For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ త్రితీయ రోజు బంగారం ఎందుకు కొంటారు ?

అక్ష‌య త్రితీయ రోజున కొన్న‌ది అక్ష‌యం అవుతుంద‌ని చెప్పిన వ్యాపార ప్ర‌చారాన్ని న‌మ్మి వాటిని కొనుగోలు చేయ‌డం ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఆన‌వాయితీగా మారింది. నిజానికి ఇది ఒక విశ్వాసం మాత్ర‌మే. ఈ నేప‌థ్యంలో

|

ల‌క్ష్మీదేవి క‌టాక్షం

లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. అక్ష‌య త్రితీయ రోజున కొన్న‌ది అక్ష‌యం అవుతుంద‌ని చెప్పిన వ్యాపార ప్ర‌చారాన్ని న‌మ్మి వాటిని కొనుగోలు చేయ‌డం ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఆన‌వాయితీగా మారింది. నిజానికి ఇది ఒక విశ్వాసం మాత్ర‌మే. ఈ నేప‌థ్యంలో అక్ష‌య త్రితీయ బంగారం కొనుగోలు గురించి మ‌రిన్ని అంశాల‌ను తెలుసుకుందాం.

1. శుక్రవారమే అక్షయ త్రితీయ:

1. శుక్రవారమే అక్షయ త్రితీయ:

ఒక అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ముఖ్యంగా ఏదైనా లోహం, ప్రధానంగా బంగారం కొనడం ముఖ్యం. పూర్వకాలంలో, ప్రజలు నాణాలు కొనుగోలు చేసేవారు; కానీ నాగరికత మారిపోయి తేలికైన ఆభరణాలు అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ సంవత్సరం, బంగారు ఆభరణాల్లింటి వస్తువుల‌న్నీ 30,000-50,000 రూపాయల ధరతో కొనుగోలు జోరు పెరిగింది.

2. కొనుగోళ్ల‌కు డిమాండ్‌

2. కొనుగోళ్ల‌కు డిమాండ్‌

పెరుగుతున్న రూపాయి ధరచూసి వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే అవకాశంతో ఈ సీజన్లో కొనుగోలు బలంగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా ఇదొక మార్పు అప్పుడ‌పుడు కొనుగోలు చేయడం నుండి, ధర పెరుగుదలతో సంబంధం లేకుండా, వినియోగదారులు నేడు ఎటువంటి సందర్భం లేకపోయినా ప్రతి ధర వద్ద బంగారం కొనుగోలు చేస్తున్నారు. మీ ద‌గ్గ‌ర ఉన్న సంప‌ద‌లో బంగారానికి కొంత చోటు క‌ల్పించాలి కానీ ప‌రిమితికి మించి చేయ‌కూడ‌దు. బంగారం ధ‌ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వ‌రల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్ణ‌యిస్తుంటుంది.

 3. గ‌త ఏడాది స‌మ్మెతో కొనుగోళ్లు డీలా

3. గ‌త ఏడాది స‌మ్మెతో కొనుగోళ్లు డీలా

పోయిన సంవ‌త్స‌రం ఈ పండుగకు ముందు చాలారోజులు బంగారు వ్యాపారుల సమ్మె జరిగింది. దాంతో బంగారు ఆభ‌ర‌ణాల కొనుగోళ్లు చెప్పుకోద‌గ్గ స్థాయిలో జ‌ర‌గ‌లేదు.కొంతమంది ఆభరణ తయారీదారులు పనిచేయడానికి తిరిగి వచ్చినపుడు, కొనుగోలు ప్రోత్సాహకంగా లేదు. ఈ సంవత్సరం పూర్తిగా భిన్నమైన ధోరణిని చూస్తాము. అక్షయ త్రితీయ, దానికి దగ్గరలో ఉన్న వారం లో డిమాండ్ పెరుగుతుంది.

పెద్ద నోట్ల మార్పిడి(పాత 500,1000 నోట్ల మార్పిడి) తరువాత, అమ్మకాలు తిరిగి కనిపించాయి. ప్రాధమిక అంచనాల నుండి, డిమాండ్ లో బలమైన పునరుజ్జీవనం వచ్చింది. ముందు సంవత్సరం కంటే డిమాండ్ రెండు రెట్లు ఎక్కువ పెరగడం చూసి మేమేమీ ఆశ్చర్య పోలేదు అని ఈ ప్రపంచ గోల్డ్ కౌన్సిల్స్ సంస్థ భార‌త మేనేజింగ్ డైరెక్టర్ పి ఆర్ సోమసుందరం గారు అన్నారు.

4. రెండు రెట్ల అమ్మ‌కాలు పెరిగిన‌ట్లు అంచ‌నా

4. రెండు రెట్ల అమ్మ‌కాలు పెరిగిన‌ట్లు అంచ‌నా

నిరుడు ఈ సందర్భంలో బంగారం డిమాండ్ దాదాపు 20 టన్నులు ఉండొచ్చని అంచనా వేశాము. ఆభరణాల తయారీదారుల వ‌ద్ద చేసే జ‌రిగే ఉత్ప‌త్తుల‌పై ఒక శాతం ఎక్సైజ్ సుంకం కారణంగా మొత్తం పరిశ్రమలు 42 రోజుల నిరసనల వల్ల కొత్త, నాజూకైన‌ డిజైన్లు తయారు చేయలేక పోయారు. "ఈ సంవత్సరం రెండురెట్లు అమ్మకాలు పెరుగుతాయని అనుకుంటున్నాము, ఎందుకంటే డాలర్ కి వ్యతిరేకంగా రూపాయి విలువ పెరగడం వల్ల వినియోగదారులు బంగారం కొనే అవకాశాన్ని పొందారు. ఈ సంవత్సరం చిన్న పరిమాణం తో కూడిన ఆభరణాల డిమాండ్ ఎక్కువ ఉండడం చూస్తున్నాం." అని ఆల్ ఇండియా జేమ్స్ అండ్ జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ అశోక్ మినావాలా చెప్పారు.

5. క్యాలెండ‌ర్ సంవ‌త్స‌రంలో 4.5% పెరిగిన ధ‌ర‌లు

5. క్యాలెండ‌ర్ సంవ‌త్స‌రంలో 4.5% పెరిగిన ధ‌ర‌లు

ఈ క్యాలెండర్ సంవత్సరంలో బంగారం ధరలు 4.5 శాతం పెరిగాయి, అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్సుకు $1,279 ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని బులియన్ ధర గురువారం ఇక్కడి జవేరి బజార్లో 10 గ్రాములు 29,275 రూపాయల వద్ద ముగిసింది. నిరుడు అక్షయ త్రితీయ రోజు, 10 గ్రాములు 29,855 రూపాయల ధర లేదా రెండు శాతం అధికంగా ఉంది.

"ప్రస్తుతం ఉత్తర కొరియా, సిరియాలో ఉన్న రాజకీయ ఒత్తిళ్ళ వల్ల, బంగారం దాని స్వర్గపు అప్పీలుని కొనసాగిస్తుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, భూగోళ రాజకీయ ఉద్రిక్తత విషయాల వల్ల విలువైన లోహాల ధరలు పెరుగుతాయని చరిత్ర సూచిస్తుంది. భారతదేశంలో, డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి విలువ పెరగడం వల్ల, ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర పెరుగుదల ప్రభావం తక్కువగా ఉంది" అని రిద్ది సిద్ధి బులియన్ల డైరెక్టర్ ప్రిధ్విరాజ్ కొఠారి చెప్పారు. హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లు

6. అంత‌ర్జాతీయంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

6. అంత‌ర్జాతీయంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

బంగారం ధరలు ఐదు నెలలు పెరగకుండా స్థిరంగా ఉంటాయో లేదో అనే ఆందోళన ఉంది, దానివల్ల పండగలకు, వివాహ సమయాలలో కొనుగోలు చేయడానికి అర్ధవంతంగా ఉంటుంది, బంగారం ప్రతి ఒక్కరి పోర్ట్ ఫోలియోలో భాగం అయింది అని కఠారి చెప్పారు. "ఇది ఎప్పుడూ అనిశ్చితి సమయంలో కొనుగోలుదారుకి రాబడిని ఇస్తుంది" అని అన్నారాయన. అక్ష‌య త్రితీయ స‌మీపిస్తున్న త‌రుణంలో బంగారం ధ‌ర‌లు దిగి రావ‌డం శుభ‌సూచికంగా క‌నిపిస్తోంది.

7. చరిత్ర చెప్పిన పాఠాలు:

7. చరిత్ర చెప్పిన పాఠాలు:

బంగారం ధరలు రూపాయలలో లెక్కి౦చబడడం వల్ల 2016 లో చివరి అక్షయ త్రితీయ నుండి అంతగా కదలికలు లేవు. (10 గ్రాములు) 30,000 ధర వద్ద, బంగారం ధర డిమాండ్ ని అధిగమించలేదు. పరిస్ధితులు ఇలాగే ఉంటే బంగారం ధరలు పెరుగుతాయి. 2014 అక్షయ త్రితీయ కి కూడా, బంగారం ధరలు మానసికంగా ప్రధాన స్ధాయి -30,000 రూపాయలు దాటింది. తరువాతి సంవత్సరం, బంగారం ధర దాదాపు 11% అనగా 27,000 రూపాయలకు పడిపోయింది. దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గరాల్లో బంగారం ధ‌ర‌ల కోసం క్లిక్ చేయండి

8. మొత్తం మీ సంప‌ద‌లో బంగారం ఎంత శాతం?

8. మొత్తం మీ సంప‌ద‌లో బంగారం ఎంత శాతం?

"బంగారు ధర స్థాయిలు కొనుగోలుదారుల విస్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. అక్షయ త్రితీయ రోజు జరిగే టోకెన్ కొనుగోళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరైనా బంగారం కొని, ఒక సంవత్సరం పాటు అలా ఉంచాలి అంటే, అనేక మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి మొత్తం ఆస్తుల్లో బంగారం 10-15% వరకు ఉంటే, స్వల్పకాల వ్యవధి కోసం బంగారం కొనుగోలు చేయడం ప్రమాదకర వ్యవహారం" అని ఎక్కువ మొత్తంలో బంగారం కొనమని త‌మ ద్గ‌గ‌ర సేవ‌లు పొందే మ‌దుప‌ర్ల‌కు చెప్ప‌బోమ‌ని ఫైనాన్షియల్ అడ్వైజర్ ప్రదీప్ శర్మ చెప్పారు.

9. బంగారం నిల్వలను పట్టి ఉంచడం

9. బంగారం నిల్వలను పట్టి ఉంచడం

పెద్ద పెద్ద దేశాలలో సెంట్రల్ బ్యాంకులు బంగార౦ నిల్వలని పట్టి ఉంచుతాయి, ఎక్కువ బంగారం భద్రపరచడం వల్ల, ఆటోమేటిగ్గా బంగారం ధరలు పెరుగుతాయి. భారతదేశంలో బంగారు నిల్వలు 2016 వ సంవత్సరం Q3 Q4 లో 557.77 టన్నులు ఉన్నాయి.

2016 అక్షయ త్రితీయ, పండగ ముందు దేశం మొత్తం లోని ఆభరణ తయారీదారులు ఎక్సైజ్ సుంకం ఒక శాతం పెరిగినందుకు వ్యతిరేకంగా 42 రోజుల నిరసన చేసారు. క్రితం సంవత్సరం డిమాండ్ దాదాపు 20 టన్నులు అంచనా వేస్తే ఈ సంవత్సరం అది రెండు రెట్లు ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లు

10. అక్ష‌య త్రితీయ రోజు ఏం కొన్నా అది రెట్టింపు అవుతుంద‌ని న‌మ్మ‌కం.

10. అక్ష‌య త్రితీయ రోజు ఏం కొన్నా అది రెట్టింపు అవుతుంద‌ని న‌మ్మ‌కం.

అక్ష‌య త్రితీయ శ్రీ మ‌హా విష్ణువుకు మ‌రియు మ‌హా ల‌క్ష్మి అమ్మ‌వారికి సంబంధించిన ప‌ర్వ‌దినం. అందుకే ల‌క్ష్మీ స్వ‌రూప‌మైన స్వ‌ర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవ‌లం బంగారం మాత్ర‌మే కాదు ఏదైనా లోహాన్ని కొన‌వ‌చ్చే. అంతే కానీ స్తోమ‌త‌కు మించి అప్పులు చేసి బంగారం కొన‌వ‌ద్ద‌ని మ‌న‌వి. పాఠ‌కుల‌కు అక్ష‌య త్రితీయ శుభాకాంక్ష‌లు

దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

English summary

అక్షయ త్రితీయ రోజు బంగారం ఎందుకు కొంటారు ? | why people will buy gold on akshaya tritiya day

Gold price levels do impact the psyche of buyers. I am not talking about token purchases, which are done on Akshaya Tritiya. For anybody wanting to buy gold and hold in for one year, there are many blocks. While gold should be 10-15% of an individual’s portfolio, buying gold with a short-term horizon is a risky affair,” says Pradeep Sharma, a financial advisor who is telling clients to resist buying large quantities of gold.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X