For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రేల్వే రాయితీల‌కు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఆధార్ నంబరు తప్పనిసరి కాదు

రైల్వే టికెట్లపై రాయితీలు పొందడానికి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఆధార్ నంబరు తప్పనిసరి కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లోక్‌సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. అయితే వృద్ధుల వివరాలతో కే

|

రైల్వే టికెట్లపై రాయితీలు పొందడానికి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఆధార్ నంబరు తప్పనిసరి కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లోక్‌సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. అయితే వృద్ధుల వివరాలతో కేంద్రం ఒక డేటాబేస్‌ను రూపొందిస్తోందని ఆయన వెల్ల‌డించారు.

రేల్వే రాయితీల‌కు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఆధార్ తప్పనిసరి కాదు

వయో వృద్ధులు రైల్వే టికెట్లపై రాయితీ పొందడానికి ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరి 1నుంచి సీనియర్ సిటిజన్ల ఆధార్ వివరాలను ముందస్తుగా వెరిఫై చేయడం ద్వారా వారికి సంబంధించిన ఒక స‌మాచార నిధి(డేటా బేస్‌)ని రూపొందిస్తున్నామని సురేశ్ ప్రభు చెప్పారు. అందువల్ల రైల్వే టికెట్లపై వయో వృద్ధులు రాయితీ పొందడానికి ఆధార్ నంబరు తప్పనిసరి కాదని ఆయన చెప్పారు. వయోవృద్ధుల రాయితీలు దుర్వినియోగం కాకుండా చూడడం కోసం, అలాగే నిర్ణయాలు తీసుకోవడం కోసం స‌మాచార నిధిని ఉపయోగించుకుంటామని సురేశ్ ప్రభు చెప్పారు. కాగా, నగదు రహిత వ్యవస్థను ప్రోత్సహించడం కోసం రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకొందని మంత్రి చెప్పారు. మా అంతిమ లక్ష్యం నగదు రహిత టికెట్ బుకింగ్ కాగా తక్షణ ప్రాధాన్యత న‌గ‌దు లావాదేవీల‌ను త‌క్కువ చేయ‌డ‌మే అని ఆయన తెలిపారు.

Read more about: aadhar railways
English summary

రేల్వే రాయితీల‌కు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఆధార్ నంబరు తప్పనిసరి కాదు | Aadhaar not mandatory for train tickets of senior citizens as Rly ministry said

Aadhaar has not been made mandatory for senior citizens to avail concessions in train tickets but the Railways have initiated a process to create a database of senior citizens, Lok Sabha was informed today.Railway Minister Suresh Prabhu made it clear that Aadhaar number has not been made mandatory for senior citizens to avail concessions in train tickets.
Story first published: Thursday, March 23, 2017, 15:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X