For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డు స్థాయి లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ ప్ర‌ధాన స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈ సెన్సెక్స్ బుధ‌వారం రికార్డు స్థాయి గ‌రిష్టంలో ముగిసింది. గ‌తంలో మార్చి 2015లో న‌మోదు చేసిన గరిష్టాన్ని తోసిరాజ‌ని దూసుకెళ్లింది. రోజంతా కొన‌సాగిన సానుకూల ప‌రి

|

దేశీయ ప్ర‌ధాన స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈ సెన్సెక్స్ బుధ‌వారం రికార్డు స్థాయి గ‌రిష్టంలో ముగిసింది. గ‌తంలో మార్చి 2015లో న‌మోదు చేసిన గరిష్టాన్ని తోసిరాజ‌ని దూసుకెళ్లింది. రోజంతా కొన‌సాగిన సానుకూల ప‌రిణామాల‌తో రూపాయి సైతం డాల‌రుతో 20 నెల‌ల గరిష్టానికి వెళ్లింది. మంగళవారం ట్రేడింగ్‌లోనే నిఫ్టీ ఆల్‌టైం గరిష్ట స్థాయిని చేరగా.. ఇవాళ మరోసారి రికార్డ్ ముగింపు నమోదు చేసుకుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు ఆర్జించడంతో ఆర్‌ఐఎల్‌ షేరు రికార్డ్‌ స్థాయిలో దూసుకుపోతోంది. ఈ రోజు మార్కెట్‌కు సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు...

రికార్డు స్థాయిల‌ను న‌మోదు చేసిన రెండు సూచీలు

రికార్డు స్థాయిల‌ను న‌మోదు చేసిన రెండు సూచీలు

ఒక ప‌క్క డిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాజ‌పా ఏక‌ప‌క్ష విజ‌యం, మ‌రో వైపు అంత‌ర్జాతీయ సానుకూల అంశాల‌తో విదేశీ సూచీలు రాణించ‌డంతో దేశీయ మార్కెట్లు లాభాల దుమ్మును రేపాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 190 పాయింట్లు లాభ‌ప‌డి(0.63%) 30133.35 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ మ‌రోసారి జీవ‌న కాల గ‌రిష్ట స్థాయిల‌ను న‌మోదు చేసింది. నిఫ్టీ 50 సూచీ 45 పాయింట్ల‌(0.45%) లాభంతో 9352 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈ సెన్సెక్స్‌కు గానీ లేదా నిఫ్టీకి గానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఇదే అత్య‌ధిక క్లోజింగ్ పాయింట్లు.

కార‌ణాలు

కార‌ణాలు

దేశీయంగా ప‌లు కంపెనీల త్రైమాసిక ఫ‌లితాలు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా ఉండ‌టం, ఢిల్లీ ఎన్నిక‌లు కేంద్రంలో అధికార భాజ‌పాకు అనుకూలంగా రావ‌డం వెర‌సి మార్కెట్ల‌కు ఉద‌యం ట్రేడింగ్‌లోనే జోష్ వ‌చ్చింది. గ‌త 24 గంట‌ల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల వ‌ల్ల అంత‌ర్జాతీయ మార్కెట్లు లాభాల‌ను గ‌డించ‌డం సైతం దీనికి క‌లిసొచ్చింది. ప్ర‌తిదీ మార్కెట్ల‌కు సానుకూలంగానే ప‌రిణ‌మించిన కార‌ణంగా సెన్సెక్స్ 2017లో ఇప్ప‌టివ‌ర‌కూ 20%(డాల‌ర్ క‌రెన్సీలో) ఎగ‌సింది.

ఈ సంవ‌త్స‌రంలో అంత‌ర్జాతీయంగా అన్ని దేశాల సూచీల కంటే మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రిచినది బీఎస్ఈ సెన్సెక్స్ కావ‌డం గ‌మ‌నార్హం.

 రంగాల వారీగా చూస్తే

రంగాల వారీగా చూస్తే

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఎఫ్ఎమ్‌సీజీ సూప‌ర్ ప‌నితీరు క‌న‌బ‌రిచింది. ఎఫ్ఎమ్‌సీజీ(2.04%), ఆటో(1.01), బ్యాంకింగ్ (0.82%), లోహ రంగం(0.47%) లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు స్థిరాస్తి(2.95%), ఐటీ(1.08%), చ‌మురు,స‌హ‌జ వాయు, మౌలిక‌ రంగాలు న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.

లాభ‌ప‌డ్డ‌వి-న‌ష్ట‌పోయిన‌వి

లాభ‌ప‌డ్డ‌వి-న‌ష్ట‌పోయిన‌వి

సెన్సెక్స్ గెయిన‌ర్లలో ఐటీసీ(3.36%), ఎం అండ్ ఎం(3.29%), హెచ్‌డీఎఫ్‌సీ(2.36%), హెచ్‌యూఎల్‌(1.78%), ఐసీఐసీఐ బ్యాంకు(1.61%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో అదానీ పోర్ట్స్ (-2.31 శాతం), ఇన్ఫోసిస్ (-1.61 శాతం), డాక్టర్ రెడ్డీస్‌ (-1.31 శాతం), పవర్ గ్రిడ్ (-1.3 శాతం), రిలయన్స్ (-1.13 శాతం) ఉన్నాయి.

English summary

రికార్డు స్థాయి లాభాల్లో ముగిసిన మార్కెట్లు | sensex and nifty close at all time highs

India’s benchmark BSE Sensex on Wednesday rose as much as 0.4% to hit a record high on Wednesday, surpassing the previous milestone it hit in March 2015, while the rupee hit a 20-month high against the US dollar. The market rally comes after a string of solid domestic quarterly results, while hopes for additional foreign inflows to India have increased on renewed optimism about the US economy and after the first round of an election in France went to the market’s preferred candidate.
Story first published: Wednesday, April 26, 2017, 16:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X