For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌దుప‌రి మోము మెరిసింది: నిఫ్టీ 9100 పైకి

దేశీయ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ముగిశాయి. మునుప‌టి న‌ష్టాల‌ను మ‌రిపించేలా దేశీయ షేర్లు రాణించాయి. దేశీయ సెంటిమెంటు బ‌ల‌ప‌డ‌టంతో పాటు విదేశీ నిధుల రాక‌తో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. దీంతో సెన

|

దేశీయ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ముగిశాయి. మునుప‌టి న‌ష్టాల‌ను మ‌రిపించేలా దేశీయ షేర్లు రాణించాయి. దేశీయ సెంటిమెంటు బ‌ల‌ప‌డ‌టంతో పాటు విదేశీ నిధుల రాక‌తో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్ 172.37 పాయింట్లు(0.59%) లాభ‌ప‌డి 29,409.52 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 55.6 పాయింట్లు(0.61%) పైకి ఎగ‌బాకి 9100.80 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
చ‌మురు,స‌హ‌జ‌వాయు; స‌్థిరాస్తి రంగాలు త‌ప్ప బీఎస్ఈ సూచీలో అన్ని రంగాలు సానుకూలంగా క‌ద‌లాడాయి. బ్యాంకింగ్ అత్య‌ధికంగా 0.78% లాభ‌ప‌డ‌గా, వాహ‌న రంగం(0.77%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.76%), విద్యుత్‌-ప‌వ‌ర్‌(0.75%) త‌ర్వాతి స్థానాల‌లో ఉన్నాయి. న‌ష్ట‌పోయిన వాటిలో స్థిరాస్తి రంగం(0.35%), చ‌మురు, స‌హ‌జ‌వాయు రంగం(0.25%) ఉన్నాయి.

 మ‌దుప‌రి మోము మెరిసింది: నిఫ్టీ 9100 పైకి

బీఎస్ఈలో లాభ‌ప‌డిన‌, న‌ష్ట‌పోయిన సంస్థ‌లు ఈ విధంగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్‌(3.23%), హెచ్‌డీఎఫ్‌సీ(1.97%), టాటా మోటార్స్‌(1.48%), ఏసియ‌న్ పెయింట్స్‌(1.32%), ఐసీఐసీఐ బ్యాంకు(1.26%) దూసుకెళ్ల‌గా; ఓఎన్‌జీసీ(1.08%), ఐటీసీ(0.5%), లుపిన్(0.45%), రిల‌య‌న్స్‌(0.41%), కోల్ ఇండియా(0.33%)నీర‌సించాయి.

English summary

మ‌దుప‌రి మోము మెరిసింది: నిఫ్టీ 9100 పైకి | Sensex up 172 points on tuesday as asian markets trading positive

Domestics shares ended higher on Tuesday as losses in the previous session were seen as overdone, with the sentiment also improving as Asian markets recovered after some of the anxiety about US President Donald Trump's ability to push his agenda subsided.Sustained foreign fund inflows also boosted the domestic sentiment.The 30-share BSE index Sensex ended higher by 172.37 points or 0.59 per cent at 29,409.52 and the 50-share NSE index Nifty was up 55.6 points or 0.61 per cent at 9,100.80.
Story first published: Tuesday, March 28, 2017, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X