర

|

ప్రపంచవ్యాప్తంగా నెల‌కొన్న సానుకూల సంకేతాల‌ నేపథ్యంలో దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్లు పెరిగి 30,571 వద్ద ముగియ‌గా, నిఫ్టీ సైతం 10 పాయింట్లు బలపడి 9,438 వద్ద స్థిరపడింది. అయితే శుక్రవారం యూరప్‌, అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలడంతో మన మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌ను లాభాల‌తో మొద‌లుపెట్టాయి. సెన్సెక్స్‌ తొలుత 200 పాయింట్లకుపైగా దూసుకెళ్లగా.. నిఫ్టీ దాదాపు 9,500కు చేరింది. జీఎస్‌టీ కౌన్సిల్‌ సబ్బులు, వంటనూనెలు వంటి నిత్యావసర వస్తువులపై తక్కువ పన్ను రేట్లను నిర్ణయించడంతో వరుసగా రెండో రోజు ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు రాణించాయి. అయితే మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లలో భారీ అమ్మకాలు నమోదుకావడంతో మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ కొంతమేర వెనకడుగు వేశాయి. చివరికి ఓ మాదిరి లాభాలతో ముగిశాయి.

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో యునైటెడ్ స్పిరిట్స్‌(6.72%), ఐటీసీ(6.21%), వాబాగ్(2.47%), అదానీట్రాన్స్‌(2.47%), మ‌ద‌ర్‌సుమి(2.40%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(19.36%), బ్యాంక్ఆఫ్ఇండియా(11.23%), వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్‌(8.48%), జేపీ అసోసియేట్స్‌(8.26%), జెట్ ఎయిర్‌వేస్‌(8.14%) ఉన్నాయి.

Read more about: sensex stock market
English summary

106 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌ | The BSE benchmark index Sensex ended higher at 30571 by gaining 106 points

The BSE benchmark index Sensex ended higher at 30,570 in steady trade today as FMCG counters buzzed following finalisation of GST rates for bulk of the items.The BSE Sensex resumed higher at 30,638.88, and hit a high of 30,712.15 and low of 30,516.87, before closing the day at 30,570.97, up106.05 points or 0.35 per cent.The broader 50-share NSE Nifty gained 10.35 points or 0.11 per cent at 9,438.25.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X