For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్‌,ఆధార్ లింక్ చేసేట‌ప్పుడు పేరులో త‌ప్పులా?.. మార్చుకోండిలా...

ఒక్కోసారి కొంత‌మందికి ఆధార్ కార్డులో ఉన్న పేరు పాన్ కార్డులో ఉన్న‌దానితో స‌రిపోల‌క‌పోవచ్చు. ఈ కార‌ణంగా కొంత మంది ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుదార్లు పాన్ కార్డు,ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయ‌లేక‌పోయారు.

|

ఆధార్ కార్డును పాన్‌తో లింక్ చేయాల్సిందిగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ కోరింది.ఇలా చేయ‌డం ద్వారా ఈ-వెరిఫికేష‌న్ సులువ‌వుతుంది. ఆధార్ డేటాబేస్‌లో న‌మోద‌యిన మొబైల్ నంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది. అయితే ఒక్కోసారి కొంత‌మందికి ఆధార్ కార్డులో ఉన్న పేరు పాన్ కార్డులో ఉన్న‌దానితో స‌రిపోల‌క‌పోవచ్చు. ఈ కార‌ణంగా కొంత మంది ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుదార్లు పాన్ కార్డు,ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయ‌లేక‌పోయారు. ఇందుకోస‌మే ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆన్‌లైన్‌లోనే పాన్ కార్డు,ఆధార్ ప‌త్రాల‌లో ఉన్న పేర్ల‌ను స‌వ‌రించేందుకు ఒక సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం.

ఆధార్ కార్డును పాన్‌తో అనుసంధానించండి

ఆధార్ కార్డును పాన్‌తో అనుసంధానించండి

ఆధార్ నంబ‌రును పాన్ కార్డుతో అనుసంధానించేందుకు మొద‌ట ఆదాయ‌పు ప‌న్ను శాఖ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఈ ఫైలింగ్ వెబ్‌సైట్లో లింక్ ఆధార్ కింద లింక్స్ టు క‌రెక్ట్ నేమ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. ఈ ఫైలింగ్ వెబ్‌సైట్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి. బ‌యోమెట్రిక్ ఐడెంటిఫ‌య‌ర్ ఆధార్ లింక్ విత్ పాన్‌తో పాటు రెండు హైప‌ర్ లింక్‌లు ఉంటాయి.

హైప‌ర్ లింక్ ద్వారా పేరు మార్పు

హైప‌ర్ లింక్ ద్వారా పేరు మార్పు

1. ఒక హైప‌ర్ లింక ద్వారా ఇప్ప‌టికే ఉన్న పాన్ కార్డు వివ‌రాలు మార్పు చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ పాన్ లేక‌పోతే కొత్త దాని కోసం అప్లై చేయ‌వ‌చ్చు.

2. ఇంకో హైప‌ర్ లింక్‌లో ఆధార్ వివ‌రాల్లో మార్పు కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. ఇందుకోసం ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్టల్‌కు రీడైరెక్ట్ అవుతుంది.

3. డేటా అప్‌డేట్ కోసం రుజువుగా స్కాన్ చేసిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

హోంపేజీలోనే లింక్‌

హోంపేజీలోనే లింక్‌

ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్ కొత్త లింక్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఎవ‌రైనా పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానించ‌వ‌చ్చు. ఇందుకోసం ఈ వెబ్‌సైట్లో లాగిన్ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ప్ర‌క్రియ చేసేట‌ప్పుడు మీ మొబైల్‌, ఆధార్‌, పాన్ కార్డుల‌ను సిద్దంగా ఉంచుకుని త‌ర్వాత వెబ్‌సైట్ తెర‌వ‌డం మంచిది.

ఒక సారి లింక్ తెరిచిన త‌ర్వాత‌

ఒక సారి లింక్ తెరిచిన త‌ర్వాత‌

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ తెరిచిన త‌ర్వాత ఇలా చేయాలి. మొద‌ట పాన్, ఆధార్‌లో ఉన్న విధంగా పేరును న‌మోదు చేయాలి. ఆధార్ కార్డులో ఉన్న‌ట్లే పేరును ఎంట‌ర్ చేయండి. యూఐడీఏఐ నుంచి వెరిఫికేష‌న్ త‌ర్వాత అనుసంధాన ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. ఆర్థిక బిల్లు,2017 ప్ర‌కారం ఆధార్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని పాన్‌తో అనుసంధానించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. దీంతో జులై 1 త‌ర్వాత నుంచి ప‌ర్మ‌నెంట్ అకౌంట్ నంబ‌రు(పాన్‌) నంబరు ద‌ర‌ఖాస్తు చేయాలంటే కూడా ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాబోతున్నది.

Read more about: aadhaar pancard aadhar income tax
English summary

పాన్‌,ఆధార్ లింక్ చేసేట‌ప్పుడు పేరులో త‌ప్పులా?.. మార్చుకోండిలా... | Income tax department has launched facilities to interlink Aadhaar with PAN

income tax department has launched an online facility to link Aadhaar with PAN, In case of any minor mismatch in Aadhaar name provided by taxpayer when compared to the actual data in Aadhaar, One Time Password (Aadhaar OTP) will be sent to the mobile registered with Aadhaar. In rare cases where Aadhaar name is completely different from name in PAN, then the linking will fail and taxpayer will be prompted to change the name in either Aadhaar or in PAN database, the tax department said. For the benefit of taxpayers, the income tax department has launched an online facility to correct errors in names and other details in permanent account number (PAN) and Aadhaar document.
Story first published: Monday, May 15, 2017, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X