For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచంలో టాప్ 10 టీవీ బ్రాండ్లు

ప్ర‌స్తుతం ఇంటిలో ఉండాల్సిన క‌నీస అవ‌స‌రాల్లో టీవీ ఒక‌టిగా ఉంది. త‌మ బ్రాండ్ల‌లో కొత్త ఫీచ‌ర్లు ఉండేలా టీవీ కంపెనీలు ఎప్ప‌టిక‌ప్పుడు శ్ర‌మిస్తూనే ఉంటాయి. మొద‌ట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీల నుంచి ప్ర‌స్త

|

ప్ర‌స్తుతం ఇంటిలో ఉండాల్సిన క‌నీస అవ‌స‌రాల్లో టీవీ ఒక‌టిగా ఉంది. త‌మ బ్రాండ్ల‌లో కొత్త ఫీచ‌ర్లు ఉండేలా టీవీ కంపెనీలు ఎప్ప‌టిక‌ప్పుడు శ్ర‌మిస్తూనే ఉంటాయి. మొద‌ట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీల నుంచి ప్ర‌స్తుతం వైఫై సైతం క‌నెక్ట్ చేసి ఇంట‌ర్నెట్ వాడుకునేలా ప్లాస్మా, ఎల్ఈడీ టీవీలు వ‌చ్చేశాయి. ప్ర‌స్తుతం ప్రపంచంలో టాప్ టీవీ బ్రాండ్ల‌లో శ్యామ్‌సంగ్‌, ఎల్జీ, సోనీ,హైసెన్స్‌, టీసీఎల్‌, స్కైవ‌ర్త్‌, పానాసోనిక్‌, తోషిబా, షార్ప్, విజియో ఉన్నాయి. ఒక్కో టీవీ బ్రాండ్ గురించి తెలుసుకుందాం.

10.విజియో

10.విజియో

అమెరిక‌న్ వినియోగ‌దారు ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ విజియో. టీవీ వ్యాపారంలో ఒక ప్ర‌ముఖ సంస్థ‌గా ఉంది. కాలిఫోర్నియాలోని ఇర్విన్ ప్ర‌ధాన కేంద్రంగా ఇది ప‌నిచేస్తున్న‌ది. అన్ని ర‌కాల అందుబాటు ధ‌ర‌ల్లోనూ ఫ్లాట్ స్క్రీన్ టీవీల త‌యారీ ఈ కంపెనీ ప్ర‌ధాన వ్యాపారం. ఈ కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు కెన్ లోవ్, నెవ్‌స‌మ్‌, విలియ‌మ్ వాంగ్‌. 2002 సంవ‌త్స‌రంలో ముగ్గురు ఉద్యోగుల‌తో 6 ల‌క్ష‌ల డాల‌ర్ల‌తో ఈ కంపెనీ ప్రారంభమైంది. 2006లో కంపెనీ రెవెన్యూ 700 మిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ఈ సంస్థ‌కు మార్కెట్ వాటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3 శాతంగా ఉంది.

9. షార్ప్‌

9. షార్ప్‌

క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తులు త‌యారుచేసే జ‌ప‌నీస్ బ‌హుళ‌జాతి సంస్థ షార్ప్‌. స‌కాయ్‌, జ‌పాన్‌లోని స‌కాయ్‌-కూ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉంది. టోక్యోలో 1912 సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైంది. షార్ప్ సంస్థ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2013 ఏడాదిలో టీవీల త‌యారీలో 10వ అతిపెద్ద కంపెనీగా ఉంది. ప్ర‌పంచంలో 2016 నుంచి తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. జపాన్ దేశంలో షార్ప్ ఫోన్లు సైతం బాగా ప్ర‌సిద్ది పొందాయి. జపాన్‌లో అమ్మ‌కాల్లో మూడో స్థానంలో ఉన్నాయి.

ఈ సంస్థ‌కు మార్కెట్ వాటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3.2%గా ఉంది.

8. తోషిబా

8. తోషిబా

జపాన్ దేశానికి చెందిన మ‌రో టీవీ త‌యారీ సంస్థ తోషిబా. టోక్యో కేంద్రంగా ప‌నిచేస్తున్న క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ సంస్థ మ‌న దేశంలోనూ బాగానే విస్త‌రించింది. తోషిబా ర‌క‌ర‌కాల సేవ‌లు, ఉత్ప‌త్తుల్లో విస్త‌రించింది. ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, వ‌స్తువులు, క‌మ్యూనికేష‌న్ సామాగ్రి, ఐటీ, ప‌వ‌ర్ సిస్ట‌మ్స్‌, క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, లైటింగ్‌, లాజిస్టిక్స్‌, మెడిక‌ల్ ప‌రిక‌రాలు, పారిశ్రామిక‌, సామాజిక మౌలిక సదుపాయాల ప‌రిక‌రాలు మొదలైన‌వి ఇందులో ప్ర‌ధానం. 1938లో ప్రారంభ‌మైన ఈ సంస్థ పేరు మొద‌ట్లో టోక్యో షిబౌర ఎల‌క్ట్రిక్ కేకేగా పేరు క‌లిగి ఉంది. 1978లో పేరు మారింది. తోషిబా ముఖ్యంగా హోమ్ అప్లియెన్సెస్‌, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, డిజిట‌ల్ ఉత్ప‌త్తులు, కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ విభాగాల్లో ఉత్ప‌త్తుల త‌యారీని చేస్తున్న‌ది. 2016లో ఈ సంస్థ నిక‌ర ఆదాయం 460 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

ఈ సంస్థ‌కు మార్కెట్ వాటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3.4%గా ఉంది.

 7. పానాసోనిక్‌

7. పానాసోనిక్‌

జపాన్ ఒసాకాలోని కొడొమా ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న బ‌హుళ‌జాతి ఎల‌క్ట్రానిక్ కార్పొరేష‌న్ సంస్థ పానాసోనిక్‌. టోక్యో స్టాక్ ఎక్స్చేంజీలో ఇది లిస్ట్ అయి ఉంది. 2006 జ‌న‌వ‌రి 19న అన‌లాగ్ టీవీల ఉత్ప‌త్తిని నిలిపివేస్తున్న‌ట్లు ఈ సంస్థ ప్ర‌క‌టించింది. 2008 న‌వంబ‌ర్ 3న పానాసోనిక్‌, సాన్యో తాము ఇద్ద‌రూ విల‌నీ చ‌ర్చ‌ల్లో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అతి త‌క్కువ స‌మ‌యంలోనే సాన్యో పానాసోనిక్‌లో విలీనం అయింది. 2009 డిసెంబ‌ర్ నాటికి రెండు సంస్థల విలీన ప్ర‌క్రియ పూర్త‌యింది. 2014 నుంచి యూఎస్ టీవీ మార్కెట్లో త‌న విస్త‌ర‌ణ‌ను ఆపేసి 2016 నాటికి అక్క‌డ నుంచి త‌ప్పుకుంది. అమెరికాలో టీవీ విడి భాగాల వ్యాపారాల‌ను అన్నింటినీ అమ్మేసినప్ప‌టికీ, కెన‌డాలో టీవీ వ్యాపారంలో ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సంస్థ‌కు 2016లో మార్కెట్ షేర్ 3.7శాతంగా ఉంది.

6. స్కైవ‌ర్త్‌

6. స్కైవ‌ర్త్‌

స్కైవ‌ర్త్ ఒక చైనీస్ క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ. 29 ఏళ్ల క్రితం ఈ సంస్థ ప్రారంభ‌మైంది. చైనా సిలికాన్ వ్యాలీగా పిల‌వ‌బ‌డే షెంజెన్ హై టెక్ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్‌లో దీని ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. సెట్ అప్ బాక్స్‌లు, టెలివిజ‌న్లు, ఆడియో వీడియో ర‌క్ష‌ణ ప‌రికరాలు, మొబైల్ ఫోన్లు, ఆటో ఎల‌క్ట్రానిక్స్ వంటి ఉత్ప‌త్తుల‌ను ఈ సంస్థ త‌యారుచేస్తుంది. దీని కార్య‌క‌లాపాలు మంగోలియా, హాంగ్‌కాంగ్‌, షెంజెన్‌,గుంగ్జౌ, డొంగ్గౌన్ ప్రాంతాల్లో ఉన్నాయి. దీని అన్ని కార్యాల‌యాల్లో దాదాపు 37 వేల మంది ప‌నిచేస్తున్నారు. స్కైవ‌ర్త్ కంపెనీ విలువ ప్ర‌స్తుతం 8.98 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. 2005 నుంచి సేల్స్ రెవెన్యూ ప‌రంగా చైనాలో కేబుల్ టీవీ బ్రాండ్‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సంస్థ‌కు మార్కెట్ వాటా 5.3%గా ఉంది.

5. టీసీఎల్‌

5. టీసీఎల్‌

చైనా దేశానికే చెందిన మ‌రో క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ కార్పొరేష‌న్‌. 2013 నాటికి మార్కెట్ వాటా ప‌రంగా మూడో అతిపెద్ద సంస్థ‌గా ఎదిగింది. టీసీఎల్‌కు నాలుగు లిస్టెడ్ కంపెనీలు టీసీఎల్ మ‌ల్టీమీడియా టెక్నాల‌జీస్ హోల్డింగ్స్ లిమిటెడ్‌, టీసీఎల్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీస్ హోల్డింగ్స్ లిమిటెడ్‌, టీసీఎల్ డిస్‌ప్లే టెక్నాల‌జీస్‌, టోన్లీ ఎల‌క్ట్రానిక్స్ షెంజెన్ స్టాక్ ఎక్సేంజీలో ఉన్నాయి. అయితే టీసీఎల్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీస్ హోల్డింగ్స్‌ను 2016లో డీలిస్ట్ చేశారు. ఈ సంస్థ టెలివిజ‌న్ సెట్లు, స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ ఫోన్లు, ఎయిర్ కండిష‌నింగ్‌, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేట్ల‌ర్లు వంటి వాటిని త‌యారుచేస్తుంది. 2014లో సంస్థ రెవెన్యూ 16.44 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. 2015 నాటికి మొత్తం 73,537 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సంస్థ‌కు మార్కెట్ వాటా 5.6%గా ఉంది.

4. హైసెన్స్‌

4. హైసెన్స్‌

చైనీస్ బ‌హుళ‌జాతి వైట్ గూడ్స్‌, క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ హైసెన్స్‌. మొత్తం 13 త‌యారీ కేంద్రాలు ఉన్నాయి. చైనాలో దీని ప్ర‌ధాన కేంద్రం షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని క్వింగ్డావో. ఇది చైనా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌. రిటైల్ ఉత్ప‌త్తుల‌ను వివిధ బ్రాండ్ పేర్ల‌తో(కంబైన్‌, కెలాన్‌, రోన్‌షెన్‌) అమ్ముతుంది. మొబైల్ ట‌ర్మిన‌ల్స్ త‌యారీలో 430 పేటెంట్లు, సాఫ్ట్‌వేర్ కాపీరైట్‌లు ఈ సంస్థ‌కు ఉన్నాయి. విదేశాల్లో విస్త‌ర‌ణ‌ను చూస్తే ఉత్త‌ర అమెరికా, యూర‌ప్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ద‌క్షిణాసియా ప్రాంతాల్లో 16 చోట్ల చైనా వెలుప‌ల కంపెనీల‌ను క‌లిగి ఉంది. 2018లో జ‌ర‌గ‌నున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ స్పాన్ష‌ర్‌షిప్‌ను ఈ సంస్థ సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సంస్థ‌కు మార్కెట్ వాటా 5.6%గా ఉంది.

3. సోనీ

3. సోనీ

జ‌పాన్ దేశంలోని టోక్యో న‌గ‌రంలోని మినాటో కేంద్రంగా సోనీ కార్పొరేష‌న్ ప‌నిచేస్తోంది. 2012 సంవ‌త్స‌రంలో ఫార్చూన్ గ్లోబ‌ల్ 500 జాబితాలో 87వ స్థానంలో ఈ సంస్థ ఉంది. దీని ప్ర‌ధాన ఉత్ప‌త్తులు క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, సెమీ కండ‌క్ట‌ర్లు, వీడియో గేమ్స్‌, మీడియా,వినోదం; క‌ంప్యూట‌ర్ హార్డ్‌వేర్‌, టెలికాం ప‌రికరాలు. సోనీ ఇంకా ఆర్థిక సేవ‌లైన ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, క్రెడిట్ ఫైనాన్స్‌, అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీల్లో త‌న విస్త‌ర‌ణ‌ను క‌లిగి ఉంది. 2013లో ఈ సంస్థ ఉద్యోగులు 1,46,300 మంది. 53 దేశాలు, ప్రాంతాల్లో క‌వ‌ర‌య్యేలా సోనీ వారెంటీ స‌ర్వీస్ ప‌నిచేస్తుంది. ప్రాడ‌క్ట్ మెనూ, ఇన్‌స్ట్ర‌క్ష‌న్ మాన్యువ‌ల్స్‌ను వివిధ భాష‌ల్లో అంద‌జేస్తుంది. ఈ సంస్థ‌కు మార్కెట్ వాటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 6.9%గా ఉంది.

2. ఎల్‌జీ

2. ఎల్‌జీ

ద‌క్షిణా కొరియాలోని ట్విన్ ఎల్‌జీటవ‌ర్స్‌లోని యుఇడోడాంగ్‌లో ఎల్‌జీ ప్ర‌ధాన‌కార్యాల‌యం ఉంది. ద‌క్షిణాకొరియాలోనే అతిపెద్ద కంపెనీల్లో ఇది ఒక‌టి. టెలికాం, ర‌సాయన,ఎల‌క్ట్రానిక్స్‌ ఉత్ప‌త్తులు ప్ర‌ధానంగా త‌యారుచేస్తుంది. జెనిత్‌, ఎల్‌జీ ఎల‌క్ట్రానిక్స్‌, ఎల్‌జీ డిస్‌ప్లే, ఎల్‌జీ కెమ్‌, ఎల్‌జీ యూప్ల‌స్ అనుంబంధ సంస్థ‌ల ద్వారా ఎల్‌జీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించింది. అంత‌ర్జాతీయంగా దాదాపు 80కి పైగా దేశాల్లో ఉంది. మ‌న దేశంలో క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ విభాగంలో ఇటీవ‌లే 20 ఏళ్ల‌ను పూర్తిచేసుకుంది. ఎల్‌జీ ఉత్ప‌త్తుల్లో ఎక్కువ మందికి సుప‌రిచిత‌మైన‌వి ఎల్ఈడీ, హెచ్‌డీ టీవీలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, మైక్రోవేవ్ ఒవెన్లు, రిఫ్రిజిరేట్ల‌ర్లు, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్ట‌ర్లు, వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే టీవీలు, ఏసీలు మొద‌లైన‌వి. ఎల్‌జీ మార్కెట్ వాటా 12.6%గా ఉంది.

1. శ్యామ్‌సంగ్

1. శ్యామ్‌సంగ్

టీవీ, వాషింగ్ మెషీన్‌, మొబైల్ ఫోన్లు ఏది చెప్పినా గుర్తొచ్చే కంపెనీల్లో శ్యామ్‌సంగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఈ సంస్థ ద‌క్షిణ కొరియాకు చెందిన‌దైన‌ద‌ప్ప‌టికీ మ‌న దేశంలో ఇంటింటికీ విస్త‌రించింది. శ్యామ్‌సంగ్‌కు సృజ‌న ఒక ముఖ్య‌మైన అంశం. అందుకే ఆర్ అండ్ డీ(ప‌రిశోధ‌న‌, అభివృద్ది) కోసం ఈ సంస్థ నిధుల‌ను భారీగానే కేటాయిస్తుంది. దాదాపు 42 వేల మందికి పైగా ఉద్యోగులు నిరంతంర ఆర్ అండ్ డీకి సంబంధించిన వ్య‌వ‌హారాల్లోనే నిమ‌గ్న‌మై ఉంటారు. ప‌రిశోధ‌న‌, అభివృద్ది నెట్‌వ‌ర్క్‌కు సంబంధించి కొరియాలో 6 శ్యామ్‌సంగ్ కేంద్రాలు, ఇత‌ర దేశాల్లో 18 కేంద్రాలు ప‌నిచేస్తున్నాయి. అవ‌న్నీ అమెరికా, యూకే, ర‌ష్యా, ఇజ్రాయెల్‌, ఇండియా,చైనా దేశాల్లో కేంద్రీకృత‌మై ఉన్నాయి. ఇవే కాకుండా ఇత‌ర ప‌రిశోధ‌న కేంద్రాలు, విశ్వ‌విద్యాల‌యాల్లో ప్ర‌త్యేక ఇన్నోవేష‌న్ హ‌బ్‌లు సైతం ప‌నిచేస్తున్నాయి. భార‌త‌దేశంలో 1995 నుంచి ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌ను ప్రారంభించిన శ్యామ్‌సంగ్ ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉంది. మొద‌ట్లో క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌తో ప్రారంభించి ప్ర‌స్తుతం ఐటీ, టెలికాం ఉత్ప‌త్తుల‌కు సైతం విస్త‌రించింది. శ్యామ్‌సంగ్ 2016లో వెలువ‌రించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం 44 కొత్త మోడ‌ళ్ల‌తో మార్కెట్లోకి రావడానికి ప్ర‌య‌త్నిస్తోంది. అందులో మ‌న దేశంలో 11 కొత్త వాటిని ప్ర‌వేశ‌పెడుతున్న‌ది.

శ్యామ్‌సంగ్ మార్కెట్ వాటా 21 శాతం.

Read more about: tv sony samsung electronics
English summary

ప్ర‌పంచంలో టాప్ 10 టీవీ బ్రాండ్లు | Top 10 television brands in the world in 2016

TV companies have been constantly innovating features in their brands. TV’s have come a long way since being simply black and white screen boxes to hi-fi wifi enabled internet connected plasma and LED TV sets. The top TV companies include brands like Samsung, LG, Sony, Hisense & TCL along with companies like Skyworth, Panasonic/Sanyo, Toshiba, Sharp and Vizio. Here is the list of the top 10 TV (Television) brands on the world 2016.
Story first published: Tuesday, April 18, 2017, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X