For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ నిలిపివేయాల‌ని జియో నిర్ణ‌యం

ప్రైమ్ క‌స్ట‌మ‌ర్లు రూ. 303తో రీచార్జీ చేసుకుంటే మూడు నెల‌ల పాటు అప‌రిమిత డేటా, ఉచిత కాల్స్‌ను అందుకోవ‌చ్చేన‌ది స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌. దీనిని కొన‌సాగించ‌కూడ‌ద‌ని ట్రాయ్ ఆదేశించ‌డంతో ఆఫ‌ర్ నిలి

|

జియో స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌పై ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం
రిల‌య‌న్స్ జియో స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కొద్ది రోజుల్లో ఈ ఆఫ‌ర్‌ను నిలిపివేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దేశ టెలికాం రంగంలో టారిఫ్‌లు, ఉచిత ఆఫ‌ర్ల విష‌యంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన జియో ఆదిలోనే టెలికాం దిగ్గ‌జాల‌కు గుబులు పుట్టించింది. ఈ నేప‌థ్యంలో జియో స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌ను ఎందుకు వెన‌క్కు తీసుకుంటుందో తెలుసుకోవాల‌కుంటే ఇది చ‌ద‌వండి.

ఆఫ‌ర్ నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

ఆఫ‌ర్ నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

ప్రైమ్ క‌స్ట‌మ‌ర్లు రూ. 303తో రీచార్జీ చేసుకుంటే మూడు నెల‌ల పాటు అప‌రిమిత డేటా, ఉచిత కాల్స్‌ను అందుకోవ‌చ్చేన‌ది స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌. దీనిని కొన‌సాగించ‌కూడ‌ద‌ని ట్రాయ్ ఆదేశించ‌డంతో ఆఫ‌ర్ నిలిపివేస్తున్న‌ట్లు జియో ప్ర‌క‌టించింది.

7.3 కోట్ల పైనే జియో ప్రైమ్ క‌స్ట‌మ‌ర్లు

7.3 కోట్ల పైనే జియో ప్రైమ్ క‌స్ట‌మ‌ర్లు

మొద‌ట్లో మార్చి 31 నాటికి రూ.99తో రీచార్జీ చేసుకుంటే ప్రైమ్ స‌భ్య‌త్వం ఇస్తున్న‌ట్లు రిల‌య‌న్స్ జియో వెల్ల‌డించింది. త‌ర్వాత దీన్ని 15 రోజుల పాటు ఏప్రిల్ 15 వ‌ర‌కూ పొడిగించింది. ఈ నేప‌థ్యంలో రిల‌య‌న్స్ జియో ప్రైమ్ స‌భ్య‌త్వం తీసుకున్న వారి సంఖ్య ఇప్ప‌టికే 7.3 కోట్ల‌ను చేరింది. ఇంకా చాలా మంది చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

 ట్రాయ్ ఆదేశం-జియో స్పంద‌న‌

ట్రాయ్ ఆదేశం-జియో స్పంద‌న‌

అద‌నంగా మూడు నెల‌ల పాటు ఇచ్చే కాంప్లిమెంట‌రీ ఆఫ‌ర్ల‌ను నిలిపివేయాల‌ని ట్రాయ్ గురువారం ఆదేశించింది. నియంత్ర‌ణ సంస్థ ఆదేశాల మేర‌కు మేము కాంప్లిమెంట‌రీ ప్ర‌యోజ‌నాల‌ను నిలిపివేస్తున్నాం. అయితే వ‌చ్చే కొన్ని రోజుల్లో దీన్ని అమ‌లు చేసేందుకు సాంకేతిక మార్పులు చేప‌డ‌తాం. అది పూర్త‌య్యేదాకా క‌స్ట‌మ‌ర్లు ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు.

జ‌యో స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌

జ‌యో స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌

ఈ నెల 15 లోపు 99 రూపాయలు చెల్లించి.. అదనంగా రూ.303తో గానీ, రూ.499 గానీ రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు మూడు నెలల పాటు సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ కింద ఫ్రీ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, 4జీ మొబైల్‌ డేటా అందిస్తామని మార్చి 31న‌ జియో ప్రకటించింది. పై రీచార్జీలు చేయించుకున్న‌వారికి ఆ ప‌థ‌కం కింద ఉండే బేసిక్ అంశాల‌తో పాటు డేటా, ఫ్రీకాల్స్ అద‌నం.

ఆఫ‌ర్ ఎవ‌రికి వ‌స్తుంది?

ఆఫ‌ర్ ఎవ‌రికి వ‌స్తుంది?

ఆఫ‌ర్‌ను వెన‌క్కు తీసుకోక‌ముందే ఎన్‌రోల్ అయిన వారికి జియో ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని రిల‌య‌న్స్ జియో యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. అంటే మీరు రూ.303 లేదా అంత‌కంటే ఎక్కువ పెట్టి జియో సిమ్‌లో రీచార్జీ ఇదివ‌ర‌కే చేయించుకుని ఉంటే మీకు ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లే. ఇందులో రోజూ 1జీబీ డేటా, ఇంకా ఫ్రీ కాల్స్‌, ఎస్ఎంఎస్ జులై 1 వ‌ర‌కూ అందుతాయి. రూ.499తో రీచార్జీ చేయించుకుని ఉంటే రోజూ 2జీబీ ఉచిత డేటాను పొంద‌డంతో పాటు అప‌రిమిత ఉచిత కాల్స్ చేసుకోవ‌చ్చు.

ఇక‌పై సమ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్ ఉండ‌దా?

ఇక‌పై సమ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్ ఉండ‌దా?

జియో సిమ్ కొన్న వారెవ‌రైనా రూ.99 పెట్టి ఏప్రిల్ 15 లోపు రీచార్జీ చేయించ‌డం ద్వారా ప్రైమ్ క‌స్ట‌మ‌ర్ అవుతారు. ఈ విధంగా రీచార్జీ చేసుకున్న వారంతా మార్చి 31,2018 వ‌ర‌కూ ప్ర‌త్యేక ఆఫ‌ర్లు పొందేందుకు అర్హులు.

ఫిర్యాదులు-ఆఘ‌మేఘాల మీద ఆదేశం

ఫిర్యాదులు-ఆఘ‌మేఘాల మీద ఆదేశం

జియో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సెల్యూలార్ ఆప‌రేట‌ర్ అసోషియేష‌న్ ఆఫ్ ఇండియా ఉచిత ఆఫ‌ర్ల‌పై గుర్రుగా ఉంది. ప‌లుమార్లు త‌మ అసంతృప్తిని వెలగ‌క్క‌డంతో పాటు ట్రాయ్‌కు, టెలికాం మంత్రిత్వ శాఖ‌కు ఫిర్యాదులు చేశారు. తాజా ఆఫ‌ర్ నేప‌థ్యంలో టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా గురువారం జియో అధికారుల‌తో స‌మావేశ‌మైంది. చ‌ర్చోప‌ర్చ‌ల త‌ర్వాత జియో స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ కింద ఇచ్చే ఉచిత ప్ర‌యోజ‌నాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని సూచించింది.

మిగిలిన టెలికాం సంస్థ‌ల‌కు ఊర‌ట‌

మిగిలిన టెలికాం సంస్థ‌ల‌కు ఊర‌ట‌

ట్రాయ్ తీసుకున్న అనూహ్య నిర్ణ‌యంతో భార‌తీ ఎయిర్‌టెల్, వోడాఫోన్‌, ఐడియా వంటి రిల‌య‌న్స్ జియో ప్ర‌ధాన పోటీదారులు పెద్ద ఉప‌శ‌మ‌నం పొందాయి. లేక‌పోతే ఇప్ప‌టికే క‌స్ట‌మ‌ర్ల‌ను పోగొట్టుకున్న ఆయా సంస్థ‌లు డేటా ఆదాయంతో పాటు కాల్స్ ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని సైతం గ‌ణ‌నీయంగా కోల్పోవాల్సి వ‌చ్చేది.

ట్రాయ్ (టెలికాం రెగ్యులేట‌రీ అధారిటీ ఆప్ ఇండియా)

ట్రాయ్ (టెలికాం రెగ్యులేట‌రీ అధారిటీ ఆప్ ఇండియా)

టెలికాం రెగ్యులేట‌రీ అధారిటీ ఆప్ ఇండియా యాక్ట్‌,1997 ద్వారా పార్ల‌మెంటు చేత ఏర్ప‌డిన నియంత్ర‌ణ సంస్థ ట్రాయ్‌. ప్ర‌పంచ స‌మాచార స్ర‌వంతిలో చెప్పుకోద‌గ్గ విధంగా భార‌త్ ఎదిగేందుకు టెలిక‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్య‌తను ఈ సంస్థ నిర్వ‌ర్తిస్తుంది. టెలికాం టారిఫ్‌లు, ఇంట‌ర్ క‌నెక్ష‌న్ పాయింట్ల నిర్వ‌హ‌ణ ఎప్ప‌టికప్పుడు స‌రిగా ఉండేలా చూస్తుంది. వివిధ టెలికాం సంస్థ‌ల మ‌ధ్య త‌లెత్తే స‌మ‌స్యల‌ను తీర్చేందుకు 2000 సంవ‌త్స‌రంలో టీడీశాట్‌ను ఏర్పాటు చేశారు.

Read more about: jio reliance jio trai telecom
English summary

స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ నిలిపివేయాల‌ని జియో నిర్ణ‌యం | All You Need To Know about Jio Summer Surprise Offer

Jio announced that all customers who have subscribed to Jio Summer Surprise offer before its discontinuation will remain eligible for the offer. This means that if you recharged for up to Rs 303 or above before now, you would get 1GB of data daily till July 1 and other benefits under that plan. If you recharged for Rs 499, you would get 2GB of data daily. Calls will remain free.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X