For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా దాడి వార్త‌ల‌తో న‌ష్టాల్లో మార్కెట్లు

సెన్సెక్స్ వారం కనిష్ట స్థాయికి వెళ్లింది. సిరియాపై అమెరికా క్షిపణుల దాడికి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో యూరప్‌, ఆసియా మార్కెట్లు నష్టాలబాట పట్టగా.. ఆ ప్రభావం దేశీయ

|

అంత‌ర్జాతీయంగా అనిశ్చిత ప‌రిస్థితుల కార‌ణంతో చివ‌రి గంట‌లో అమ్మ‌కాలు ఊపందుకోవ‌డంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రోజు క‌నిష్టంలో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్ 221 పాయింట్లు కోల్పోయి 29,707 వ‌ద్ద నిల‌వ‌గా... నిఫ్టీ 63.65(0.69%)పాయింట్లు న‌ష్టోయి 9198.30 వ‌ద్ద ముగిసింది. సెన్సెక్స్ వారం కనిష్ట స్థాయికి వెళ్లింది. సిరియాపై అమెరికా క్షిపణుల దాడికి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో యూరప్‌, ఆసియా మార్కెట్లు నష్టాలబాట పట్టగా.. ఆ ప్రభావం దేశీయంగానూ పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

 అమెరికా దాడి వార్త‌ల‌తో న‌ష్టాల్లో మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్‌(1.43%), లోహ‌(1.24%), స్థిరాస్తి(1.19%), బ్యాంకింగ్‌( 0.96) న‌ష్ట‌పోగా; మ‌రో వైపు చ‌మురు, స‌హ‌జ వాయు రంగం(0.48%), మూల‌ధ‌న వ‌స్తు రంగం 0.10శాతం లాభ‌ప‌డ్డాయి.
సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో టీసీఎస్‌(+1.14%), బ‌జాజ్ ఆటో(+1.01%), భార‌తీ ఎయిర్‌టెల్‌(0.83%), హీరో మోటోకార్ప్(0.58%),ఎన్‌టీపీసీ( (+0.27%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో సన్ ఫార్మా (-3.04%), లుపిన్ (-2.61%), అదానీ పోర్ట్స్ (-2.37%), రిలయన్స్ (-2.28%) మరియు డాక్టర్ రెడ్డీస్ (-1.97%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

అమెరికా దాడి వార్త‌ల‌తో న‌ష్టాల్లో మార్కెట్లు | sensex plunges by 221 points due to uncertainity over syria issue

The benchmark BSE Sensex plunged about 221 points to close at a one-week low of 29,706.61 as global markets were spooked after US launched air strikes against Syria, fuelling geopolitical concerns.US President Donald Trump has ordered the strikes against a Syrian air base controlled by President Bashar al-Assad's forces in response to a deadly chemical attack in a rebel-held area, a US official said.
Story first published: Friday, April 7, 2017, 17:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X