For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంత‌ర్జాతీయ ప‌రిణామాల మ‌ధ్య న‌ష్టాల్లో మార్కెట్లు

అమెరికా-సిరియా-ర‌ష్యా మ‌ధ్య త్రైముఖ యుద్ద వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, అమెరికా-ఉత్త‌ర కొరియా మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా రాజకీయ వాతావార‌ణం వేడెక్కింది. దీంతో దేశీయ మార్క

|

అమెరికా-సిరియా-ర‌ష్యా మ‌ధ్య త్రైముఖ యుద్ద వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, అమెరికా-ఉత్త‌ర కొరియా మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా రాజకీయ వాతావార‌ణం వేడెక్కింది. దీంతో దేశీయ మార్కెట్లు డీలా ప‌డ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ప్ర‌తికూలంగానే సాగిన మార్కెట్లు చివ‌ర‌కు న‌ష్టాల‌తో ముగిశాయి. తొలుత 230 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరికి కాస్త కోలుకుని 145 పాయింట్ల క్షీణతతో 29,643 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,162 వద్ద కనిష్టాన్ని తాకిన నిఫ్టీ ట్రేడింగ్‌ ముగిసేసరికి సాంకేతికంగా కీలకమైన 9,200 ఎగువన నిలిచింది. నికరంగా 33 పాయింట్లు తగ్గి 9,203 వద్ద స్థిరపడింది.

 అంత‌ర్జాతీయ ప‌రిణామాల మ‌ధ్య న‌ష్టాల్లో మార్కెట్లు

సెన్సెక్స్‌లో న‌ష్ట‌పోయిన వాటిలో టాటా స్టీల్‌(2.12%), అదానీ పోర్ట్స్‌(2.06%), విప్రో(1.76%), గెయిల్‌(1.72%), టాటా మోటార్స్‌(1.60%) ఉండ‌గా; లాభ‌ప‌డిన వాటిలో స‌న్‌ఫార్మా(1.83%), హీరో మోటోకార్ప్‌(0.77%), లుపిన్‌(0.74%), బ‌జాజ్ ఆటో(0.55%), డాక్ట‌ర్ రెడ్డీస్‌(0.48%) ముందు ఉన్నాయి.

English summary

అంత‌ర్జాతీయ ప‌రిణామాల మ‌ధ్య న‌ష్టాల్లో మార్కెట్లు | markets ended with losses due to international factors

The benchmark BSE Sensex ended the session down by nearly 150 points as investors stayed on the sidelines ahead of Infosys results tomorrow, while geopolitical concerns continued to weigh on the domestic sentiment.Also, domestic investors turned wary ahead of release of industrial production (IIP) data for February and consumer price index (CPI) for March later today.
Story first published: Wednesday, April 12, 2017, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X