For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స‌రికొత్త రికార్డుల‌ను న‌మోదు చేసిన దేశీయ సూచీలు

ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగసి 30,126 వద్ద ముగియ‌గా.. నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 9,360 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ చ‌రిత్ర‌లోనే గరిష్టంకాగా.. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 22,720

|

ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు, దేశీ ఫండ్స్‌ భారీ పెట్టుబడుల నేపథ్యంలో లాభాలతో మొదలైన మార్కెట్లు చివరికి రికార్డు స్థాయి లాభాల‌ను న‌మోదు చేశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలు, మొండిబకాయిల పరిష్కారానికి కొత్త విధానాలు వంటి అంశాలు పెట్టుబ‌డిదారులకు జోష్‌నివ్వడంతో మార్కెట్లు బుల్‌ జోరందుకున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగసి 30,126 వద్ద ముగియ‌గా.. నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 9,360 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ చ‌రిత్ర‌లోనే గరిష్టంకాగా.. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 22,720 వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. బ్యాంకింగ్ రంగ సూచీ 1.42% బ‌ల‌ప‌డింది. సెన్సెక్స్‌ సైతం ఇంట్రాడేలో 30,170 వరకూ జంప్‌చేయడం విశేషం!

 సెన్సెక్స్ 231 పాయింట్లు పైకి, నిఫ్టీ 9360 పాయింట్ల స్థాయికి

ఐసీఐసీఐ బ్యాంక్‌ దూకుడు

త్రైమాసికంలో అంచనాలు మించిన ఫలితాలు ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడాది గరిష్టానికి చేరింది. ఏకంగా 9 శాతం దూసుకెళ్లడం ద్వారా అటు బ్యాంక్‌ నిఫ్టీ, ఇటు నిఫ్టీకి బలాన్నిచ్చింది. దీనికితోడు ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.4 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. మిగిలిన రంగాలలో ఎఫ్‌ఎంసీజీ 1 శాతం పురోగమించగా.. మెటల్‌, రియల్టీ, ఆటో రంగాలు దాదాపు 1 శాతం స్థాయిలో నష్టపోయాయి. బ్యాంకింగ్ నియంత్ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ 35ఏకు స‌వ‌ర‌ణ చేసేందుకు బుధ‌వారం కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

English summary

స‌రికొత్త రికార్డుల‌ను న‌మోదు చేసిన దేశీయ సూచీలు | Sensex closes up 231 points

The BSE benchmark Sensex climbed 231.41 points or 0.77 per cent to settle at 30,126.21. The index hit a high of 30,168.95, which was just short of all-time high of 30,184.22.Similarly, the NSE index Nifty rose 47.95 points or 0.51 per cent to a record closing high of 9,359.90
Story first published: Thursday, May 4, 2017, 17:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X