For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

267 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్‌

ముడి చ‌మురు ధ‌ర‌లు ప‌డిపోవ‌డంతో దేశీయ సెంటిమెంటు దెబ్బ‌తింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల్లో ప‌య‌నించాయి.అంత‌ర్జాతీయ సెంటిమెంటు బ‌ల‌హీనంగా ఉండ‌టంతో పాటు, అమెరికాలో వ్య‌వ‌సాయేత‌ర ఉద్యోగ స‌మాచా

|

ముడి చ‌మురు ధ‌ర‌లు ప‌డిపోవ‌డంతో దేశీయ సెంటిమెంటు దెబ్బ‌తింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల్లో ప‌య‌నించాయి. అంత‌ర్జాతీయ సెంటిమెంటు బ‌ల‌హీనంగా ఉండ‌టంతో పాటు, అమెరికాలో వ్య‌వ‌సాయేత‌ర ఉద్యోగ‌ స‌మాచారం వెల్ల‌డి కోసం ఇన్వెస్ట‌ర్లు వేచిచూస్తుండ‌టం మార్కెట్లు బ‌ల‌హీనంగా ఉండేందుకు కార‌ణ‌మ‌య్యాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 270 పాయింట్ల మేర న‌ష్ట‌పోయింది. సెన్సెక్స్ 267 పాయింట్ల‌(0.89%) న‌ష్టంతో 29859 వ‌ద్ద ముగియ‌గా, 50 షేర్ల ఎన్‌ఎస్ఈ సూచీ నిఫ్టీ 74.6 పాయింట్లు క్షీణించి 9285.30 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(2.47%) అన్నిటికంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది. ఇత‌ర రంగాల్లో చ‌మురు,స‌హ‌జ వాయు(1.61%), మౌలిక‌(1.42%), పీఎస్‌యూ(1.39%) 1 శాతం కంటే ఎక్కువ‌గా ప‌డిపోయిన వాటిలో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయిన‌ర్ల‌లో అదానీ పోర్ట్స్‌(1.56%), ఏసియ‌న్ పెయింట్స్‌(1.4%), ఐసీఐసీఐ బ్యంక్‌(0.2%), మారుతి సుజుకి(0.17%) ఉండ‌గా; టాటా మోటార్స్‌(3.84%), ఓఎన్జీసీ(2.83%), యాక్సిస్ బ్యాంక్‌(2.7%), గెయిల్‌(2.49%), రిల‌య‌న్స్‌(2.22%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

267 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్‌ | sensex shed over 270 points

The BSE benchmark Sensex plunged nearly 270 points as a drop in crude prices hurt the domestic sentiment and dragged down explorers such as Oil and Natural Gas Corp.Besides, a weak trend in global markets ahead of US non-farm payrolls data later day and French elections on Sunday also dampened the domestic sentiment.
Story first published: Friday, May 5, 2017, 17:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X