For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల‌తో ప్రారంభ‌మై న‌ష్టాల్లోకి....

అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డుతున్ననేపథ్యంలో లాభాలతో ఉత్సాహంగా మొదలైన మార్కెట్లు చివర్లో అమ్మ‌కాలు జ‌ర‌గ‌డంతో న‌ష్టాల‌తోముగిశాయి.ఉద‌యం ట్రేడింగ్ ప్రారంభ‌మైన‌ప్పుడు లాభాల్లోకి ఎగ‌సిన మార్

|

అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డుతున్ననేపథ్యంలో లాభాలతో ఉత్సాహంగా మొదలైన మార్కెట్లు చివర్లో అమ్మ‌కాలు జ‌ర‌గ‌డంతో న‌ష్టాల‌తోముగిశాయి.ఉద‌యం ట్రేడింగ్ ప్రారంభ‌మైన‌ప్పుడు లాభాల్లోకి ఎగ‌సిన మార్కెట్లు చివ‌ర‌కు నిరాశ‌కు గురిచేశాయి. మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్‌ 94 పాయింట్లు క్షీణించి 29,319 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 34 పాయింట్ల వెనకడుగుతో 9,105 వద్ద ముగిసింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,150 దిగువన స్థిరపడింది. అంతేకాకుండా 9,100 సమీపంలో నిలిచింది. సోమవారం అమెరికా మార్కెట్లు బలపడటంతో తొలుత ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. దీంతో సెన్సెక్స్‌ ఉదయం సెషన్‌లో 29,701 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరి సెషన్‌లో అమ్మకాలు ఊపందుకోవడంతో ఆ స్థాయి నుంచి దాదాపు 400 పాయింట్లు దిగ‌జారింది. నిఫ్టీ సైతం 9,128 వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ ఆ స్థాయి నుంచి 9,095 వరకూ జారింది.

 లాభాల‌తో ప్రారంభ‌మై న‌ష్టాల్లోకి....

ఇంధ‌న‌(విద్యుత్) రంగం త‌ప్ప దాదాపు అన్ని రంగాలు న‌ష్టాల్లోకి వెళ్లాయి. బీఎస్ఈలో స్థిరాస్తి(3.48%), లోహ‌(1.81%), హెల్త్‌కేర్‌(0.94%), వాహ‌న‌(0.75%) క్షీణించగా; ఇంధ‌న రంగం 0.05% పైకి ఎగ‌సింది. సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో ఎన్టీపీసీ(+1.6%), విప్రో (+0.93%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(+0.68%), ఐసీఐసీఐ(+0.46%), ప‌వ‌ర్‌గ్రిడ్‌(+0.32%) ఉండ‌గా; న‌ష్టాల‌కు గురైన వాటిలో టాటా స్టీల్‌ (-2.55%), కోల్ ఇండియా(-2.34%), స‌న్ ఫార్మా( (-1.76%), ఏసియ‌న్ పెయింట్స్‌(-1.68%), రిల‌య‌న్స్‌(-1.48%) ఉన్నాయి.

English summary

లాభాల‌తో ప్రారంభ‌మై న‌ష్టాల్లోకి.... | sensex ends 94 points down on weak global cues

The Sensex and Nifty erased their gains to end lower on Tuesday, tracking weak global markets, as investors pruned exposure to risky assets amid lingering geopolitical tensions over North Korea.The benchmark BSE index ended 94.56 points or 0.32 per cent lower at 29,319.10, after rising as much as 0.98 percent earlier in the session.The broader NSE index closed down 34.15 points or 0.37 per cent at 9,105.15, after gaining up to 0.86 per cent earlier in the day
Story first published: Tuesday, April 18, 2017, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X