For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏజెంట్లు ఒత్తిడి చేస్తున్నార‌ని పాలసీలు వ‌ద్దు

ప్రతి ఒక్కరికి జీవిత భీమా అవసరం ఎంతైనా ఉంది. కాదనేవారు ఎవ‌రు? కానీ కొంచెం పరిచయం కాగానే పాలసీ తీసుకోండి అని వెంట బడి వేధిస్తూ ఉంటారు కొంత మంది వ్య‌క్తులు. ఇంతకూ క్రితం చేసి ఉన్నామండీ..అన్నా వినిపించు

|

ప్రతి ఒక్కరికి జీవిత భీమా అవసరం ఎంతైనా ఉంది. కాదనేవారు ఎవ‌రు? కానీ కొంచెం పరిచయం కాగానే పాలసీ తీసుకోండి అని వెంట బడి వేధిస్తూ ఉంటారు కొంత మంది వ్య‌క్తులు. ఇంతకూ క్రితం చేసి ఉన్నామండీ..అన్నా వినిపించుకోరు. యాక్సిడెంట్ బెన్ ఫిట్ ల గురించి, మనీ బ్యాక్ పాలసీ గురించి.. ఇంకా హెల్త్ ఇన్స్యూ రెన్స్ గురించి చెవిలో జోరీగలా చెబుతూనే ఉంటారు. ఎవరి ఆర్ధిక స్తోమతని బట్టి వారు ముందు చూపుతో..జీవిత భీమా చేసుకోవడం మంచిదే!

కానీ తమకి లభించే కమీషన్ కోసం ఇతరులని పాలసీల కోసం ఒత్తిడి చేయడం సబబు కాదేమో!అనిపిస్తూ ఉంటుంది. నేనైతే భీమా ఏజంట్స్ కనబడగానే కాస్త స్థిమితంగా ఉండటం నేర్చుకున్నాను. సున్నితంగా పాలసీలు ఉన్న విషయం చెప్పి ... హమ్మయ్య అని తేలికగా బయట పడతాను. ఇలాంటి వాటికి సంబంధించి మరిన్ని జాగ్ర‌త్త వ‌హించాల్సిన అంశాలు మీ కోసం...

బ‌ల‌హీన మ‌న‌స్కులు

బ‌ల‌హీన మ‌న‌స్కులు

ఇవి కాకుండా మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్ ద్వారా లక్షలకి లక్షలు సంపాదించ వచ్చు అని మోసం చేసే వారు ఉన్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చు అనే బలహీన మనస్కులు..వీరి ఎరకి చిక్కుకుని బోల్తా పడుతూ ఉంటారు. నేను గమనించిన విషయం ఏమిటంటే.. ఈ మ‌ధ్య ఒక‌ కంపెనీ మన దేశంలో సోష‌ల్ మీడియా ద్వారా ఆర్టిక‌ల్స్ లింక్‌ను క్లిక్ చేసి చ‌దివితే మీకు డ‌బ్బు వ‌స్తుంద‌ని వంద‌ల మందిని మోసం చేసింది. అందులో మ‌న తెలుగు వారు సైతం ఉన్నారు. కాబ‌ట్టి త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

 ఆరోగ్య బీమా పాల‌సీల్లో కూడా

ఆరోగ్య బీమా పాల‌సీల్లో కూడా

ఇక ఆరోగ్యం పట్ల అవగాహన ఏమో కానీ.. అనారోగ్యం వచ్చినప్పుడు ఆదుకుంటుందని హెల్త్ పాలసీ తీసుకుంటే బాగుంటుందని చెపుతుండటం మొదలెట్టారు. కానీ అందులో ష‌రతుల గురించి చెప్ప‌రు. తీరా క్లెయిం కోసం వెళ్లిన‌ప్పుడు ఇంత‌వ‌ర‌కే చెల్లిస్తాం. కావాలంటే చూడండి మా కంపెనీ నిబంధ‌న‌ల్లో ఉంది. చ‌దువుకోండి అని బీమాకంపెనీ ప్ర‌తినిధులు చావుక‌బురు చ‌ల్ల‌గా చెబుతుంటారు. అందుకే మొద‌ట బీమాపైన అవ‌గాహ‌న పెంచుకోండి

ప్రీమియం క‌ట్ట‌లేక‌...

ప్రీమియం క‌ట్ట‌లేక‌...

అసలే మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌నిషి,చదువుల ఖర్చుకి, కార్పోరేట్ ఆసుప‌త్రుల బిల్లులకి ఒల్లు గుల్ల‌వుతోంది. మ‌రో వైపు ఈ భీమా ఏజంట్స్ తాకిడి ఒకటి. భీమా చేసుకోడం జీవితం లోను జీవితానంతరం కూడాను మంచిదే..కానీ ఇతరులని ఇబ్బంది పెట్టి పాలసీలు చేయించడం వల్ల ఒక ప్రీమియం కట్టి తరువాత మానుకున్న వారు ఉంటున్నారు.ఏజంట్స్ కి లభించే 25 % కోసం వెంటబడి వేదించి భీమాలు చేయించడం ఎంతవరకు మంచిదో..ఆలోచించుకుంటే మంచిది కదా!

త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ!

త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ!

భీమా వరమే..కానీ ఇబ్బంది పడుతూ కట్టడం వరం కాదు కదా! కాళ్ళకి తగిలే తీగలు కొందరు భీమా ఏజంట్లు. పట్టుకుంటే వదలరు . . వాళ్ళ ల‌క్ష్యాల‌ కోసం ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు కదా!. మొన్న ఈ మధ్య ఒక ఏజెంట్‌ పోన్ లో మాట్లాడుతూ హెల్త్ పాలసీలు చేయిస్తామని చెప్పి ఓ..అరగంట సమయాన్ని తినేశారు. కట్టే ముందు ఒకసారి మా ఇంట్లో వారిని అడిగి చెపుతాను అన్నాను. వెంటనే చెప్పండి లేకపోతె ఇంతలోనే వేరే వారికి మాట ఇస్తారేమో!మీరు తప్పనిసరిగా మా ద్వారానే హెల్త్ పాలసీ తీసుకోవాలి. నేను రేపే వస్తాను అని ఇబ్బంది పెట్టారు. అసలు ఈ సమయంలో.. పాలసీ తీసుకునే పరిస్థితిలో మేము లేము.అది చెపుతున్న వినకుండా మర్నాడు మా ఇంటి సమీపంలోకి వచ్చి కాల్ చేసారు పాలసీ కోసం వస్తున్నాం అని. నేను వెంటనే.. ఊర్లో లేమండి అని చెప్పి తప్పించుకుని.. అయినా ఇంటి వరకు వచ్చినా వస్తారు అనుకుని.. ఇంట్లోనే దొంగలా ఉండాల్సి వచ్చింది అంటే అర్ధం చేసుకోండి.. ఈ భీమా ఏజంట్స్ ఎంత ఇబ్బందిపెదతారో..అన్నది. ఇవండీ భీమా బాధలు. ఇలాంటివి మీకు ఎదురైతే కామెంట్ల ద్వారా స్పందించండి.

Read more about: insurance policy
English summary

ఏజెంట్లు ఒత్తిడి చేస్తున్నార‌ని పాలసీలు వ‌ద్దు | Be careful with life insurance agents who force to take unwanted policies

Be careful with the insurance agents who will force you to take policies for their commission
Story first published: Saturday, April 22, 2017, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X