For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 1 లక్ష 21 సంవత్స‌రాల్లో కోటి ఎలా అయ్యింది...?

రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన రిల‌య‌న్స్ గ్రోత్ ఫండ్ ప్ర‌స్తుతం రూ. 1000 నెట్ అసెట్ వాల్యూను చేరింది. మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ‌లోనే ఆ స్థాయికి చేరిన మొద‌టి ఫండ్ ఇదే. "21 ఏ

|

రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన రిల‌య‌న్స్ గ్రోత్ ఫండ్ ప్ర‌స్తుతం రూ. 1000 నెట్ అసెట్ వాల్యూను చేరింది. మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ‌లోనే ఆ స్థాయికి చేరిన మొద‌టి ఫండ్ ఇదే. "21 ఏళ్ల క్రితం 1995 అక్టోబ‌ర్‌లో ఈ ఫండ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మా ఫండ్‌లో అప్ప‌ట్లో రూ.1 ల‌క్ష పెట్టుబ‌డి పెడితే అది రూ. 1 కోటి అయింది. మ్యూచువ‌ల్ ఫండ్లు దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌కు మంచి ఆప్ష‌న్ అని న‌మ్మిన మా సిద్దాంతం నిజ‌మైంది." అని రిల‌య‌న్స్ ఫండ్ సీఈవో సందీప్ సిక్కా అన్నారు.ఈ ఫండ్ గురించి మ్యూచువ‌ల్ ఫండ్ల గురించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు...

100 రెట్లు పెరిగిన ఎన్ఏవీ

100 రెట్లు పెరిగిన ఎన్ఏవీ

21 ఏళ్ల క్రితం 10గా ఎన్ఏవీ విలువ 100 రెట్లు పెరిగి ప్ర‌స్తుతం రూ. 1000 అయింది. మార్కెట్లు ఒడిదుడుకుల‌కు లోన‌యిన‌ప్ప‌టికీ రిల‌య‌న్స్ మ్యూచువ‌ల్ ఫండ్ లాంటి దీర్ఘకాల చ‌రిత్ర క‌లిగిన అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌లు పెట్టుబ‌డిదారుల‌కు సంప‌ద‌ను వృద్ది చెందించ‌డంలో బాగా దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని సిక్కా అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్ఏవీ అంటే మ్యూచువ‌ల్ ఫండ్లో మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ విలువ ఎంత అనేది.

 రిల‌య‌న్స్ గ్రోత్ ఫండ్ గురించి

రిల‌య‌న్స్ గ్రోత్ ఫండ్ గురించి

రిల‌య‌న్స్ గ్రోత్ ఫండ్ విలువ ఈ రోజు 1003.7582గా ఉంది. ఇది ఈక్విటీ మిడ్‌క్యాప్ కేట‌గిరీకి చెందింది. మొత్తం ఈ ఫండ్‌లో మార్చి 31 నాటికి 6091 కోట్లు ఆస్తుల నిర్వ‌హ‌ణ కింద ఉన్నాయి. ఈ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 2%గా ఉంది. 1995 అక్టోబ‌ర్‌8న ఈ ఫండ్‌ను మార్కెట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఫండ్లో క‌నీస పెట్టుబ‌డి రూ.5 వేల నుంచి మొద‌ల‌వుతుంది. సిప్ మార్గంలో పెట్టాల్సిన క‌నీస పెట్టుబ‌డి రూ.100 గా ఉంది.

ఈ పండ్ పెట్టుబ‌డులేంటి?

ఈ పండ్ పెట్టుబ‌డులేంటి?

ఈ ఫండ్ మొత్తం ఆస్తుల్లో బ్యాంకింగ్‌(ప్ర‌యివేటు)లో 12.66%, వివిధ రంగాల్లో(డైవ‌ర్సిఫైడ్‌) 7.25%; ఐటీ-సాఫ్ట్‌వేర్లో 6.85%, పురుగుల మందులు, అగ్రికెమికల్స్ కంపెనీల్లో 5.97%, బ్యాంకింగ్(ప్ర‌భుత్వ‌)లో 5.79% త‌న నిధుల‌ను విస్త‌రించింది. కంపెనీల వారీగా చేస్తే యూపీఎల్ లిమిటెడ్‌(5.97%), ఎస్‌బీఐ(4.71%), హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ లిమిటెడ్(4.71%), ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్‌(3.79%), ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్‌(3.62%) ఈ సంస్థ‌ల్లో వాటాల‌ను క‌లిగి ఉంది.

మ్యూచువ‌ల్ ఫండ్‌

మ్యూచువ‌ల్ ఫండ్‌

ఉమ్మ‌డి ఆర్థిక ల‌క్ష్యం క‌లిగిన కొంత మంది పెట్టుబ‌డిదారుల నుంచి సేక‌రించిన డ‌బ్బును కూడ‌బెట్టి ఏర్ప‌రిచిన ట్ర‌స్టే మ్యూచువ‌ల్ ఫండ్‌. అద‌నంగా పొదుపు కోసం డ‌బ్బు క‌లిగిన వారెవ‌రైనా కొన్ని వంద‌ల రూపాయ‌లు మొద‌లుకొని మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఈ పెట్టుబ‌డిదారులు, పెట్టుబ‌డికి సంబంధించి ముందే నిర్ణ‌యించుకున్న ల‌క్ష్యాలు, వ్యూహాలు ఉన్న మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల యూనిట్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దేశంలో పాన్ నంబ‌రు వేటికి త‌ప్ప‌నిస‌రి?

English summary

రూ. 1 లక్ష 21 సంవత్స‌రాల్లో కోటి ఎలా అయ్యింది...? | 1 Lakh became 1 crore in 21 years. here is how?

Reliance Capital Asset Management's open-ended equity growth scheme, Reliance Growth Fund, has achieved a net asset value (NAV) of Rs. 1,000. This is the first fund in the industry to achieve this NAV level. The fund was launched 21 years ago in October 1995.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X