For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా

ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) నుంచి చందాదారులు మరింత సులభంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకునేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం ఈపీఎఫ్ ఖాతాల

|

ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) నుంచి చందాదారులు మరింత సులభంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకునేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం ఈపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకునే చందాదారులు సెల్ఫ్ డిక్లరేషన్(స్వ‌యం ధ్రువీక‌ర‌ణ‌) సరిపోతుంది. దాన్ని కార్యాలయంలో అందచేసి విత్‌డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

పీఎఫ్ విత్ డ్రా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా

దీనికి సంబంధించి ఈనెల 25న కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం.. ఈపీఎఫ్ చందాదారుడు పనిచేస్తున్న సంస్థ యజమాని సంతకం గానీ, డాక్టర్ సర్ట్ఫికెట్లు గానీ ఇవ్వనక్కర్లేదు. నగదు విత్‌డ్రాకు ఆసుపత్రి బిల్లులపై చందారుడే సంతం చేస్తే సరిపోతుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ప్రారంభించిన సెల్ఫ్ డిక్లరేషన్ విధానానికి అనుగుణంగానే ఈపీఎఫ్ లోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. పీఎఫ్ అడ్వాన్స్ విషయంలోనూ చందాదారుడికి అనేక వెసులుబాట్లు కల్పించినట్టు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విపి జాయ్ తెలిపారు. కాంపోజిట్ క్లయిం ఫోరం అందజేసి సులభంగా పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

పీఎఫ్ విత్ డ్రా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా

తీవ్రమైన అనారోగ్యానికి గురై కనీసం నెల రోజులు ఆసుపత్రిలో ఉండి ఉంటే ఈపీఎఫ్‌వో ఖాతాలోంచి ఆరు నెలల జీతం విత్‌డ్రా చేసుకోవచ్చు. శస్త్ర చికిత్స లేదా టిబి, కుష్ఠు, పక్షవాతం, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు ఎఎఫ్ సేవింగ్స్ ఖాతాల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు విత్‌డ్రాలు కొంత ఇబ్బందిగానే ఉండేది. పనిచేస్తున్న కంపెనీ నుంచి, అలాగే వైద్యుడి నుంచి ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రుల బిల్లులపై చందాదారుడు సంతకం ఉంటే సరిపోతుంది.

Read more about: pf epfo provident fund epf
English summary

ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా | you can withdraw your pf amount with self declaration on health grounds

Now, you can withdraw your provident fund savings to pay hospital bills in case of serious illness by submitting a self-declared form to the Employees’ Provident Fund Organisation (EPFO).The Labour Ministry has issued a notification on April 25 doing away with the requirement of EPF subscribers to get their employer’s approval or submit doctor certificates to withdraw provident fund savings for medical purposes.
Story first published: Friday, April 28, 2017, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X