For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోళీ ఉత్సాహంగా జ‌రుపుకోండి! అయితే క‌నీసం ఈ విధంగా పొదుపు చేయండి

హోళి అంటే రంగుల క‌ల‌బోత‌. మ‌న రంగుల జీవితానికి ద‌ర్ప‌ణంగా హోళి నిలుస్తుంది. ఆనందం, ఉత్సాహం, ప్రేమ, ఆప్యాయ‌త‌, సంతోషాల క‌ల‌బోతే ఈ రంగుల పండ‌గ‌. చెడు పై మంచి గెలిచిన రోజుకు గుర్తుగా కొంద‌రు హోలి చేసుకు

|

రంగుల‌మ‌యం మ‌న ఆర్థిక జీవ‌నం
హోళి అంటే రంగుల క‌ల‌బోత‌. మ‌న రంగుల జీవితానికి ద‌ర్ప‌ణంగా హోళి నిలుస్తుంది. ఆనందం, ఉత్సాహం, ప్రేమ, ఆప్యాయ‌త‌, సంతోషాల క‌ల‌బోతే ఈ రంగుల పండ‌గ‌. చెడు పై మంచి గెలిచిన రోజుకు గుర్తుగా కొంద‌రు హోలి చేసుకుంటే... మ‌రి కొంద‌రు శీతాకాల చ‌లి గాలుల నుంచి ఆహ్లాద‌క‌ర వ‌సంత రుతువులోనికి ప్ర‌వేశానికి హోలిని తొలి మ‌జిలీగా భావిస్తారు. ప్రేమకు, అనురాగ‌ ఆప్యాయ‌త‌ల‌కు, రంగుల‌కు ఏదో అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఈ రంగుల పండ‌గ‌కు ఇంత విశిష్ట‌త ఉంది.
రంగుల‌తో ఆట‌, నోరూరించే ప్ర‌త్యేక పండ‌గ వంట‌లు, కుటుంబ స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య జ‌రుపుకుంటామ‌నే ఆలోచ‌నే ఎంత బ‌ద్ద‌కంగా ఉండేవారికైనా ఈ పండ‌గ ఉత్సాహాన్ని క‌లిగిస్తుంది. ఇది ఒక కోణ‌మే.. రాను రాను హోళి పండ‌గ‌కున్న అస‌లైన ఉద్దేశం త‌గ్గిపోతూ వ‌స్తోంది. గ‌త కొన్నేళ్లుగా హోలి వ‌ల్ల ప్ర‌కృతికి హాని క‌లుగుతుంది. దీనిని అరిక‌ట్టేందుకు స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రం బాధ్య‌త తీసుకునేలా చర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.
హోలికా ద‌హ‌నం
హిర‌ణ్యక‌శ‌పుడి సోద‌రి అయిన హోలిక పై ప్ర‌హ్లాదుడు విజ‌యం సాధించిన‌ పురాణ క‌థ చాలా మంది పిల్ల‌ల‌కు వారి పెద్ద‌లు చెప్పే ఉంటారు. చెడుపై మంచి ఎలా గెలిచింద‌న్న‌ విష‌యాన్ని ఈ క‌థ‌ను ఉదాహ‌ర‌ణగా చెప్పే ఉంటారు. గ‌త కొంత కాలంగా వాతావార‌ణ కాలుష్యం పెరిగిపోవ‌డానికి ఈ క‌థే ప‌రోక్షంగా కార‌ణ‌మ‌వుతూ వ‌స్తోంది. ఈ పండుగ పేరు చెప్పుకొని ఏటా 30వేల వ‌ర‌కు హోలిక ద‌హ‌నాలు చేస్తునిన్నారు. ఇందుకోసం 100 కిలోల క‌ల‌ప‌ను వినియోగిస్తున్నారు. చెడుపై మంచి గెలుపున‌కై ప్ర‌తీక‌గా గంట‌ల‌కొద్దీ క‌ట్టెల‌ను కాల్చ‌డం ఒకందుకు స‌మం జ‌స‌మే అనిపించినా దీని వ‌ల్ల‌ వాతావ‌ర‌ణంలోనికి 50 ల‌క్ష‌ల బొగ్గుపులుసు వాయువు బ‌య‌ట‌కు విడుద‌ల‌వుతుంద‌ని అంచ‌నా. కాలుష్యం పెరుగుతూ వ‌స్తోన్న ఈ క్ర‌మంలో క‌ల‌ప‌ను కాల్చడాన్నే నిరుత్సాహ‌ప‌ర‌చాలి. పెద్ద న‌గ‌రాల్లో కాలుష్యం మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. ఇక్క‌డ నియంత్ర‌ణ ఎక్కువ‌గా తీసుకురావాల్సి ఉంటుంది. చెక్క‌కు ప్ర‌త్యామ్నాయంగా హోలికా ద‌హ‌నానికి పొట్టును వాడుకునే విధంగా ఆలోచ‌న చేయాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు పాటిస్తే అటు ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డ‌మే కాక ఇటు పండుగ వాతావార‌ణాన్ని ఆహ్లాదంగా జ‌రుపుకోగలం.
నీటి వినియోగంపై నిఘా
హోలిక ద‌హ‌నం త‌ర్వాత అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూసే రంగుల పండ‌గ రానే వ‌స్తుంది. ఎప్పుడెప్పుడు తెలవారుతుంద‌ని ఎదురుచూసి ఆఖ‌రుకు సూర్యుడు ఉద‌యించ‌గానే పిల్ల‌లు ఎంతో ఉత్సాహంగా బ‌కెట్ల కొద్దీ నీటిని నింపుకొని, దాంట్లో రంగులు నింపి , పిచికారీల‌ను త‌యారు చేసుకొని ఒక‌రిపై ఒక‌రు రంగులు వేసుకునేందుకు ఉర‌క‌లెత్తుతారు. పెద్ద‌లు రంగులు క‌లిపిన ప్లేటుతో, మిఠాయిల‌తో సిద్ధంగా ఉంటారు. ఇంత ఆనందంలో సగ‌టున ఎంత నీటిని వినియోగిస్తున్నామ‌న్న విష‌యాన్ని విస్మ‌రిస్తాం. ఆ.. ఒక్క‌రోజే క‌దా అని అనుకుంటాం.. అయితే ఏటా 3.5కోట్ల మంది ఈ రోజు రంగుల‌తో ఆడుకుంటార‌ని ఓ అంచ‌నా. ప్ర‌తి ఒక్క‌రూ సగ‌టున 3 బ‌కెట్ల నీటిని వినియోగిస్తే అది 45 లీట‌ర్ల‌కు స‌మానం. ఈ లెక్క‌న 150 కోట్ల నీటిని వృథా చేస్తున్నాం. ఈ నీటిలో కొంతైనా రుచిక‌ర వంట‌కాలు చేయాడానికి ఉప‌యోగ‌ప‌డ‌తుంది. లేదా మొక్క‌ల‌కు స‌రిప‌డా నీరు అందించ‌వ‌చ్చు. హోలి పై వృథా చేసే నీటిపై మ‌న‌మెందుకు ఇంత‌గా ఆలోచించాలంటే దానికీ స‌రైన కార‌ణం ఉంది. మ‌న దేశంలో దాదాపు 7.6 కోట్ల మందికి స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అంద‌డంలేదు. తాగునీటి కోసం మైళ్ల దూరం న‌డ‌వాల్సి వ‌స్తోంది. అదీకాకుండా నీటి వ‌న‌రుల్లో 10శాతం మేర కాలుష్యంతో నిండి వినియోగానికి ఏ మాత్రం ప‌నికి రాకుండా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు ప్ర‌భుత్వం ఏటా 3.4 ల‌క్ష‌ల కోట్లు వెచ్చిస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. ఈ లెక్క‌ల‌న్నీ ఒక సారి త‌ర‌చి చూశాక మ‌న వంతుగా నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలో ఆలోచించాల్సిందే. ఈ అమూల్య‌మైన జ‌లాన్ని బావిత‌రాల‌కు భ‌ద్రంగా అందించడం మ‌న చేతుల్లోనే ఉంది.
చిన్న పిల్ల‌లే బాధితులు
ఓ సంస్థ జ‌రిపిన స‌ర్వేలో కొన్ని చేదు నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 10 నుంచి 20 మ‌ధ్య వ‌య‌సు గ‌ల వారు 80శాతం పిల్ల‌లు, యువ‌కులు ఎక్కువ‌గా హోళి ఆడుతుంటారు. ప్ర‌మాద‌క‌ర మైన , కృత్రిమ రంగుల‌తోనే పండుగ జ‌రుపుకుంటారు. ఇలా హానికార‌క రంగుల‌తో ఆడుకుంటున్నామ‌న్న సంగ‌తి కేవ‌లం 15శాతం మందికి మాత్ర‌మే అవ‌గాహ‌న ఉంది. వ‌య‌సు పెరిగే కొద్దీ రంగుల‌తో ఆడుకుంటే ప్ర‌మాదం అన్న సంగ‌తి తెలుస్తూ ఉండే కొద్దీ పెద్ద వ‌య‌సువారిలోనూ ఆస‌క్తి త‌గ్గుతూ వ‌స్తోంది. 31 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న‌వారు కేవ‌లం 35శాత‌మే రంగుల కేళి ఆడుకుంటుండ‌గా 50ఏళ్ల పైబ‌డిన వారు కేవ‌లం 5శాతం మాత్ర‌మే రంగుల పండుగ జ‌రుపుకుంటారు. చ‌ర్మ‌సంబంధ రుగ్మ‌త‌ల‌ ప్ర‌భావం హోళి త‌ర్వాత ఎక్కువ‌గా క‌నిపించ‌డం ప‌రిపాటిగా మార‌డంతో కృత్రిమ రంగుల‌పై అవ‌గాహ‌న క‌లిగించ‌డం ఒక సామాజిక బాధ్య‌త‌గా తీసుకోవాలి. దీనికి ప‌రిష్కారంగా స‌హ‌జ రంగుల‌ను వాడ‌డం ఉత్త‌మం లేదా ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా స‌ర‌ఫ‌రా అయ్యే రంగుల‌ను ఉప‌యోగించ‌డం అన్ని విధాల మంచిది.

జంతువులూ ఇబ్బందులు ప‌డతాయ్‌... జ‌ర ఆలోచించండి
నీటి వ‌న‌రుల‌పై ప్ర‌భావం హోళి రంగుల ప్ర‌భావం ఆడుకునే మ‌న‌లాంటి వాళ్ల‌కు మాత్ర‌మే కాదు అన్న సంగ‌తి గుర్తుంచుకోవాలి. కృత్రిమ రంగుల దుష్ప‌ప్ర‌భావం ఇంక అనేక చోట్ల‌కు వ్యాపించి ఉంది. వీధి జంతువులు కూడా దీని ప్ర‌భావానికి గుర‌వుతాయి. రీసెర్చ్ జ‌ర్న‌ల్ చేసిన స‌ర్వే ప్ర‌కారం హోళి త‌ర్వాస్ నీటి వ‌న‌రుల పీహెచ్ స్తాయి 6.1 క‌న్నా కింద‌కు ప‌డిపోతుంది. నీటి కఠిన‌త్వం 720 పీపీఎం కు చేరుతుంది. ర‌సాయ‌న శాస్త్రం పాఠాలు అర్థం కాని వారికి సులభంగా చెప్పాలంటే ఈ నీటి పీహెచ్ మూత్రం పీహెచ్ న‌కు స‌మానం. స్వ‌చ్ఛ‌మైన డిస్టిల్డ్ నీటిలో ఉండే హైడ్రోజ‌న్ల‌ అయాన్ల కంటే 10 రెట్లు ఎక్కువ‌గా హోళి వ‌ల్ల క‌లుషిత‌మైన నీటిలో ఉంటుంద‌ని తేలింది. మ‌న సొంత పెంపుడు జంతువుల‌నే అటువంటి హానికార‌క నీటిని తాగ‌నివ్వ‌న‌ప్పుడు ఇత‌ర జంతువులు మాత్రం వాటిని ఎలా తాగ‌గ‌ల‌వు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్తితులు ఏర్ప‌డ‌కుండా నీటి వ‌న‌రులున్న చోట హోళి ఆడ‌క‌పోవ‌డ‌మే మంచిది. ముఖ్యంగా జంతువులు నీరు తాగే కొల‌నుల వ‌ద్ద హోళి ఆడ‌డాన్ని నిషేధించాలి.
ఆదా చేసిన నీటితో ఇలా...
హోళి నాడు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని నీటిని పొదుపుగా వాడుతాం స‌రే అయితే ఎక్కువ‌గా ఉన్న నీటిని మంచి అవ‌స‌రాల‌కు ఎలా ఉప‌యోగించుకోవ‌చ్చో చూద్దాం.. ప్ర‌తి సంవ‌త్స‌రం చెట్ల‌ను కాపాడ‌డం, ప‌చ్చ‌ద‌నాన్ని . పెంపొందించ‌డం గురించి మాట్లాడుతుంటాం. హోళి రోజు పొదుపు చేసిన నీటితో 100 కోట్ల వృక్షాల‌కు నీరు అందించ‌వ‌చ్చు. లేదా ఈ నీటితో మ‌నకిష్ట‌మైన‌ తేనీరు త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ నీటితో 157 వంద‌ల కోట్ల క‌ప్పుల తేనీటిని తయారు చేసుకోగ‌లం. మ‌న కిష్ట‌మైన‌ పండుగ మిఠాయిల‌ను 450 రెట్లు అధికంగా వండుకోగ‌లం. అందుకే ఈ సారి హోళి ప‌ర్యావ‌ర‌ణ హితంగా జ‌రుపుకుందాం. మొత్తం నీరు లేకుండా ఆడుకోమ‌ని కాదు కానీ ..ఫౌంటెయిన్‌లు, పంపులు వాడ‌కుండా రంగుల పిచికారీలు, బెలూన్ల వంటి వాటితో త‌క్కువ నీటిని ఉప‌యోగించి ఆనందంగా హోళి జ‌రుపుకుందాం.

celebrate this holi with oneindia coupons

ఆనంద‌క‌ర‌మైన హోళి జ‌రుపుకోవ‌డానికి ఎప్పుడూ .సిద్దంగా ఉండ‌డం మంచిది. అయితే ఈ ఏడాది మాత్రం నీటితో పాటు డ‌బ్బులు కూడా ఆదా అయ్యేలా చూసుకుందాం. భ‌విష్య‌త్ గురించి కూడా ఆలోచించాల్సి ఉంంటుంది. మీ ద‌గ్గర ఎలాంటి ఐడియాలు లేక‌పోతే మేము మీకు ఓ చ‌క్క‌ని ఐడియా ఇస్తాం. హానికార‌క రంగుల‌ను వాడే బ‌దులు స‌హ‌జ‌మైన రంగుల‌ను వాడండి. నీటిని వినియోగించే బ‌దులు పొడి రంగుల‌ను ఉప‌యోగించ‌డం గురించి ఆలోచించండి. పొడి రంగును శుభ్రం చేసుకోవ‌డం చాలా సుల‌భం పైగా నీరు త‌క్కువ‌గా అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇవ‌న్నీ కాకుండా మ‌ధ్యాహ్నం పూట స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఇష్ట‌మైన పిండివంట‌లు తింటుంటే ఆ మ‌జాయే వేరు. మీ కోసం మేము ఓ స‌హాయం చేయ‌గ‌లం. మీ ఇష్ట‌మైన తినుబండారాల‌ను ఆర్డ‌ర్ చేయ‌డం ద్వారా ఇంటికే తెప్పించ‌గ‌లం. శ్ర‌మ‌తో పాటు డ‌బ్బును ఆదా చేసుకోవ‌డానికి ఇదో చ‌క్క‌ని మార్గం. కూప‌న్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి. ఇక ఆల‌స్యం దేనికి .. బ‌య‌ట‌కు వెళ్లి హోళి పండుగ‌ను ఎంజాయి చేయండి. భ‌విష్య‌త్ లోఆనందించాలంటే ప్ర‌స్తుతం మ‌నం ఆదా చేసుకోవ‌డం అల‌వ‌ర్చుకోవాలి. అది నీరైన కావొచ్చు లేదా సంప‌దైనా కావొచ్చు.

Read more about: coupons oneindia oneindia coupons
English summary

హోళీ ఉత్సాహంగా జ‌రుపుకోండి! అయితే క‌నీసం ఈ విధంగా పొదుపు చేయండి | A Holi of Love Play and enjoy the festivities but do not forget to save

you should do, then we have a fantastic idea for you. How about instead of spending your well earned money on harmful chemical colour, go for the natural ones that do not harm the skin? How about instead of using water, we use dry colours, that are easy to remove and not use as much water? How about sitting down in the afternoon to enjoy some lovely snacks with your family and loved ones? And if you are wondering what to order (apart from gujiyas, phirnis, thandai, gol gappe and dahi bhalle, which always do the trick for us), we can offer you some more help in not just ordering those dishes, but helping your pocket save substantially on them.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X