For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్య‌వ‌సాయంలో అధిక ఆదాయం ఉన్న‌వారికి ప‌న్ను విధించాల్సిందే

వ్య‌వ‌సాయంలో ఒక ప‌రిమితికి మించి ఆదాయం ఉన్న‌వారికి పన్ను విధించ‌డాన్ని తాను స‌మ‌ర్థిస్తున్నాన‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ బీమ‌ల్ జ‌లాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే అదే స‌మయంలో చిన్న రైతుల ఆదాయాల

|

వ్య‌వ‌సాయంలో ఒక ప‌రిమితికి మించి ఆదాయం ఉన్న‌వారికి పన్ను విధించ‌డాన్ని తాను స‌మ‌ర్థిస్తున్నాన‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ బీమ‌ల్ జ‌లాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే అదే స‌మయంలో చిన్న రైతుల ఆదాయాల‌కు ఎటువంటి ఇబ్బందులు ఉండ‌కూడ‌ద‌న్నారు. "మీకు పెద్ద ఎత్తున భూములున్నాయి అనుకుందాం, అందులో నుంచి మీకు చాలా ఎక్కువ ఆదాయం వ‌స్తుంటే, అప్పుడు ఒక ప‌రిమితికి మించి వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను వేయ‌డం గురించి ఆలోచించాలి" అని పీటీఐ ఇంట‌ర్వ్యూలో ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ చెప్పారు.

 ధ‌న‌వంతులైన రైతుల‌పై ప‌న్ను

దేశంలో ఎక్కువ మంది రైతుల‌కు చిన్న క‌మ‌తాలు ఉన్నాయి. ఏదైనా చ‌ర్య తీసుకునేట‌ప్పుడు వారిపై ఎటుంటి ప్ర‌తికూల ప్ర‌భావం ఉండ‌కూడ‌ద‌న్నారు. త‌క్కువ ద్ర‌వ్యోల్బ‌ణం, అధిక వృద్ది ఎన్‌డీఏ ప్ర‌భుత్వ ఘ‌న‌త‌లుగా చెప్పుకొచ్చారు. అయితే అవినీతిని త‌గ్గించేందుకు, ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల విష‌యంలో ఈ ప్ర‌భుత్వం చాలా చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న దృష్టిలో దేశ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంద‌ని భ‌రోసా వ్య‌క్తం చేశారు.

Read more about: farmers reserve bank of india
English summary

వ్య‌వ‌సాయంలో అధిక ఆదాయం ఉన్న‌వారికి ప‌న్ను విధించాల్సిందే | Former RBI Chief Says Government Should Think About Taxing Rich Farmers

Former Reserve Bank of India Governor Bimal Jalan on Sunday favoured taxing rich farmers earning above a certain threshold, without hurting the interests of those with small farms. He also pitched for a rating upgrade for India due to a number of steps taken by the government. Talking about the controversial issue of taxing farm income, Mr Jalan noted the importance of agriculture and small farms in the Indian situation.
Story first published: Monday, May 22, 2017, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X