For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ష్ట‌పోయిన దేశీయ మార్కెట్లు

వరుస‌గా మూడో సెష‌న్(సోమ‌వారం)లోనూ దేశీయ మార్కెట్లు దిగాలు ప‌డ్డాయి. ఉత్తర కొరియా అణు పరీక్షలకు కట్టుబడటం, సిరియాపై అమెరికా క్షిపణి దాడి నేపథ్యంలో రష్యా అప్రమత్తంకావడం వంటి సంఘటనలతో ప్రపంచవ్యాప్తంగా క

|

వరుస‌గా మూడో సెష‌న్(సోమ‌వారం)లోనూ దేశీయ మార్కెట్లు దిగాలు ప‌డ్డాయి. ఉత్తర కొరియా అణు పరీక్షలకు కట్టుబడటం, సిరియాపై అమెరికా క్షిపణి దాడి నేపథ్యంలో రష్యా అప్రమత్తంకావడం వంటి సంఘటనలతో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు తెరలేచింది. దీంతో రోజు మొత్తం హెచ్చుతగ్గుల మధ్య కదిలిన ప్ర‌ధాన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 131 పాయింట్లు క్షీణించి 29,576కు చేరింది. నిఫ్టీ 17 పాయింట్లు తగ్గి 9,181 వద్ద స్థిరపడింది.
ద‌శ‌ల వారీగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం దుకాణాలు మూసివేస్తామ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో మ‌ద్యం కంపెనీల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈలో యునైటెడ్ స్పిరిట్స్ 6.59% ప‌డింది. దీంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

న‌ష్ట‌పోయిన దేశీయ మార్కెట్లు

బీఎస్ఈ సూచీ సెన్సెక్స్‌లో టాటా మోటార్స్(1.51%), యాక్సిస్ బ్యాంకు(1.38%), కోల్ ఇండియా(1.16%), అదానీ పోర్ట్స్(1.06%), టాటా స్టీల్‌(0.52%) లాభాల్లో ప‌య‌నించ‌గా; న‌ష్టాల్లో ఉన్న వాటిలో ఇన్ఫోసిస్‌(-2.88%), విప్రో(-2.1%), ఏసియ‌న్ పెయింట్స్‌(-1.91%), రిల‌య‌న్స్‌(-1.74%), హెచ్‌డీఎఫ్‌సీ(1.28%) ముందు ఉన్నాయి.

English summary

న‌ష్ట‌పోయిన దేశీయ మార్కెట్లు | Domestic shares ended lower on Monday as fears continued over geopolitical risks

Domestic shares ended lower on Monday, their third consecutive session of losses, as investors waited for cues from the March-quarter corporate results season before taking any large positions.Investors also remained cautious ahead of key economic numbers — industrial production (IIP) data for February and consumer inflation for March due to be released on Wednesday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X