For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15వేల కోట్ల నిధుల వేట‌లో ఎస్‌బీఐ

దేశీయ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నిధుల సమీకరణకు సిద్ధమవుతోంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో), ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రూ. 15వేల కోట్లను సేకరించేందుకు ఎస్‌బీఐ ప్రణ

|

దేశీయ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నిధుల సమీకరణకు సిద్ధమవుతోంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో), ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రూ. 15వేల కోట్లను సేకరించేందుకు ఎస్‌బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

 15వేల కోట్ల నిధుల వేట‌లో ఎస్‌బీఐ

'కేపిటల్ మార్కెట్స్‌లో క్యూఐపీ/ఎఫ్‌పీఓలను ఆఫర్ చేసేందుకు బ్యాంక్ సిద్ధమవుతోంది. ఎంతమేర నిధులను సమీకరించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్మెంట్ నిర్ణయాలు, షేర్ హోల్డర్ల అనుమతులను అనుసరించి ఇష్యూ ప‌రిమాణం నిర్ణయిస్తాం' అంటూ ఎస్‌బీఐ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15వేల కోట్లను పబ్లిక్ ఆఫర్స్, విదేశాల నుంచి సేకరణ ద్వారా సమీకరించేందుకు ఎస్‌బీఐ ఇప్పటికే ఆర్బీఐ నుంచి అనుమతులు పొందింది. 6గురు మర్చంట్ బ్యాంకర్స్ ఈ ఇష్యూని నిర్వహిస్తారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. గ‌త డిసెంబ‌ర్ త్రైమాసికం ముగిసే నాటికి ఎస్‌బీఐ మొత్తం క్యాపిట‌ల్ అడిక్వ‌సీ రేషియో 13.73% గా ఉంది. ఇందులో టైర్‌-1 క్యాపిట‌ల్ అడిక్వ‌సీ రేషియో 9.97%. ఎస్‌బీఐ ఏకీకృత బ్యాలెన్స్ షీట్ విలువ రూ.35 ల‌క్ష‌ల‌కు కోట్ల‌కు పైగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

Read more about: sbi state bank of india banking
English summary

15వేల కోట్ల నిధుల వేట‌లో ఎస్‌బీఐ | state bank of India to raise equity capital of up to Rs 15,000 crore in FY18

State Bank of India (SBI) on Tuesday invited proposals from merchant bankers with ‘experience and expertise’ in handling capital market issues to assist and advise it in its qualified institutional placement (QIP) or follow-on public offer (FPO) process.
Story first published: Wednesday, May 10, 2017, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X