For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిట‌ర్నుల‌కు ఆధార్‌, న‌గ‌దు లావాదేవీలు రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కే

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు, పాన్ ద‌ర‌ఖాస్తు చేయాల‌న్నా ఆధార్ త‌ప్ప‌నిస‌రి అయ్యే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. ఎందుకంటే ప‌లు చోట్ల వీటిని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోబోతున్న‌ది. అం

|

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు, పాన్ ద‌ర‌ఖాస్తు చేయాల‌న్నా ఆధార్ త‌ప్ప‌నిస‌రి అయ్యే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. ఎందుకంటే ప‌లు చోట్ల వీటిని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోబోతున్న‌ది. అంతే కాదు నగదు చెల్లింపులు కేవలం రెండు లక్షల రూపాయలకే పరిమితం కానున్నాయి. అంతకుమించి చెల్లించాలంటే ఆన్‌లైన్‌ లావాదేవీలు తప్పవు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. జూలై ఒకటో తేదీకి పాన్‌ కార్డు ఉన్నవాళ్లు.. తమ ఆధార్‌ నంబరును ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాల్సిందే! రాజకీయ పార్టీల ట్రస్టులకు విరాళాలు కేవలం చెక్కులు ఇవ్వాల్సిందే! మిగిలిన రూపాల్లో చెల్లింపులు నిషేధం!

ఐటీ రిట‌ర్నుల‌కు ఆధార్‌

నల్ల ధనంపై పోరాటంలో భాగంగా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధ‌న‌లను సిద్ధం చేసింది. ఆర్థిక బిల్లు-2017 లో భాగంగా లోక్‌స‌భ‌లో అరుణ్ జైట్లీ స‌వ‌ర‌ణ‌ల‌ను ప్ర‌తిపాదించ‌నున్నారు. ఒక‌సారి కొత్త ప్ర‌తిపాద‌న‌లు చ‌ట్ట‌రూపం దాల్చితే ప‌న్ను చెల్లింపుదారులంతా ఐటీ రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు బ‌యోమెట్రిక్ స‌హిత ఆధార్‌ను ఐటీ శాఖ‌కు ఇవ్వాల్సిందే. అంటే 12 అంకెల ఆధార్ సంఖ్య‌తో పాటు దాన్ని స‌పోర్ట్ చేసే విధంగా వేలిముద్ర‌లు, ఐరిస్ స్కాన్ ద్వారా కంటి పాప బొమ్మ వంటి వాటిని తీసుకుంటారు.

Read more about: it aadhar income tax
English summary

ఐటీ రిట‌ర్నుల‌కు ఆధార్‌, న‌గ‌దు లావాదేవీలు రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కే | Aadhaar To Be Mandatory For Filing Income Tax Return and PAN Application

The government has proposed to make Aadhaar Card mandatory for filing ITRs or income tax returns and also applying for a Permanent Account Number (PAN).The proposal was made through an amendment to the Finance Bill 2017 moved by Finance Minister Arun Jaitley in the Lok Sabha.
Story first published: Wednesday, March 22, 2017, 14:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X