For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ బ‌డ్డీ చార్జీల వ‌సూలు జూన్ 1 నుంచే

న‌గ‌దు లావాదేవీల‌కు సంబంధించి రుసుముల‌ను మార్చిన త‌ర్వాత దానికి సంబంధించి అన్ని విత్‌డ్రాయ‌ల్స్‌కు చార్జీలు ఉండ‌వ‌ని ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ బ‌డ్డీలో ఉండే సొమ్మును ఏటీఎమ్ ద్వారా తీసుకోవాల‌నుకు

|

న‌గ‌దు లావాదేవీల‌కు సంబంధించి రుసుముల‌ను మార్చిన త‌ర్వాత దానికి సంబంధించి అన్ని విత్‌డ్రాయ‌ల్స్‌కు చార్జీలు ఉండ‌వ‌ని ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ బ‌డ్డీలో ఉండే సొమ్మును ఏటీఎమ్ ద్వారా తీసుకోవాల‌నుకుంటే రూ.25 రుసుము ఉంటుంద‌న్నారు. ఖాతాలో సొమ్మును ఏటీఎమ్ ద్వారా విత్‌డ్రా చేసేందుకు గ‌ల నిబంధ‌న‌లు ఈ విధంగా ఉన్నాయి. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతా, జ‌న్ ధ‌న్ ఖాతాల విష‌యంలో ఏటీఎమ్ నుంచి 4 విత్‌డ్రాయ‌ల్స్‌కు ప‌రిమితి ఉంది. ఇత‌ర పొద‌పు ఖాతాల విష‌యంలో ఈ ప‌రిమితి 8 లావాదేవీలుగా ఉంది. మొత్తం 8 లావాదేవీల్లో(5 ఎస్‌బీఐ ఏటీఎమ్‌ల్లో, 3 ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల్లో) ఉచితంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మెట్రో న‌గ‌రాల్లో అయితే 8, నాన్ మెట్రో న‌గరాల్లో అయితే 10 లావాదేవీలు ఉచితం. నాన్ మెట్రో ప్రాంతాల్లో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ల్లో 5, ఇత‌ర ఏటీఎమ్‌ల్లో 5 విత్‌డ్రాయ‌ల్స్ చేసుకునే ఉచిత స‌దుపాయం ఉంది.

 ఎస్‌బీఐ ఏటీఎమ్ విత్‌డ్రా రుసుములు

అంతే కాకుండా ఇక‌పై ఖాతాదార్లు బ్యాంకింగ్ క‌రస్పాండెంట్ ద్వారా సైతం మొబైల్ వాలెట్లో డ‌బ్బు జ‌మ చేయ‌వ‌చ్చు, విత్ డ్రా చేసుకోవ‌చ్చు. వాలెట్ల‌కు సేవా రుసుములు జూన్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఎస్‌బీఐ ఎండీ ర‌జ‌నీష్ కుమార్ చెప్పారు. ఎస్‌బీఐ గ‌తేడాది నాలుగో త్రైమాసికంలో మంచి ప‌నితీరును క‌న‌బ‌రిచింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ. 2815 కోట్ల నిక‌ర లాభాన్ని న‌మోదు చేసింది. అంత‌కు ముందు సంవ‌త్స‌రం అదే త్రైమాసికంలో నిక‌ర లాభం రూ.1264 కోట్ల కంటే ఇది 112.72% ఎక్కువ‌. 2017 నాలుగో త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 57,720 కోట్లు కాగా అంత‌కు ముందు ఏడాది అదే స‌మ‌యంలో ఉన్న రూ. 53,526 కోట్ల‌తో పోలిస్తే 7.8% ఎక్కువ‌. అయితే నిర‌ర్ధ‌క ఆస్తులకు సంబంధించి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. మార్చి నెల‌తో ముగిసిన ఆర్థిక సంవత్స‌రానికి ఎప్‌పీఏలు రూ. 1,12,343 కోట్ల‌కు పెరిగాయి.

Read more about: sbi sbi buddy state bank of india
English summary

ఎస్‌బీఐ బ‌డ్డీ చార్జీల వ‌సూలు జూన్ 1 నుంచే | State Bank of India (SBI) announced that all the ATM withdrawals are not chargeable

After revising service charges for various cash transactions, State Bank of India (SBI) announced that all the ATM withdrawals are not chargeable. "Rs. 25 per transaction is charged for withdrawing from State Bank Buddy through ATMs," the lender said in a statement. It introduced a new facility that would enable withdrawal of cash through ATMs using the bank's mobile wallet. "If a customer has money in SBI Buddy, our mobile wallet, he can now withdraw that money through ATMs. Also, now customer can deposit cash or withdraw cash through business correspondent (BC) from or into our mobile wallet. These facilities were not available earlier," State Bank of India MD (national banking) Rajnish Kumar said. The service charges will be effective from June 1, 2017, he added.
Story first published: Monday, May 22, 2017, 12:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X