For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

89 పాయింట్లు ఎగ‌సిన సెన్సెక్స్‌

చివర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కొంతమేర త‌గ్గాయి. మొత్తానికి ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 89 పాయింట్ల లాభంతో 29,421 వద్ద నిలవగా.. నిఫ్టీ 22 పాయింట్లు బ‌ల‌ప‌డి 9,108

|

రిజర్వ్‌ బ్యాంక్‌తో కలసి మొండిబకాయిల(ఎన్‌పీఏలు) సమస్య పరిష్కారానికి పటిష్ట విధానాలు రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన బ్యాంకింగ్ షేర్ల‌కు ఊపొచ్చింది. ఎఫ్‌పీఐల నిరవధిక కొనుగోళ్లతో బలపడ్డ సెంటిమెంటుకు ఇది కూడా క‌లిసిరావ‌డంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలి నుంచీ జోరందుకున్నాయి. మిడ్ సెషన్‌లొ సెన్సెక్స్‌ 200 పాయింట్ల వరకూ ఎగసి గరిష్టంగా 29,540కు చేరింది. నిఫ్టీ సైతం 50 పాయింట్ల వరకూ ఎగసి 9,133ను తాకింది. చివర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కొంతమేర త‌గ్గాయి. మొత్తానికి ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 89 పాయింట్ల లాభంతో 29,421 వద్ద నిలవగా.. నిఫ్టీ 22 పాయింట్లు బ‌ల‌ప‌డి 9,108 వద్ద స్థిరపడింది.

89 పాయింట్లు ఎగ‌సిన సెన్సెక్స్‌

ప్రభుత్వరంగ‌ బ్యాంకుల దూకుడు

త్వరలో ఎన్‌పీఏల పరిష్కారానికి పాలసీ ప్రకటన చేయనున్నట్లు జైట్లీ తెలియజేయడంతో ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లు హైజంప్‌చేశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూప‌డంతో ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 3.3 శాతం ఎగసింది. ఈ బాటలో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లూ జోరందుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగాలు 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఐటీ 0.75 శాతం నష్టపోవడం ద్వారా మార్కెట్‌ లాభాలను పరిమితం చేసింది.

English summary

89 పాయింట్లు ఎగ‌సిన సెన్సెక్స్‌ | Sensex ends 89 points higher public sector banks given boost

Domestic shares rose for a second consecutive session on Friday as lenders rallied after Finance Minister Arun Jaitley said the government would soon announce new measures to tackle bad debt, but the indexes posted their first weekly loss in three.The broader NSE index ended 21.7 points or 0.2 per cent higher at 9,108.00, but dropped 0.6 percent for the week.The benchmark BSE index closed 89.24 points or 0.3 per cent higher at 29,421.40, but slid 0.8 per cent for the week.
Story first published: Friday, March 24, 2017, 17:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X