For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లోకి ప‌దేళ్ల‌లో వ‌చ్చిన నల్లధనం రూ. 50 లక్షల కోట్లు

గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ ఇంటిగ్రేట్(జీఎఫ్ఐ) న‌ల్ల‌ధ‌నం వల్ల దేశాలు ఎలా ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి, ఏ విధంగా న‌ల్ల‌ధ‌న ప్ర‌వాహం జ‌రుగుతున్న అంశాల‌పై ఒక నివేదిక‌ను వెల్ల‌డించింది. అక్ర‌మ డ‌బ్బు ప్ర‌వాహం కార‌ణం

|

మ‌న ద‌గ్గ‌ర నుంచి విదేశాల‌కు 165 బిలియ‌న్ డాల‌ర్లు, దేశంలోకి 770 బిలియ‌న్ డాల‌ర్లు
భారతదేశానికి 2005-14 మధ్యకాలంలో రూ.49,28,000 కోట్ల (770 బిలియన్‌ డాలర్లు) నల్లధనం వచ్చి చేరింది. ఇదే పదేళ్ల కాలంలో రూ.10,56,000 కోట్లు (165 బిలియన్‌ డాలర్లు) దేశం నుంచి విదేశాలకు వెళ్లింది. గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ ఇంటిగ్రేట్(జీఎఫ్ఐ) న‌ల్ల‌ధ‌నం వల్ల దేశాలు ఎలా ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి, ఏ విధంగా న‌ల్ల‌ధ‌న ప్ర‌వాహం జ‌రుగుతున్న అంశాల‌పై ఒక నివేదిక‌ను వెల్ల‌డించింది. అక్ర‌మ డ‌బ్బు ప్ర‌వాహం కార‌ణంగా వ‌ర్త‌మాన దేశాల్లో ఏ ఏ ప్ర‌భావాలు త‌లెత్తుతున్నాయో వివ‌రించింది. ఆ వివ‌రాలు మీ కోసం...

 ప‌దేళ్ల కాల‌వ్య‌వ‌ధి గ‌ణాంకాల‌ను వెల్ల‌డించిన జీఎఫ్‌ఐ

ప‌దేళ్ల కాల‌వ్య‌వ‌ధి గ‌ణాంకాల‌ను వెల్ల‌డించిన జీఎఫ్‌ఐ

అమెరికాకు చెందిన మేధావుల సంస్థ గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ ఇంటిగ్రిటి (జీఎఫ్‌ఐ) విడుద‌ల చేసిన నివేదికలో ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్తున్న..అటు నుంచి వస్తున్న.. అక్రమ నగదు ప్రవాహాలు' అన్న శీర్షికన ఈ వివరాలను విశ్లేషించింది. ఈ సంస్థ ప్ర‌తి సంవ‌త్స‌రం న‌గ‌దు ప్ర‌వాహాలు ఏ విధంగా అక్ర‌మ చ‌లామ‌ణీ అవుతున్నాయో నివేదిక‌ల రూపంలో వెల్ల‌డిస్తూ ఉంటుంది. ప్రస్తుతం 10 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధి తీసుకుని 2005-14 మ‌ధ్య అభివృద్ది చెందుతున్న దేశాల్లో న‌ల్ల‌ధ‌నం ప్ర‌వాహం ఎలా జ‌రుగుతోందో క్రోడీక‌రించారు. ఇందులో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

2. ఆందోళ‌న‌క‌ర స్థాయిలో అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహాలు(ఐఎఫ్ఎఫ్‌)

2. ఆందోళ‌న‌క‌ర స్థాయిలో అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహాలు(ఐఎఫ్ఎఫ్‌)

నివేదిక ఆధారంగా చూస్తే అంత‌ర్జాతీయంగా అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహాలు చాలా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గ్లోబ‌ల్ ఫైనాన్స్ రిపోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాల వాణిజ్యంలో ఈ విధ‌మైన న‌ల్ల‌ధ‌న ప్ర‌వాహం వాటా 2005 నుంచి 2014 మ‌ధ్య 14.1-24 శాతం మ‌ధ్య ఉన్న‌ట్లు తెలిపారు. మొత్తం వాణిజ్యంలో దేశాల నుంచి బ‌య‌ట‌కు వెళుతున్న అక్ర‌మ న‌గ‌దు వాటా 4.6 - 7.2 % మ‌ధ్య ఉండ‌గా; ఆయా దేశాల్లోకి వ‌స్తున్న అక్ర‌మ సొమ్ము వాటా 9.5 - 16.8 శాతం మ‌ధ్య ఉంది.

3. న‌ల్ల‌ధ‌నం విలువ స‌గ‌టున 2759 బిలియ‌న్ డాల‌ర్లు

3. న‌ల్ల‌ధ‌నం విలువ స‌గ‌టున 2759 బిలియ‌న్ డాల‌ర్లు

ప‌దేళ్ల కాల‌వ్య‌వ‌ధిలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌ర్త‌మాన దేశాల విష‌యంలో ప్ర‌వ‌హిస్తున్న అక్ర‌మ న‌గ‌దు 8.5 నుంచి 10.4 శాతం మ‌ధ్య వృద్ది చెందిన‌ట్లు తెలుస్తోంది. ఆయా దేశాల నుంచి బ‌య‌ట‌కు వెళుతున్న న‌గ‌దు స‌గ‌టున 7.2- 8.1% మ‌ధ్య పెరిగింది. మ‌రో వైపు చూస్తే అక్రమ న‌గ‌దు ఇన్‌ఫ్లో వాటా స‌గ‌టున 9.2-11.4 శాతం మ‌ధ్య పైకి ఎగ‌శాయి. 2005లో 2 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్న మొత్తం అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహం 2014 సంవ‌త్స‌రానికల్లా 3.5 ట్రిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి పెరిగింది. స‌గ‌టున ఏటా 9.7% పెరుగుతున్న అక్ర‌మ ధ‌న ప్ర‌వాహంతో ప‌దేళ్ల‌లో దాదాపుగా ప‌క్క‌దారి ప‌ట్టిన న‌ల్ల‌ధ‌నం విలువ 2759 బిలియ‌న్ డాల‌ర్లుగా లెక్క‌గ‌ట్టారు. త‌క్కువ విలువ అంచ‌నాల ప‌రంగా చూస్తే ఈ విలువ 2010 బిలియ‌న్ డాల‌ర్లుగా, ఎక్క‌వ విలువ ప‌రంగా 1756 బిల‌య‌న్ డాల‌ర్లుగా ఉన్న‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.

 4. మొత్తం వాణిజ్యంలో అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహం వాటా

4. మొత్తం వాణిజ్యంలో అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహం వాటా

తప్పుడు ఇన్‌వాయిస్‌ల ద్వారానే అధికంగా నల్లధనం చేరుతున్నట్టు జీఎఫ్ఐ గుర్తించింది. అభివృద్ది చెందుతున్న దేశాల విష‌యంలో వాణిజ్యం బాగా జ‌రుగుతున్నప్ప‌టికీ దానికి పూర్తి లెక్క‌లు లేకుండా అక్ర‌మంగా వ‌స్తు,సేవ‌ల‌ను మ‌ళ్లిస్తున్న కార‌ణంగానే అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహం జ‌రుగుతున్న‌ట్లు వివ‌రించారు. జీఎఫ్ఐ ఈ గ‌ణాంకాల‌ను అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి లెక్క‌ల‌ను ఆధారంగా త‌యారుచేసింది. దేశ మొత్తం వాణిజ్యంలో స‌గ‌టున 10 శాతానికి పైగా సొమ్ము లెక్క‌ల్లో లేకుండా త‌ర‌లిపోతోంది. 2005లో ఇది 13.8 శాతం ఉండ‌గా 2014 స‌మ‌యానికి 12.4 శాతానికి త‌గ్గింది. ప‌దేళ్ల కాలంలో 2012లో మాత్ర‌మే కాస్త త‌క్కువ‌గా 11.6% గా న‌మోద‌యింది. ముఖ్యంగా చాలా మంది వ్యాపారులు ధరల్లో తేడాలుచూపుతూ పన్ను ఎగవేస్తున్నారు. ప‌దేళ్ల కాలంలో వాణిజ్యంలో అక్ర‌మాల కార‌ణంగా దారి మ‌ళ్లిన డ‌బ్బు విలువ 1756 బిలియ‌న్ డాలర్లు. లెక్క‌ల్లేని వాణిజ్యం ద్వారా త‌ర‌లిన సొమ్ము వాటా మొత్తం అక్ర‌మ సొమ్ములో 87%గా ఉన్న‌ట్లు లెక్క‌లు తెలియ‌జేస్తున్నాయి.

 5. దేశంలోనికి ఎంత వ‌చ్చింది; దేశం నుంచి ఎంత బ‌య‌ట‌కు వెళ్లింది?

5. దేశంలోనికి ఎంత వ‌చ్చింది; దేశం నుంచి ఎంత బ‌య‌ట‌కు వెళ్లింది?

ఈ నల్లధనం అమెరికాతో భారత్‌ జరుపుతున్న వాణిజ్యంలో 14 శాతానికి సమానం. ఒక్క 2014లోనే రూ.6,46,400కోట్లు (101 బిలియన్‌ డాలర్లు) దేశంలోకి రాగా, రూ.1,47,200 కోట్లు (23 బిలియన్‌ డాలర్లు) ఇతర దేశాలకు తరలింది. మొత్తం అన్ని అభివృద్ది చెందుతున్న దేశాల్లో చూస్తే అవుట్ ఫ్లో అక్ర‌మ సొమ్ము 620-970 బిలియ‌న్ డాలర్లు. ఈ దేశాల్లోకి ప్ర‌వేశించిన‌ అక్ర‌మ సొమ్ము 1.4 - 2.5 ట్రిలియ‌న్ డాల‌ర్ల మ‌ధ్య ఉంది. ఈ త‌ర‌హా సొమ్ము ప్ర‌వాహాల్లో దేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్న డ‌బ్బు విలువ కంటే ఇన్‌ఫ్లో ఎక్కువ ఉండ‌టం గ‌మ‌నార్హం.

6. ప్రాంతాల వారీగా చూస్తే

6. ప్రాంతాల వారీగా చూస్తే

అంత‌ర్జాతీయ ఒప్పందాల కార‌ణంగా ప‌లు ఏజెన్సీలు క‌ట్ట‌డి చేసే చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు క‌నిపించినా అక్ర‌మ న‌గదు ప్ర‌వాహాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌టం లేదు. మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తే ఆసియా ఖండంలోని ప‌లు దేశాల్లోకి ప్ర‌వ‌హిస్తున్న అక్ర‌మమైన‌ ధ‌నం మిగిలిన ఏ ప్రాంతంతో పోల్చి చూసినా ఎక్కువ‌గా ఉంద‌ని జీఎఫ్ఐ తెలిపింది. తూర్పు యూర‌ప్‌, స‌బ్ స‌హారా ఆఫ్రికా ప్రాంతం, లాటిన్ అమెరికాల్లో అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహం కాస్త త‌క్కువ‌గా ఉన్న‌ట్లు జీఎఫ్ఐ వెల్ల‌డించింది. అక్ర‌మ ఇన్‌ఫ్లో విష‌యంలో స‌బ్ స‌హారా ఆఫ్రికా వాటా 7.5-11.6%, అభివృద్ది చెందుతున్న యూర‌ప్‌లోని దేశాల విష‌యంలో మొత్తం వాణిజ్యంలో న‌ల్ల‌ధ‌నం స‌గ‌టు వాటా 12.4-21.0%.

7. ట్రేడ్ ఇన్‌వాయిస్‌లో త‌ప్పుల త‌డ‌క‌లు

7. ట్రేడ్ ఇన్‌వాయిస్‌లో త‌ప్పుల త‌డ‌క‌లు

అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ దాదాపు అన్ని దేశాల వాణిజ్యంలో జ‌రుగుతున్న సొమ్ము లావాదేవీల‌ను క్రోడీక‌రిస్తూ ఉంటుంది. వివిధ ప్ర‌ముఖ వాణిజ్య మార్పుల‌ ఆధారంగా ప‌లు దేశాల్లో మెరుగుప‌డాల్సిన కొన్ని అంశాల‌ను సూచిస్తుంది. ట్రేడ్‌లో ఏయే దేశాల్లో అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహం ఎక్క‌డ నుంచి ఎక్కువ ఉంది, కార‌ణాలేంటి అనే అంశాల‌ను వెలికితీశారు. అయితే దీనిపై ప‌లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఎందుకంటే వాణిజ్య లావాదేవీల ఖ‌ర్చులు సాధార‌ణంగా ఒక్క‌చోట ల‌భ్య‌మ‌వ్వ‌వు. వ‌స్తు సేవ‌ల ప్ర‌వాహం లేకున్న‌ప్ప‌టికీ త‌ప్పుడు బిల్లులు రాయ‌డం వంటివి జ‌రుగుతుంటాయని పేర్కొన‌డం వాస్త‌వ విరుద్ద‌మైన‌ది. ఏదైనా రెండు దేశాల మ‌ధ్య వాణిజ్యం జ‌రుగుతున్న‌ప్పుడు అన్ని ప్రాంతాల్లో ఈ లెక్క‌లు ల‌భించ‌క‌పోయినా వాటిని విశ్లేషించ‌డం స‌బ‌బు కాద‌ని కొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు.

8. ప్ర‌ధాన కార‌ణ‌మిదే...

8. ప్ర‌ధాన కార‌ణ‌మిదే...

తప్పుడు ఇన్‌వాయిస్‌ల ద్వారానే అధికంగా నల్లధనం చేరుతున్నట్టు అంచ‌నా వేస్తున్నారు. బయటకు వెళ్తున్న నల్లధనంలో 66 శాతం, వస్తున్నదానిలో 97శాతం తప్పుడు ఇన్‌వాయిస్‌ల ద్వారానే చలామణి అవుతున్నట్లు జీఎఫ్ఐ నివేదిక పేర్కొంది. పన్ను మినహాయింపు ఉన్న దేశాలకు సరకు పంపుతున్నట్టు ఇన్‌వాయిస్‌లు రాసి, ఆ తరువాత అక్కడనుంచి గమ్యస్థానాల పేరుతో మళ్లీ ఇన్‌వాయిస్‌లు రాస్తారు. రీ ఇన్‌వాయిస్‌లుగా పిలిచే ఈ వ్యవహారంలో మొత్తంగా పన్నును ఎగవేస్తున్నారు. బ్యాంకులు నిజమైన ఖాతాదార్ల వివరాలను సేకరించడం ద్వారా నల్లధనానికి అడ్డుకట్టవేయవచ్చని ఆసంస్ థపేర్కొంది. ఇలాంటి బహుళజాతి కంపెనీల ఆస్తులు, అప్పులు, లాభాలు, సిబ్బంది తదితర వివరాలను బహిర్గతపరిచేలా నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాలకు సూచించింది.

9. ప‌రిష్కారాలు

9. ప‌రిష్కారాలు

అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో పారద‌ర్శ‌క‌త లేక‌పోవ‌డ‌మే అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహానికి ప్ర‌ధాన కార‌ణంగా పేర్కొన్నారు. కొన్ని దేశాలు ప‌న్ను స్వ‌ర్గ‌ధామాలుగా ఉండ‌టంతో పాటు, అక్క‌డ జ‌రిగే న్యాయ విచార‌ణ‌లు సీక్రెట్‌గా జ‌ర‌గడం ఆందోళ‌న క‌లిగించే విష‌యాల‌ని న‌ల్ల‌ధ‌నానికి సంబంధించిన నివేదిక వెల్ల‌డించింది. అనామ‌క‌మైన ట్ర‌స్ట్లు,షెల్ కంపెనీలు, లంచం, అవినీతి వంటివి వ‌ర్తమాన దేశాల అభివృద్దిని దిగ‌లాగుతున్న‌ట్లు గుర్తించారు. దీన్ని అరిక‌ట్టాలంటే అన్ని దేశాలు ఫైనాన్సియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. అంత‌ర్జాతీయంగా ఆర్థిక స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డం ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఈ విధంగా స‌మాచార మార్పిడి కోసం 2018 క‌ల్లా ఒక ప‌ద్ద‌తి ప్రకారం అమ‌లు చేసేందుకు 96 దేశాలు కృత నిశ్చయంతో ఉండ‌టం సానుకూల ప‌రిణామం.

 10. ఆయా దేశాల స్థాయిలో

10. ఆయా దేశాల స్థాయిలో

ఇక‌పై ప్ర‌తిదేశంలోనూ అన్ని బ‌హుళ జాతి సంస్థ‌లు వాటి రెవెన్యూ, లాభాలు, న‌ష్టాలు, అమ్మ‌కాల, ప‌న్ను చెల్లింపు వివ‌రాల‌ను బ‌హిరంగ ప‌ర‌చాల్సి ఉంది. ప‌న్ను ఎగ‌వేత‌ల‌ను అరిక‌ట్ట‌డం కోసం ఆయా సంస్థ‌ల అనుబంధ యూనిట్లు, విదేశాల్లో వాటి ఉద్యోగుల కోసం వెచ్చిస్తున్న ఖ‌ర్చులు, ట్ర‌స్టుల కోసం, సామాజిక బాధ్య‌త కోసం చేస్తున్న వ్య‌యాలు అన్ని వార్షిక నివేదిక‌లో భాగంగా ఇవ్వ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేయాలి. ప్ర‌స్తుతం బీఈపీఎస్ ఇనిషియేటివ్‌లో భాగంగా జీ20, ఓఈసీడీ దేశాలు 2015 న‌వంబ‌రులో ఒక ఒప్పందానికొచ్చాయి. దాని ప్ర‌కారం దేశాల వారీగా ఎమ్ఎన్‌సీల రిపోర్టింగ్ జ‌రుగుతుంది. అయితే ఇందులో ఉన్న చిన్న చిక్కేమిటంటే ఏ దేశంలో దాని ప్ర‌ధాన కార్యాల‌యం ఉందో ఆ దేశ ప‌న్ను అధికారుల‌కు మాత్ర‌మే మొత్తం వివ‌రాలు అందుబాటులో ఉండేలా చూశారు. ఇత‌ర దేశాల‌కు అదే వివ‌రాలు కావాలంటే ఆ రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షింగా అధికారిక ఒప్పందాలు జ‌ర‌గాల్సిందే. జీఎఫ్ఐ చెబుతున్న‌దేమిటంటే ఏవైనా రెండు దేశాల్లో ఒక కంపెనీ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్న‌ట్ల‌యితే ఆ కంపెనీకి సంబంధించిన వార్షిక ఆర్థిక నివేదిక నియంత్ర‌ణ సంస్థ‌ల‌కు అందుబాటులో ఉండాల్సిందే.

11. ముగింపు

11. ముగింపు

మొత్తం వాణిజ్యంలో కొంత సొమ్మును లెక్క‌ల్లో లేకుండా చేయ‌డం అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహానికి ప్ర‌ధాన కార‌ణంగా గుర్తించారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో అక్ర‌మ న‌గ‌దు ప్ర‌వాహ తీవ్ర‌త‌ను గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ రిపోర్టింగ్ నివేదిక తెలియ‌జేసింది. 2005 త‌ర్వాత ప‌ది సంవ‌త్స‌రాల కాలంలో సాంకేతిక పెరుగుతున్న‌ప్ప‌టికీ న‌ల్ల‌ధ‌నం ప్ర‌వాహం త‌గ్గ‌క‌పోవ‌డాన్ని గుర్తించారు. ఓఈసీడీ, జీ20 దేశాలు ఇప్ప‌టికే కుదుర్చుకున్న ఒప్పందాల కార‌ణంగా పన్ను ఎగ‌వేత‌ల‌ను త‌గ్గించేందుకు అవ‌కాశాలేర్పడ్డాయి. అంతే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌న్ను వివ‌రాల‌ను మార్చుకునేందుకు అన్ని దేశాలు సిద్ద‌మ‌వ్వాల్సిన త‌రుణం ఆస‌న్న‌మ‌యింది.

భారత దేశంలో నల్లధనం వివరాలపై అధికారిక లెక్కలు లేనందున ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more about: black money illegal
English summary

భారత్‌లోకి ప‌దేళ్ల‌లో వ‌చ్చిన నల్లధనం రూ. 50 లక్షల కోట్లు | Illicit Financial Flows to and from Developing Countries in between 2005-2014

Illicit financial flows (IFFs) from developing and emerging economies kept pace at nearly US$1 trillion in 2014, according to a study released today by Global Financial Integrity (GFI), a Washington, DC-based research and advisory organization. The report pegs illicit financial outflows at 4.2-6.6 percent of developing country total trade in 2014, the last year for which comprehensive data are available.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X