For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ తుది రేట్ల ఖ‌రారు

జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల స‌మావేశం త‌ర్వాత శుక్ర‌వారం వివిధ వ‌స్తు, సేవ‌ల‌కు సంబంధించి ప‌న్ను రేట్ల‌ను ఖ‌రారు చేసింది. మొత్తంగా చూస్తే నాలుగు ర‌కాల రేట్ల‌ను ఖ‌రారు చేశారు. టెలికాం, ఇన్సూరెన్స్‌, హో

|

జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల స‌మావేశం త‌ర్వాత శుక్ర‌వారం వివిధ వ‌స్తు, సేవ‌ల‌కు సంబంధించి ప‌న్ను రేట్ల‌ను ఖ‌రారు చేసింది. మొత్తంగా చూస్తే నాలుగు ర‌కాల రేట్ల‌ను ఖ‌రారు చేశారు. టెలికాం, ఇన్సూరెన్స్‌, హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ఆర్థిక సేవ‌ల‌ను కూడా జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకొచ్చారు. ఈ-కామ‌ర్స్ విష‌యంలో ప్ర‌స్తుతానికి ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి వాటిపై మూలం వ‌ద్ద 1 శాతం ప‌న్ను శాతం విధిస్తారు. ఇంకా టెక్స్‌టైల్స్‌, పాద‌ర‌క్ష‌లు, విలువైన లోహాలు వంటి వాటిపై కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికి నిర్దారించిన వివిధ ప‌న్ను రేట్ల‌ను తెలుసుకుందాం.

రెస్టారెంట్లు

రెస్టారెంట్లు

కాగా, నాన్ ఏసీ రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లుపై 12 శాతం జిఎస్‌టీ వసూలు చేస్తారని జైట్లీ చెప్పారు. ఏసీ రెస్టారెంట్లు, అలాగే లిక్కర్ లైసెన్స్ ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లలో పన్నురేటు 18 శాతం కాగా, ఫైవ్‌స్టార్ హోటళ్లలో 28 శాతం జిఎస్‌టీ వసూలు చేస్తారు. రూ.50 లక్షలు, అంతకన్నా తక్కువ టర్నోవర్ ఉండే రెస్టారెంట్లు 5 శాతం శ్లాబ్ పరిధిలోకి వస్తాయని చెప్పారు.

వినోదం

వినోదం

హజ్ యాత్ర సహా అన్ని మతపరమైన యాత్రలకు జిఎస్‌టి నుంచి మినహాయింపు కొనసాగుతుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. సినిమా సేవ‌లు అంటే థియేట‌ర్ల‌పైన జీఎస్టీ పోటు త‌ప్పేలా లేదు. ప్ర‌స్తుతం ఉన్న వినోద ప‌న్నును సేవా ప‌న్నుతో క‌లుపుతూ సినిమా టిక్కెట్ల‌పైన 28% ప‌న్ను విధించే అవ‌కాశం ఉంది. గాంబ్లింగ్‌, గుర్ర‌పు పందేల‌ బెట్టింగ్ వంటి వాటికి 28 శాతం జీఎస్టీ వ‌ర్తిస్తుంది. స్థానిక ప‌న్నులు విధించే అధికారం ఆయా రాష్ట్రాల‌కు ఉంటుంది. అయితే ఇప్ప‌టికి సినిమాల‌పై 40-45 శాతం ప‌న్ను విధిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుతో సినిమా పరిశ్ర‌మ కునారిల్లుతోంది. ఆయా రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది.

హోట‌ళ్లు, లాడ్జ్‌లు

హోట‌ళ్లు, లాడ్జ్‌లు

రోజుకు వెయ్యి రూపాయల లోపు టారిఫ్‌ను వసూలు చేసే హోటళ్లు, లాడ్జీలను జిఎస్‌టీ నుంచి మినహాయించగా, వెయ్యి-2 వేల మధ్య టారిఫ్ ఉండే వాటిపై 12 శాతం, 2500-5000 మధ్య టారిఫ్ ఉండే హోటళ్లు, లాడ్జీలపై 18 శాతం జిఎస్‌టీ విధిస్తారు. రోజుకు 5 వేల రూపాయలకు పైగా టారిఫ్ ఉండే హోటళ్లకు 28 శాతం జీఎస్‌టీ పన్ను వర్తిస్తుంది.

 డెయిరీ ఉత్ప‌త్తులు, గుడ్లు

డెయిరీ ఉత్ప‌త్తులు, గుడ్లు

మిల్క్ పౌడ‌ర్‌, పాల ఉత్ప‌త్తులు, క్రీమ్, వెన్న‌, అల్ట్రా హై టెంప‌రేచ‌ర్ మిల్క్ వంటి వాటిని 5 శాతం జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకొచ్చారు. వెన్న‌, పాల‌, డెయిరీ ఉత్ప‌త్తులు, వెన్న నుంచి తీసే నూనెల‌పై ఇత‌ర కొవ్వు(నెయ్యి, బ‌ట్ట‌ర్ ఆయిల్) ప‌దార్థాల‌పై 12% ప‌న్నుగా నిర్ణ‌యించారు. తాజా పాలు, పాశ్చ‌రైజ్‌డ్ పాలు, గుడ్లు, వివిధ ప‌క్షుల గుడ్లు, ల‌స్సీ,మ‌జ్జిగ‌, ప‌న్నీర్, తేనె వంటి వాటికి జీఎస్టీ నుంచి మిన‌హాయింపునిచ్చారు.

టెలికాం సేవ‌లు ఖ‌రీద‌వుతాయా?

టెలికాం సేవ‌లు ఖ‌రీద‌వుతాయా?

జీఎస్టీలో నిర్ణ‌యించిన రేట్ల కార‌ణంగా టెలికాం సేవ‌లు ఖ‌రీద‌య్యే అవ‌కాశం ఉంది. టెలికాం సేవ‌ల‌పై 18 శాతం ప‌న్ను నిర్ణ‌యించారు. దీనిపై టెలికాం ప‌రిశ్ర‌మ విస్మ‌యం వ్య‌క్తం చేసింది. జీఎస్టీ పన్నును స్వాగ‌తించిన‌ప్ప‌టికీ 18 శాతం ప‌న్ను రేటుపైనే నిరాశ‌కు గుర‌యిన‌ట్లు తెలిపారు.

సెల్యూలార్ ఆప‌రేట‌ర్స్ అసోషియేష‌న్ ఆఫ్ ఇండియా డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్ మాథ్యూస్ మాట్లాడుతూ కొత్త ప‌న్ను రేటుతో వినియోగ‌దారుల‌పై మ‌రింత భారం ప‌డ‌నుంద‌ని చెప్పారు.

Read more about: gst జీఎస్‌టీ
English summary

జీఎస్టీ తుది రేట్ల ఖ‌రారు | GST rates fixed for services how it impact people

Education and healthcare will continue to be exempted from tax in the upcoming GST regime that will see service tax incidence go up on telecom, business class air travel, insurance and sale of newspaper space for advertisement.Transport services will be taxed at 5 per cent leading to a small drop in economy class air travel which currently attracts 6 per cent service tax.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X