For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు

పెట్టుబ‌డిదారులు సానుకూల కార్పొరేట్ ఫ‌లితాలు ఆశిస్తే, గ‌త వారం ఇన్ఫోసిస్ నిరాశ‌ప‌రిచే రెవెన్యూ అంచనాల‌తో మొద‌లుపెట్ట‌డంతో ఇన్వెస్ట‌ర్లు నిరాశ‌చెందారు. దీంతో దేశీయ మార్కెట్లు ఒడిదొడుకుల‌కు గుర‌వుతున్నా

|

పెట్టుబ‌డిదారులు సానుకూల కార్పొరేట్ ఫ‌లితాలు ఆశిస్తే, గ‌త వారం ఇన్ఫోసిస్ నిరాశ‌ప‌రిచే రెవెన్యూ అంచనాల‌తో మొద‌లుపెట్ట‌డంతో ఇన్వెస్ట‌ర్లు నిరాశ‌చెందారు. దీంతో దేశీయ మార్కెట్లు ఒడిదొడుకుల‌కు గుర‌వుతున్నాయి. దేశీయ మార్కెట్లు సోమ‌వారం న‌ష్టాల‌తో ముగిశాయి. అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు కూడా దేశీయ సూచీల‌పై ప్ర‌భావం చూపాయి. దీంతో సెన్సెక్స్ 47.79 పాయింట్లు న‌ష్ట‌పోయి 29,413.66 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 11.35 పాయింట్లు క్షీణించి 9139.45 పాయింట్ల వ‌ద్ద ముగిసింది.

న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు

రంగాల వారీగా చూస్తే బీఎస్ఈలో లోహ‌రంగం(1.09%), విద్యుత్‌(0.61%), టెక్నాల‌జీ(0.53%), పీఎస్‌యూ(0.51%) న‌ష్ట‌పోయాయి. మ‌రో వైపు స్థిరాస్త బాగా రాణించి 8.82శాతం లాభ‌ప‌డింది. ఇంకా చ‌మురు,స‌హ‌జ‌వాయు(0.81%), వినియోగ‌దారు వ‌స్తువులు(0.25%), మూల‌ధ‌న వ‌స్తువుల‌(0.09%) మేర లాభ‌ప‌డ్డాయి. కంపెనీల వారీగా చూస్తే గెయిల్(0.41%), రిల‌య‌న్స్‌(1.99%), ప‌వ‌ర్ గ్రిడ్‌(1.30%), డాక్ట‌ర్ రెడ్డీస్(0.7%), బ‌జాజ్ ఆటో(0.55%) లాభ‌ప‌డ‌గా; ఎన్టీపీసీ(3.16%), స‌న్‌ఫార్మా(2.51%), కోల్ ఇండియా(1.84%), ఏసియ‌న్ పెయింట్స్‌(1.81%), టాటా మోటార్స్‌(1.2%) బాగా న‌ష్ట‌పోయాయి.

English summary

న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు | markets ended with marginal losses

Among BSE sectoral indices, metal index was down 1.09 per cent, followed by power 0.61 per cent, TECk 0.53 per cent and PSU 0.51 per cent. On the other hand, realty index was the star-performer and was up 8.82 per cent, oil & gas 0.81 per cent, consumer durables 0.25 per cent and capital goods 0.09 per cent.
Story first published: Monday, April 17, 2017, 16:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X