For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్‌టీ త‌ర్వాత బ్యాంకు రుసుములు పెరుగుతాయా?

జీఎస్‌టీ అమ‌లు త‌ర్వాత ఆర్థిక సేవ‌లు సైతం కాస్త ప్రియం కానున్నాయి. ప్ర‌భుత్వం జీఎస్టీలో ఆర్థిక సేవ‌ల‌పై 18% ప‌న్ను నిర్ణ‌యించ‌డంతో ట్రాన్సాక్ష‌న్ రుసుముల‌ను సైతం మ‌రింత ఎక్కువగా చెల్లించాల్సి రావ‌చ్చు

|

జీఎస్‌టీ అమ‌లు త‌ర్వాత ఆర్థిక సేవ‌లు సైతం కాస్త ప్రియం కానున్నాయి. ప్ర‌భుత్వం జీఎస్టీలో ఆర్థిక సేవ‌ల‌పై 18% ప‌న్ను నిర్ణ‌యించ‌డంతో ట్రాన్సాక్ష‌న్ రుసుముల‌ను సైతం మ‌రింత ఎక్కువగా చెల్లించాల్సి రావ‌చ్చు. ఇదివ‌ర‌కూ ఇవ‌న్నీ 15% ప‌న్ను ప‌రిధిలో ఉండేవి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు బ్యాంకింగ్ వంటి ఆర్థిక సేవ‌ల‌న్నీ 18 శాతం ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తాయి. దీంతో ఇప్పుడు చెల్లించే ప్ర‌తి రూ. 100కు అద‌నంగా రూ.3 మ‌నం ఎక్కువ‌గా భ‌రించాల్సిందేన‌ని ప‌న్ను నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జులై 1 త‌ర్వాత బ్యాంకు రుసుములు...

కంపెనీల త‌ర‌పున ఆర్థిక సంస్థ‌లు ఈ అద‌న‌పు భారాన్ని త‌మ ఖ‌ర్చులోనే భాగం చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే వినియోగ‌దారుల విష‌యంలో మాత్రం క‌చ్చితంగా ఆ భారం వారే మోయాల్సి వ‌స్తుంది. ప్ర‌భుత్వం 1211 వ‌స్తు,సేవ‌ల రేట్ల‌ను జీఎస్టీ చ‌ట్టంలో భాగంగా ఖ‌రారు చేసేసింది. ఎక్కువ శాతం వ‌స్తు, సేవ‌లు 18 శాతం జీఎస్టీ ప‌రిధిలో ఉన్నాయి. ఆర్థిక సేవ‌ల‌తో పాటు ఏసీ హోట‌ళ్లు, లిక్క‌ర్‌, టెలికాం, ఐటీ సేవ‌లు, బ్రాండెడ్ దుస్తులు, రిఫైన్‌డ్ పంచ‌దార‌, పాస్తా, కార్న్ ఫ్లేక్స్‌, పేస్త్రీలు, కేకులు, నిల్వ ఉంచే కూర‌గాయలు, జామ్‌లు, సాస్‌లు, ఐస్ క్రీమ్‌లు, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, మిన‌ర‌ల్ వాట‌ర్‌, టిస్యూలు, ఎన్వ‌ల‌ప్‌లు, నోటు పుస్త‌కాలు వంటివి 18% ప‌రిధిలోకి వ‌చ్చిన వాటిలో ఉన్నాయని తెలుస్తోంది.

Read more about: gst జీఎస్‌టీ
English summary

జీఎస్‌టీ త‌ర్వాత బ్యాంకు రుసుములు పెరుగుతాయా? | You will have to shell out more for banking transactions from July

A large number of goods and services are kept under the 18% tax slab. Financial services are bracketed together with AC hotels that serve liquor, telecom and IT services, branded garments, flavoured refined sugar, pasta, cornflakes, pastries and cakes, preserved vegetables, jams, sauces, soups, ice cream, instant food mixes, mineral water, tissues, envelopes, notebooks etc.
Story first published: Saturday, May 20, 2017, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X