For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

86 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌

దేశీయ ఇన్వెస్ట‌ర్లు ఇటీవ‌ల త‌క్కువ స్థాయిల‌కు వెళ్లిన స్టాక్‌ల‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూప‌డంతో గురువారం దేశీయ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. త్రైమాసిక ఫ‌లితాల్లో నిరాశ‌ప‌రిచిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్

|

దేశీయ ఇన్వెస్ట‌ర్లు ఇటీవ‌ల త‌క్కువ స్థాయిల‌కు వెళ్లిన స్టాక్‌ల‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూప‌డంతో గురువారం దేశీయ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. త్రైమాసిక ఫ‌లితాల్లో నిరాశ‌ప‌రిచిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్ షేర్ల‌ను కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో బీఎస్ఈ సూచీ 85.82 పాయింట్ల లాభంతో 29,422.39 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 33 పాయింట్ల న‌ష్టంతో 9136 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 86 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(2.14%), వినియోగ‌దారు వ‌స్తువులు(1.23%), ఐటీ(0.99%), టెక్నాల‌జీ(0.96%) లాభ‌ప‌డ‌గా; మ‌రో వైపు బ్యాంకింగ్‌( 0.53%), చ‌మురు,స‌హ‌జ‌వాయు(0.25%), ప‌వ‌ర్‌(0.17%), హెల్త్‌కేర్‌(0.14%) న‌ష్ట‌పోయాయి.
గెయిల్‌(2.02%), అదానీ పోర్ట్స్‌(1.83%), గ్రాసిం(1.82%), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా టాప్‌ గెయినర్స్‌గా నిలవగా, బీవోబీ, గెయిల్‌, ఐబీ హౌసింగ్‌, అదానీ పోర్ట్స్‌, జీ, అల్ట్రాటెక్‌, టెక్‌మహీంద్రా, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ తదితరాలు లాభపడ్డాయి. ఐసీఐసీఐ, యాక్సిస్‌(-2.2%), యెస్‌ బ్యాంక్‌(3.73%), ఐవోసీ, టాటా పవర్‌, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా నష్టపోయాయి.

English summary

86 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌ | sensex ended with 86 points gain

The Sensex and Nifty ended higher on Thursday as investors picked beaten down counters, including technology stocks that lost ground on disappointing quarterly results from software services exporters Infosys Ltd and Tata Consultancy Services Ltd.The benchmark BSE index ended 85.82 points or 0.29 per cent higher at 29,422.39.The broader NSE index closed up 32.9 points or 0.36 per cent at 9,136.40, posting its first gain in six sessions.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X