For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ మార్కెట్ విలువ రూ. 45346 కోట్ల‌కు

పేటీఎమ్‌ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ సుమారు రూ.9,000 కోట్ల (1.40 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను రాబ‌ట్టింది. పేమెంట్ బ్యాంక్‌ కార్యకలాపాల విస్తరణకు, వినియోగదారులను పెంచుకునేందుకు ఈ నిధులను పేటీఎం

|

పేటీఎమ్‌ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ సుమారు రూ.9,000 కోట్ల (1.40 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను రాబ‌ట్టింది. పేమెంట్ బ్యాంక్‌ కార్యకలాపాల విస్తరణకు, వినియోగదారులను పెంచుకునేందుకు ఈ నిధులను పేటీఎం మాతృసంస్థ ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ ఉపయోగించనుంది. ఈ పెట్టుబడుల వల్ల పేటీఎం మార్కెట్‌ విలువ 7 బి.డాలర్ల (సుమారు రూ.45346 కోట్ల)కు పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

 పేటీఎమ్‌లోకి సాఫ్ట్‌బ్యాంక్ భారీగా పెట్టుబడులు

భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా తాము ఈ పెట్టుబడులు పెట్టినట్లు సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) మసయోషీ సన్‌ వెల్లడించారు. సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు తమ సంస్థకు ఎంతో గుర్తింపును తీసుకొస్తాయని పేటీఎమ్ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ అన్నారు. రానున్న 3-5 ఏళ్లలో రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు వాలెట్ సంస్థ పేర్కొంది. పేటీఎమ్ ఇప్పటికే వెల్త్ మేనేజ్‌మెంట్‌; ఇన్సూరెన్స్‌, డిపాజిట్, రుణ సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేసింది. సేవ‌ల‌నందించేందుకు గాను పేటీఎమ్ ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, స్టార్ట‌ప్ సంస్థ‌లు క్యాపిట‌ల్ ఫ‌స్ట్‌, క్యాపిట‌ల్ ఫ్లోట్ వంటి వాటితో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది.

Read more about: paytm పేటీఎమ్
English summary

పేటీఎమ్ మార్కెట్ విలువ రూ. 45346 కోట్ల‌కు | Paytm valuation has soared to $7 billion, following the SoftBank investment

Paytm has raised $1.4 billion from SoftBank Group Corp. in the largest funding round by a single investor in India, making the digital payments firm the Japanese company’s biggest bet in India’s start-up ecosystem.The deal includes $400 million worth of shares that SoftBank will buy largely from Paytm’s early investor SAIF Partners in a secondary transaction, and a minor stake from founder Vijay Shekhar Sharma, according to two persons close to the development.
Story first published: Friday, May 19, 2017, 9:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X