For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు ఆదివారం ప‌నిచేయ‌వు

ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాలకు తాజాగా తమిళనాడు జ‌త‌కూడింది. తమ రిటైల్ అవుట్ లెట్లను మే14 నుంచి ప్రతి ఆదివారం మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్‌ అసోసియే

|

ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాలకు తాజాగా తమిళనాడు జ‌త‌కూడింది. తమ రిటైల్ అవుట్ లెట్లను మే14 నుంచి ప్రతి ఆదివారం మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఇండియ‌న్‌ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన ఇంధ‌న ఆదా పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి చేరిందని అసోసియేషన్‌ ప్రకటించింది.

మే14 నుంచి ఆదివారం నో పెట్రోల్

తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, హర్యానాలతోపాటుగా తమిళనాడులో సుమారు 20వేల అవుట్‌లెట్స్ ప్ర‌తి ఆదివారం మూతపడనున్నట్టు చెన్నై పెట్రోల్‌ బంకుల యాజమానుల సంఘం మంగళవారం ప్రకటించింది. తాము కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ ఆయిల్‌ కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం అమలును వాయిదా వేసినట్లు తెలిపాయి. ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులను మూసివేసేందుకు తాము కూడా నిర్ణయించామని ఎనిమిది రాష్ట్రాల్లో మే 14నుంచి పెట్రోల్ పంపులు ఆదివారాలు 24 గంటలు పనిచేయవని ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమకు రూ.150 కోట్ల నష్టం రానుందని అంచనావేశారు. అయితే ఆదివారం డిమాండ్‌ 40శాతం తగ్గుతుందని చెప్పారు.

మే14 నుంచి ఆదివారం నో పెట్రోల్

మరోవైపు అసోసియేషన్ నిర్ణయానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు మద్దతు ప్రకటించాయా అని అడిగినప్పుడు, త్వరలో తమ నిర్ణయాన్ని వారికి తెలియ‌చేస్తామని సురేష్ కుమార్ చెప్పారు. అలాగే పెట్రోల్‌ బంకుల మార్జిన్ల‌ పెంపుపై ప్రశ్నించినపుడు దీనిపై అసోసియేషన్‌ చర్చిస్తోందని త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఒకరు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, తద్వారా అత్యవసర సమయంలో పెట్రోల్‌ అందించనున్నట్లు చెప్పారు.

Read more about: petrol narendra modi
English summary

మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు ఆదివారం ప‌నిచేయ‌వు | petrol bunks in 8 states to be closed on every sunday

Beginning May 14, fuel outlets in eight states will be shut every Sunday following Prime Minister Narendra Modi's call to conserve oil, a fuel pump owners' body said here on Tuesday."We had planned to shut our outlets on Sundays a few years back. But oil marketing companies had then requested us to reconsider our decision. Now we have decided to shut the outlets on Sundays," said Suresh Kumar, an executive committee member of the consortium of Indian petroleum dealers.
Story first published: Wednesday, April 19, 2017, 10:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X