For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల అంచ‌నాను అందుకున్న ఇన్ఫోసిస్

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసికంలో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా రాణించింది. షేర్‌హోల్డ‌ర్ల‌కు తీపిక‌బురు అందించింది. అయితే మార్కెట్ వర్గాలు పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోకుండానే ఇన్ఫోస

|

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసికంలో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా రాణించింది. షేర్‌హోల్డ‌ర్ల‌కు తీపిక‌బురు అందించింది. అయితే మార్కెట్ వర్గాలు పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోకుండానే ఇన్ఫోసిస్‌పై దృష్టిపెట్టారు. అయితే ఐటీ, టెక్నాల‌జీ కంపెనీ షేర్లు మాత్రం ఇన్ఫోసిస్ ప్ర‌భావంతో క‌ద‌లాడాయి. ఈ నేప‌థ్యంలో ఇన్ఫోసిస్ ఫ‌లితాల గురించి తెలుసుకుందాం.

ఫ‌లితాల్లో ముఖ్య‌మైన ఆర్థిక అంశాలు

ఫ‌లితాల్లో ముఖ్య‌మైన ఆర్థిక అంశాలు

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం ఇన్ఫీ 3603 ఏకీకృత నిక‌ర లాభాన్ని న‌మోదు చేసింది. విశ్లేష‌కులు అంచ‌నా వేసిన రూ.3550 కోట్ల కంటే ఇది కాస్త ఎక్కువ‌.

మార్చి 31,2017తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ రెవెన్యూ రూ.17,120 కోట్లుగా ఉంది. ఇది అంచ‌నాల కంటే కాస్త త‌క్కువ‌. కంపెనీ బోర్డు తుది డివెండుగా ఒక్కో షేరుకు రూ.14.75 ప్ర‌క‌టించింది. డాల‌రు రెవ‌న్యూ ప్ర‌కారం చూస్తే కంపెనీ 0.7% మెరుగుద‌ల‌ను క‌న‌బ‌రిచింది.

షేర్ హోల్డ‌ర్ల‌కు బొనాంజా

షేర్ హోల్డ‌ర్ల‌కు బొనాంజా

బెంగుళూరుకు చెందిన ఈ ఐటీ సంస్థ ఇటీవ‌ల ప్రొవిజ‌న్ బైబ్యాక్‌ల‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం సాధార‌ణంగా ఆర్థిక సంవ‌త్స‌రంలో లాభాల్లోంచి ప‌న్నును తీసివేసి వ‌చ్చిన దాంట్లో 50 శాతాన్ని డివిడెండ్ల చెల్లింపున‌కు ఉప‌యోగించేది. 2018 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 70% వ‌ర‌కూ చెల్లించాల‌ని నిర్ణ‌యించింది. ఇది బోర్డు నిర్ణ‌యించిన విధంగా ఉంటుంది. డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్ ద్వారా వాటాదారుల‌కు రూ.13 వేల కోట్ల‌ను చెల్లించాల‌ని ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణ‌యించింది.

భ‌విష్య‌త్తు ల‌క్ష్యం నిరాశ‌ప‌రిచింది

భ‌విష్య‌త్తు ల‌క్ష్యం నిరాశ‌ప‌రిచింది

స్థిర క‌రెన్సీ విలువ ఆధారంగా వ‌చ్చే సంవ‌త్స‌రానికి రెవెన్యూ వృద్దిని 6.5-8.5%గా అంచ‌నా వేసింది. ఇది ప‌రిశ్ర‌మ స‌గ‌టు, విశ్లేష‌కుల అంచ‌నా కంటే చాలా త‌క్కువ‌. కాగ్నిజెంట్ 2017-18 ఏడాదికి 8నుంచి 10 శాతం రెవెన్యూ వృద్దిని ల‌క్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ప‌నితీరు ప‌రంగా చాలా మంది పెట్టుబ‌డిదారులు ఈ విష‌యంలో నిరాశ‌చెందారు.

ఒత్తిడిలో కంపెనీ షేర్లు

ఒత్తిడిలో కంపెనీ షేర్లు

త్రైమాసికంలో 2.8% లాభాలు త‌గ్గ‌డం, భ‌విష్య‌త్తు రెవెన్యూ అంచ‌నాలు త‌క్కువ‌గా ఉండ‌టం ట్రేడ‌ర్ల‌ను నిరాశ‌ప‌రిచింది. 12.57 గం.ల స‌మ‌యానికి ఇన్ఫోసిస్ 3.39% న‌ష్ట‌పోయి రూ. 936 వద్ద ట్రేడ‌వుతోంది. అయితే గ‌త త్రైమాసిక ఫ‌లితాల స‌మయంలో సైతం ఇన్ఫోసిస్ షేరు ప‌డి త‌ర్వాత కోలుకుంది.

Read more about: infosys companies
English summary

లాభాల అంచ‌నాను అందుకున్న ఇన్ఫోసిస్ | Infosys Guidance a big disappointment for investors

The company guided for a revenue growth of 6.5-8.5 per cent in constant currency terms. This was largely below what analysts were expecting and below the industry average. In fact, companies like Cognizant, which are now growing faster has guided a higher 8-10 per cent growth in the current calendar year 2017.
Story first published: Thursday, April 13, 2017, 13:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X