For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉచిత గ్యాస్ స‌బ్సిడీకి సైతం ఆధార్ త‌ప్ప‌నిస‌రి

ఇక‌పై ఉచిత గ్యాస్ స‌బ్సిడీని పొందేందుకు ఆధార్ వివ‌రాలు త‌ప్ప‌క ఇవ్వాల్సిందే.దారిద్ర్య‌రేఖ‌కు దిగువ ఉన్న మ‌హిళ‌లంతా ఆధార్ వివ‌రాల‌ను మే31 లోపు స‌మ‌ర్పించాల్సిందేన‌ని కేంద్రం వెల్ల‌డించింది.గ‌తేడాది ప‌హ

|

ఇక‌పై ఉచిత గ్యాస్ స‌బ్సిడీని పొందేందుకు ఆధార్ వివ‌రాలు త‌ప్ప‌క ఇవ్వాల్సిందే. దారిద్ర్య‌రేఖ‌కు దిగువ ఉన్న మ‌హిళ‌లంతా ఆధార్ వివ‌రాల‌ను మే31 లోపు స‌మ‌ర్పించాల్సిందేన‌ని కేంద్రం వెల్ల‌డించింది. ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల్ యోజ‌న కింద ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్ పొందాలంటే వారంతా గ‌డువు లోపు ఆధార్ కోసం ఎన్‌రోల్ చేసుకోవాల‌ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గ‌త ఏడాది ప‌హ‌ల్ ప‌థకం కింద స‌బ్సిడీ సిలిండ‌ర్ల‌ను పొందాంటేనే ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే.

 ఉచిత గ్యాస్ స‌బ్సిడీకి సైతం ఆధార్ త‌ప్ప‌నిస‌రి

గ‌త వారం రోజులుగా వివిధ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్‌ను త‌ప్ప‌నిసరి చేస్తున్న క్ర‌మంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కానికి అర్హులుగా ఉన్న వారు సైతం ఆధార్ స‌మ‌ర్పించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల్ యోజ‌న కింద కేంద్రం ఇప్ప‌టికే 1.67 కోట్ల కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్ల‌ను పంపిణీ చేసింది. దేశ‌వ్యాప్తంగా ధ‌న‌వంతులు(అధిక ఆదాయ వ‌ర్గాల వారు) స్వ‌చ్చందంగా గ్యాస్ సబ్సిడీని వ‌దులుకోవ‌డంతో ఆ ప్ర‌యోజ‌నాల‌న్నీ కింది స్థాయి వ‌ర్గాల‌కు బ‌ద‌లాయిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్ని చేస్తున్నా ఇప్ప‌టికీ గ్రామాల్లో కొంత మంది గ్యాస్ వాడ‌కుండా క‌ట్టెల పొయ్యి వాడుతుండ‌టంతో కేంద్రం దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఇంటికీ గ్యాస్ ఉండేలా చూసేందుకు ప‌లు చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది. అయితే ఇక్క‌డ అక్ర‌మాలు చోటుచేసుకునే వీలుండ‌టంతో ఆధార్ సాయంతో ల‌బ్దిదారుల‌కు మేలు జ‌రిగేలా, ప‌థ‌కం ద్వారా అన‌ర్హులను క‌ట్ట‌డి చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది.

Read more about: gas aadhar lpg
English summary

ఉచిత గ్యాస్ స‌బ్సిడీకి సైతం ఆధార్ త‌ప్ప‌నిస‌రి | Aadhaar is now must for free LPG connection under PMUY scheme

The government has made having an Aadhaar card must for poor women to avail of free cooking gas (LPG) connection under the Pradhan Mantri Ujjwala Yojana.While the government in October last year had made the unique identification number mandatory for everyone to get LPG subsidies, it has now extended the same for free cooking gas connections to women of BPL households.
Story first published: Wednesday, March 8, 2017, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X