For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్‌డీఎఫ్‌సీలో 3 నెల‌ల్లో 6000 మంది ఉద్యోగులు .....

దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,990 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక

|

దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,990 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే ఇది 18.3 శాతం అధికం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా బ్యాంక్ నికర లాభం 15,253 కోట్ల రూపాయలుగా ఉంది. 2015-16తో చూస్తే ఇది 19.2 శాతం అధికం. ఈ మేరకు శుక్రవారం బ్యాంక్ స్పష్టం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బ్యాంక్ డిపాజిట్లపై ప్రభావం చూపిందని, ఫలితంగా ఆదాయం పడిపోయిందని వివరించింది.

త్రైమాసిక లాభం రూ.3990 కోట్లు

మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 6,096 మంది తగ్గారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 84,325కు క్షీణించింది. మున్ముందు ఇది కొనసాగవచ్చన్న సంకేతాలను బ్యాంక్ ఇవ్వడం గమనార్హం. అంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ 4,581 మంది ఉద్యోగులు తగ్గారు.

Read more about: hdfc bank banking
English summary

హెచ్‌డీఎఫ్‌సీలో 3 నెల‌ల్లో 6000 మంది ఉద్యోగులు ..... | HDFC Bank Cuts 6,000 Jobs In Three Months

In the preceding October-December 2016 quarter, the headcount had come down by 4,581 employees, which helped in the cost-to-income ratio improve to 43.8 per cent. Sukthankar explained that while digital technologies, which helped the bank introduce products like instant personal loans, help reduce reliance on people, network expansion requires additional manpower.
Story first published: Saturday, April 22, 2017, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X