For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క‌రెంటు ఖాతా లోటు మూడో త్రైమాసికంలో 7.9 బిలియ‌న్ డాల‌ర్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ) దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.4 శాతం లేదా 7.9 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంత‌కు ముందు ఏడాది అక్టోబ‌ర్‌-డిసెంబ‌రు త్రైమ

|

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ) దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.4 శాతం లేదా 7.9 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంత‌కు ముందు ఏడాది అక్టోబ‌ర్‌-డిసెంబ‌రు త్రైమాసికంలో ఇది 7.1 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా ఇప్పుడు ఇది కాస్త పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇది 0.6 శాతం లేదా 3.4 బిలియన్‌ డాలర్లు నమోదైంది. జీడీపీలో శాతాల ప‌రంగా చూస్తే గ‌త‌ ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 1.4 శాతంగా ఉంది.

Current account deficit rises in third quarter

ఈ ఏడాది సేవల ఎగుమతులు తగ్గడం క‌రెంటు ఖాతా లోటు పెరుగుద‌ల‌కు కారణమని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గురువారమిక్కడ పేర్కొంది. ఏప్రిల్‌-డిసెంబరు కాలానికి మాత్రం సీఏడీ సగానికి తగ్గి 0.7 శాతానికి పరిమితమైంది. 2015- 16 ఇదే కాలంలో 1.4 శాతంగా ఉంది. సాఫ్ట్‌వేర్‌, ఆర్థిక సేవల కంపెనీల ఆదాయాలు, మేధో సంపత్తి హక్కులపై ఛార్జీలు తగ్గడం ఇందుకు కారణమని ఆర్‌బీఐ వివరించింది. 'వాణిజ్య లోటు తక్కువగానే ఉన్నప్పటికీ.. కనిపించని ఆస్తులు భారీగా తగ్గడం ప్రధాన కారణమ'ని తెలిపింది. డిసెంబరు త్రైమాసికంలో నికర సేవలు 18 బిలియన్‌ డాలర్ల నుంచి 17.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

Read more about: cad current account deficit gdp
English summary

క‌రెంటు ఖాతా లోటు మూడో త్రైమాసికంలో 7.9 బిలియ‌న్ డాల‌ర్లు | Current account deficit (CAD) rises in third quarter

Current account deficit (CAD) rose to $7.9 billion in the third quarter (October-December) of 2016-17 from $7.1 billion in the same quarter of 2015-16, the Reserve Bank of India (RBI) said on Thursday.
Story first published: Friday, March 24, 2017, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X