For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ 130 పాయింట్లు కింద‌కు...

సెంటిమెంటును ప్రభావితం చేయగల కీలక అంశాలులేని నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ఒక ప‌క్క రూపాయి బ‌లంగా ఉండ‌టంతో సాప్ట్‌వేర్ ఎగుమ‌తులు చేసే సంస్థ‌లు ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్నా

|

సెంటిమెంటును ప్రభావితం చేయగల కీలక అంశాలులేని నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ఒక ప‌క్క రూపాయి బ‌లంగా ఉండ‌టంతో సాప్ట్‌వేర్ ఎగుమ‌తులు చేసే సంస్థ‌లు ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఐటీ సెగ మార్కెట్ల‌కు త‌గ‌ల‌డంతో రోజు మొత్తం ప్రతికూలంగా కదిలి చివరికి సూచీలు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 130 పాయింట్లు క్షీణించి 29,519 వద్ద నిలిచింది. నిఫ్టీ 33 పాయింట్లు తగ్గి 9,127 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,150 స్థాయి దిగువన ముగిసింది.

 సెన్సెక్స్ 130 పాయింట్లు కింద‌కు...

గత వారం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును పావు శాతం పెంచినప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీయ షేర్ల‌ కొనుగోళ్ల‌కు మొగ్గు చూపుతుండటం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఐటీ కౌంటర్లలో అమ్మకాలు నమోదయ్యాయి. కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ 6,000 ఉద్యోగాలకు కోత పెట్టనుందన్న అంచనాలు దేశీ లిస్టెడ్‌ ఐటీ బ్లూచిప్స్‌లో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు.

 సెన్సెక్స్ 130 పాయింట్లు కింద‌కు...

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ(1.36%), టెక్నాల‌జీ(1.23%), చ‌మురు,స‌హ‌జ‌వాయువు(0.52%), బ్యాంకింగ్‌(0.42%) న‌ష్ట‌పోగా ; వినియోగ‌దారు వ‌స్తువులు(1.03%), హెల్త్‌కేర్‌(0.44%), స్థిరాస్తి(0.25%), పీఎస్‌యూ(0.23%) లాభ‌ప‌డ్డాయి.

English summary

సెన్సెక్స్ 130 పాయింట్లు కింద‌కు... | sensex loss over 130 points as it sector in huge losses

The broader NSE index ended 33.2 points or 0.36 per cent lower at 9,126.85. It hit a record high of 9,218.40 on Friday.The benchmark BSE index closed down 130.25 points or 0.44 per cent at 29,518.74.
Story first published: Monday, March 20, 2017, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X