For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత డేటాకార్డు,డాంగిల్ ఎక్స్చేంజీ ద్వారా జియో కొత్త రూట‌ర్‌

ఏదైనా కంపెనీకి చెందిన‌ పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. జియో తాజా ఆఫ‌ర్ల గురించి తెలుసుకుందాం

|

ప్రారంభం నుంచి పోటీ కంపెనీలను త‌ల‌ద‌న్నేలా ఆఫ‌ర్లు ఇస్తున్న జియో మ‌రోసారి కొత్త ఆఫ‌ర్‌ను వ‌దిలింది. రిలయన్స్ జియో మరోసారి సంచలన డేటాకు సంబంధించిన ఆఫర్లను తన అంత‌ర్జాల వినియోగ‌దారుల‌ కోసం తీసుకొచ్చింది. ఏదైనా కంపెనీకి చెందిన‌ పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. జియో తాజా ఆఫ‌ర్ల గురించి తెలుసుకుందాం.

 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా రూ.2010 విలువైన డేటా

100 శాతం క్యాష్ బ్యాక్ లేదా రూ.2010 విలువైన డేటా

రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది.

408 రీచార్జీ

408 రీచార్జీ

జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది.

దాంతో పాటు 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. ఇలాంటి వారికి ఉచిత డేటా ఆఫ‌ర్ 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

రూ.1999కే జియోఫై ప‌రిక‌రం

రూ.1999కే జియోఫై ప‌రిక‌రం

కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో పోల్చి చూస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది. ఇక రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేయించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేసుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి వీలుంటుంది.

జియో యాప్‌లు వాడాలంటే ప్రైమ్ మెంబ‌ర్ అవ్వాల్సిందే...

జియో యాప్‌లు వాడాలంటే ప్రైమ్ మెంబ‌ర్ అవ్వాల్సిందే...

క‌స్ట‌మ‌ర్ల‌ను నిలుపుకునేందుకు జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను తీసుకొచ్చింది. త‌ద్వారా క‌స్ట‌మ‌ర్లు త‌ర్వాత ఏ రీచార్జీలు చేయించుకున్నా, లేక‌పోయినా మార్చి 31,2018 జియో సిమ్ వాడేలా ఈ మెంబ‌ర్‌షిప్ అవ‌కాశం క‌ల్పిస్తుంది. జియో సిమ్ తీసుకుని ప్రైమ్ స‌భ్య‌త్వం తీసుకున్న వారికి మాత్ర‌మే జియో సంబంధిత యాప్‌లు ప‌నిచేసేలా రిల‌య‌న్స్ జియో ప్ర‌ణాళిక వేసింది. ప్ర‌స్తుతం జియో సేవ‌లు పొందాల‌నుకునే వారు రూ.309 రీచార్జీ చేయించేలా రిల‌య‌న్స్ జియో ఆఫ‌ర్ ఇచ్చింది. త‌ద్వారా 84 రోజుల‌ పాటు ప్ర‌తి రోజూ ఉచిత డేటా పొందేలా చేశారు.

స‌మ్మ‌ర్ ప‌ర్‌ప్రైజ్ లేకున్నా ధ‌న్‌ధ‌నాధ‌న్ ఉందిగా...

స‌మ్మ‌ర్ ప‌ర్‌ప్రైజ్ లేకున్నా ధ‌న్‌ధ‌నాధ‌న్ ఉందిగా...

జియో ప్ర‌వేశ‌పెట్టిన స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆప‌ర్‌ను ట్రాయ్ నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో వినియోగ‌దారుల‌కు అవే ప్ర‌యోజ‌నాల‌ను అందించేందుకు జియో కొత్త మార్గం అన్వేషించింది. జియో ధ‌న్‌ధ‌నాధ‌న్ పేరుతో రెండు ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. యూజ‌ర్లు ఎప్పుడైనా ఆ ప్లాన్‌లో ఉన్న ప్యాక్‌ల‌ను రీచార్జీ చేయించుకోవ‌చ్చు. జియో వినియోగ‌దారులు మైజియో యాప్‌లో ఎప్పుడైనా ఈ రీచార్జీలు చేసుకునే సదుపాయం ఉంది. ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌ను హ‌డ‌లెత్తించే క్ర‌మంలో జియో ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు రచిస్తూనే ఉంది.

Read more about: jio reliance jio data telecom
English summary

పాత డేటాకార్డు,డాంగిల్ ఎక్స్చేంజీ ద్వారా జియో కొత్త రూట‌ర్‌ | Jio exchange offer Deposit old data card, dongle and get 4G router

Users will be required to exchange their existing data card, dongle or hotspot router at any Jio Digital store or Jio Care store and will get 4G data worth Rs 2010 against the device exchanged.To get JioFi router, the customers will have to pay Rs 1,999 and will have to do a mandatory first recharge of Rs 408, which is Rs 309 for the plan - which ensures freebies for 84 days - and Rs 99 for a Jio Prime membership
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X