For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీపీఎఫ్ సొమ్ము విత్‌డ్రా నిబంధ‌న‌లు మ‌రింత స‌ర‌ళ‌త‌రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట నిచ్చే రీతిలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) నిబంధనలను ప్రభుత్వం సడలించింది. వీటిని సరళీకరించడంతోపాటు మరింత సహేతుకంగా మార్చింది. ముఖ్యంగా ఉద్యోగులు తీసుకునే అడ్వ

|

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట నిచ్చే రీతిలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) నిబంధనలను ప్రభుత్వం సడలించింది. వీటిని సరళీకరించడంతోపాటు మరింత సహేతుకంగా మార్చింది. ముఖ్యంగా ఉద్యోగులు తీసుకునే అడ్వాన్సులు, విత్‌డ్రావెల్స్‌కు సంబంధించి కనీసం 15 రోజుల వ్యవధిలోనే వారు కోరిన మొత్తాన్ని ఆమోదించాలని స్పష్టం చేసింది.ఇంత‌కుముందు దీనికి సంబంధించి నిర్దిష్ట‌మైన గ‌డువు లేదు. ప్రస్తుతం ఉన్న జిపిఎఫ్ నిబంధనలు 1960లోనే అమలులోకి వచ్చాయని, ఇప్పటివరకూ కొన్ని సవరణలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సౌక‌ర్యార్థం అవ‌స‌ర‌మైన మార్పులను చేయాల్సి వ‌చ్చింద‌ని సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

 జీపీఎఫ్ సొమ్ము విత్‌డ్రా నిబంధ‌న‌లు మ‌రింత స‌ర‌ళ‌త‌రం

ఈ మార్పుల వల్ల జిపిఎఫ్ రుణాలు తీసుకునే ప్రక్రియ మరింత సులువు అవుతుందని, అదే విధంగా ఇళ్ల నిర్మాణం, పిల్లల చదువులకు కూడా అడ్వాన్సులు తీసుకునే వెసులుబాటు ల‌భిస్తుంద‌ని తెలిపారు. అలాగే అడ్వాన్సులు, విత్‌డ్రావెల్స్‌కు సంబంధించి డాక్యుమెంటరీ ప్రూఫ్ నిబంధనను తొలగించినట్లు చెప్పుకొచ్చారు. కేవలం సదరు చందాదారు ఓ ప్రకటన ఇస్తే సరిపోతుందని, 15 రోజుల్లోనే రుణాల ఆమోదం, చెల్లింపు జరిగిపోతుందని వెల్ల‌డించారు. ఇక అస్వస్థతకు సంబంధించి ఏడు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గృహ రుణం కోసం ఉద్యోగులు ఉపసంహరించుకునే మొత్తాన్ని 90 శాతానికి పెంచామన్నారు. వాహనాలు లేదా కారు కొనుగోళ్లకు నాలుగింట మూడొంతుల మొత్తాన్ని చందాదారు ఖాతాలో మిగిలిన మొత్తం నుంచి చెల్లిందుకు వీలుంటుందని చెప్పారు.

Read more about: pf provident fund
English summary

జీపీఎఫ్ సొమ్ము విత్‌డ్రా నిబంధ‌న‌లు మ‌రింత స‌ర‌ళ‌త‌రం | GPF withdrawal rules eased Now minimum time for drawing is 15 days

In a major relief for government employees, Ministry of Personnel, Public Grievances and Pensions has announced several relaxations in General Provident Fund Rules, with liberalization and simplification, particularly relating to advances and withdrawals by the subscriber/ employee.
Story first published: Tuesday, March 21, 2017, 10:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X