For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది 6 వేల మందిని తొల‌గించ‌నున్న కాగ్నిజెంట్‌

కాగ్నిజెంట్ ఈ ఏడాది రెగ్యులర్ అప్రైజల్ సైకిల్ లో భాగంగా 6వేల‌ మందిని తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఉద్యోగులు తమకు తాముగా నైపుణ్యాల అభివృ

|

ఆటోమేషన్ ప్రభావం ఐటీ ఉద్యోగులను భారీగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఐటీ కంపెనీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ 6000 మందికి ఉద్వాస‌న ప‌ల‌క‌బోతున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం ఉద్యోగుల సంఖ్య‌లో 2.3శాతం మందిని సీటీఎస్ తీసేస్తోంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో సాఫ్ట్‌వేర్ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగాల‌కు ఎస‌రు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది రెగ్యులర్ అప్రైజల్ సైకిల్ లో భాగంగా 6వేల‌ మందిని తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఉద్యోగులు తమకు తాముగా నైపుణ్యాల‌ను అభివృద్ది చేసుకోలేని పక్షంలో కంపెనీలో కొనసాగడం కష్టతరమని పేర్కొన్నాయి.

ఉద్యోగ బీమా గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

 ఈ ఏడాది 6 వేల మందిని తొల‌గించ‌నున్న కాగ్నిజెంట్‌

ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2,65,000 మంది ఉద్యోగులుండగా... వారిలో 1,88,000 మంది భారత్ లో ఉన్నారు. గతేడాది కూడా కాగ్నిజెంట్ తమ వర్క్ ఫోర్స్ లో 1-2 శాతం తగ్గించుకుంది. అయితే ప్రస్తుతం ఎంతమందిని తీసేస్తున్నట్టో కంపెనీ స్పష్టంచేయనప్పటికీ, సంబంధిత వర్గాల ప్రకారం 6000 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఖాయమంటూ వెల్లడవుతోంది. తమ వర్క్ ఫోర్స్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీలో ఎప్పటికప్పుడూ ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, వ్యాపార లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందని కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ ఏ చర్య తీసుకున్నా... అది పనితీరు ప్రకారమే ఉంటుందని చెప్పారు.

Read more about: cts cognizant automation
English summary

ఈ ఏడాది 6 వేల మందిని తొల‌గించ‌నున్న కాగ్నిజెంట్‌ | Cognizant may lay off 6000 employees this year

Information technology giant Cognizant Technology Solutions is likely to lay off at least 6,000 employees, the Times of India reported.The US listed IT company, which has a significant workforce in India, is expected to cut down its employee count by as much as 2.3 per cent.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X