For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ ఆఫ‌ర్లిస్తున్న ద్విచ‌క్ర‌వాహ‌న సంస్థ‌లు

బీఎస్‌-3 వాహ‌నాల‌ను సుప్రీంకోర్టు నిషేధించిన నేప‌థ్యంలో ద్విచ‌క్ర వాహ‌న సంస్థ‌లు భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. సుప్రీంకోర్టు బీఎస్‌-4 ప్ర‌మాణాల‌ను పాటించని వాహ‌నాల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసింద

|

బీఎస్‌-3 వాహ‌నాల‌ను సుప్రీంకోర్టు నిషేధించిన నేప‌థ్యంలో ద్విచ‌క్ర వాహ‌న సంస్థ‌లు భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. సుప్రీంకోర్టు బీఎస్‌-4 ప్ర‌మాణాల‌ను పాటించని వాహ‌నాల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఉన్న స్టాక్‌ను విక్ర‌యించేందుకు భారీ రాయితీల‌తో హీరో,హోండా ఇండియా ముందుకు వ‌స్తున్నాయి.

 ద్విచ‌క్ర‌వాహ‌న సంస్థ‌ల రాయితీలు

హీరో మోటార్‌ కార్ప్‌ స్కూటర్లపై రూ.12500, ప్రీమియం బైక్స్‌పై రూ.7500, ఎంట్రీ లెవర్‌ మెటార్‌ సైకిళ్లపై రూ.5వేల దాకా తగ్గింపును ప్రకటించింది. దీంతో పాటు బీఎస్‌-3 వాహ‌నాల‌పై ఉచిత బీమాను సైతం ఆఫ‌ర్ చేస్తున్నారు. హోండా ఇండియా బుధ‌వారం త‌న ఫేస్‌బుక్ పేజీలో ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం త‌మ కంపెనీ రూ. 22 వేల క్యాష్ బాక్ ఆఫ‌ర్ల‌ను ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే హోండా మోటార్‌ సైకిల్‌ అండ్ స్కూటర్‌ ఇండియా అయితే బీఎస్‌-3 స్కూటర్లపై కొనుగోలుపై రూ. 10వేల డిస్కౌంట్‌ అంద్తిస్తోంది. సీబీ హార్నెట్ 160R ను ఏకంగా రూ. 18,500 త‌క్కువ‌కు అమ్ముతున్న‌ట్లు కంపెనీ ఫేస్‌బుక్ పేజీలో ఉంది.స్టాక్‌ అయిపోయే దాకా లేదా మార్చి 31 దాకా ఆ ఫర్‌ వర్తించనున్నట్టు ఇరు కంపెనీలు ప్రకటించాయి.

ద్విచ‌క్ర‌వాహ‌న బీమా తీసుకునే వారు ఇవి తెలుసుకోవాల్సిందే
తమ అన్ని ఉత్ప‌త్తుల‌పై రూ. 3000 రాయితీ ఇస్తున్న‌ట్లు టీవీఎస్ మోటార్ డీల‌ర్ వెల్ల‌డించారు. అన్ని మోడ‌ళ్ల‌పై రూ. 10 వేల వ‌ర‌కూ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు మ‌రో ద్విచ‌క్ర‌వాహ‌న సంస్థ య‌మ‌హా డీల‌ర్ చెప్పారు.

Read more about: vehicle hero two wheeler honda
English summary

భారీ ఆఫ‌ర్లిస్తున్న ద్విచ‌క్ర‌వాహ‌న సంస్థ‌లు | Hero and Honda india offet upto 12500 on bs3 vehicles

A TVS Motor dealer said that the company is offering Rs 3,000 discount for all the products. A Yamaha two-wheeler dealer said that it is offering around Rs 10,000 for some of its models. Some of the dealers assured that the registration would be done on Friday and finance could be arranged soon, so that the deal will be closed on the same day.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X