For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్‌1-బీ మార్పుల ప్ర‌భావం: యూఎస్‌లో ఇన్ఫీ భారీగా స్థానిక నియామ‌కాలు

భార‌త్‌లో రెండో అతిపెద్ద‌ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అమెరికాలో భారీ సంఖ్యలో స్థానిక ఉద్యోగులను నియమించుకోనుంది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న హెచ్‌1 బీ వీసాలపై కఠిన నిర్ణయాల నేపథ్యంతో ఇన్ఫీ ఈ నిర్ణ

|

భార‌త్‌లో రెండో అతిపెద్ద‌ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో అమెరికాలో భారీ సంఖ్యలో స్థానిక ఉద్యోగులను నియమించుకోనుంది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న హెచ్‌1 బీ వీసాలపై కఠిన నిర్ణయాల నేపథ్యంతో ఇన్ఫీ ఈ నిర్ణయం తీసుకుంది. టీసీఎస్‌, విప్రో లాంటి ఇతర దేశీ ఐటీ దిగ్గజాల బాటలోనే పయనిస్తూ అమెరికాలో స్థానికులకు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు సోమవారం వెల్లడించింది. కృత్రిమ మేధస్సు వంటి రంగాలలో అమెరికా వారిని నియమించాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది.

 అమెరికాలో స్థానిక నియామ‌కాల దిశ‌గా ఇన్ఫోసిస్‌

కృత్రిమ మేథ‌(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) విభాగంలో సుమారు 10వేలమంది అమెరికా ఐటీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఇన్ఫోసిస్ సిద్ద‌మ‌వుతోంది. ఈ మేరకు అక్కడ నాలుగు టెక్నాలజీ
కేంద్రాలను ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రధానంగా ఇండియానాలో ఆగస్టునెలలో మొదటి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపింది. కృత్రిమ మేథస్సు రంగంలో అమెరికన్లను నియమించు కునేందుకు చూస్తున్నట్టు ఇన్పీ సీఈవో విశాల్‌ సిక్కా రాయిటర్స్‌ ఇంటర్య్వూలోచెప్పారు. 2014 లో ప్రారంభించిన ప్రయత్నంలో భాగంగా సంస్థ 2 వేల మందిని ఇప్పటికే నియమించుకున్నట్లు తెలిపారు. అంతేకాదు అమెరికా వైపు నుంచి ఆలోచించినప్పుడు, మరింతమంది అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, మంచి విషయమే అని సిక్కా చెప్పడం విశేషం. ప్ర‌తి సంవ‌త్స‌రం అమెరికా 65వేల హెచ్‌1-బీ వీసాల‌ను మంజూరు చేస్తుంది. వీటిని సాఫ్ట్‌వేర్ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌ను అమెరికాకు పంపేందుకు వినియోగించుకుంటాయి. హెచ్‌1-బీ మార్పుల త‌ర్వాత ఐటీ సంస్థ‌లేం చేస్తున్నాయి?

Read more about: infosys h1b software america
English summary

హెచ్‌1-బీ మార్పుల ప్ర‌భావం: యూఎస్‌లో ఇన్ఫీ భారీగా స్థానిక నియామ‌కాలు | H1B visa reforms effect: infy to hire locals in america

Indian IT major Infosys Ltd will hire about 10,000 locals in the US over the next two years and set up four technology and innovation hubs there, as part of its efforts to tide over H1B visa-related issues.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X