For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

27 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

వ‌రుస‌గా రెండు సెష‌న్లు న‌ష్టాల‌తో ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు స్వ‌ల్ప లాభాల‌తో ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు సూచీల‌కు జోష్‌నిచ్చాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభ

|

వ‌రుస‌గా రెండు సెష‌న్లు న‌ష్టాల‌తో ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు స్వ‌ల్ప లాభాల‌తో ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు సూచీల‌కు జోష్‌నిచ్చాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభంతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 27 పాయింట్లు పెరిగి 28,929 వద్ద నిలవగా.. నిఫ్టీ 3 పాయింట్లు బలపడి 8,927 వద్ద స్థిరపడింది. ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ పెంపు ఆందోళనల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 28,986-28,815 పాయింట్ల మధ్య ఊగిస‌లాడి.. నిఫ్టీ 8945 వద్ద గరిష్టాన్నీ, 8899 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.

27 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ఈ రోజు బాగా లాభ‌ప‌డిన వాటిలో ఎస్బీఐ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్ ఉండ‌గా... డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, విప్రో, గెయిల్, టాటా స్టీల్ న‌ష్టాల‌కు గుర‌య్యాయి.

English summary

27 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌ | sensex ended with marginal gains as investors eyed exit polls

The Sensex and Nifty ended little changed on Thursday after two consecutive sessions of declines, as sentiment remained subdued ahead of the results of state elections, including that of Uttar Pradesh.Exit polls are due out around 5.30 pm local time (1200 GMT), and have often been wrong in the past, but any clear trend showing Prime Minister Narendra Modi's Bharatiya Janata Party (BJP) in front could trigger buying by investors.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X